సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సూచిం చిన ఫైళ్లను కొన్ని శాఖల అధికారులు జాప్యం చేస్తున్నారు. తన ఆదేశాల అమల్లో అధికా రుల తాత్సారంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో సీఎం నుంచి వచ్చే ఫైళ్లు, ఆదేశాలపై ఆయా శాఖల అధికారులు తక్షణం స్పందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్‌కు సీఎంవో సూచించింది. ఈ మేరకు సీఎంవో అధికారి రాజశేఖర్‌రెడ్డి సీఎస్‌కు నోట్ పంపినట్లు తెలిసింది. బుధవారం అన్ని శాఖల కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు సీఎస్ సర్క్యులర్ జారీ చేశారు.
ముఖ్యమంత్రి, సీఎంవో స్థాయి నుంచి వచ్చే ఆదేశాలను వెంటనే అమలు చేయాలని సూచించారు. సీఎంవో ఫైళ్లను అత్యవసర, అత్యంత ప్రాధాన్యమున్న అంశాలుగా పరిగణించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. ఆ తర్వాతే ఫైలు సర్క్యులేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. సీఎం సంతకం చేసిన ఫైల్ తాలూకు ఆదేశాలను వారం రోజుల్లో, వివిధ శాఖల ప్రమేయం ఉన్న ఫైళ్లను 15 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
ఉత్తర్వు లకు కావాల్సిన సమాచారాన్ని సంబంధిత అధికారులు, శాఖల నుంచి మెసేజ్‌లు, ఈ మెయిల్స్ ద్వారా తెప్పించుకోవాలని కోరారు. సంబంధిత ఫైళ్లలో ఉన్న ఆర్థిక, న్యాయ పరమైన అడ్డంకులను సీఎంవోలోని సంబం ధిత అధికారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఆ విషయాన్ని అధికారులు సీఎంకు నివేదించే వీలు ఉంటుందని ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment