తండ్రీకొడుకులు సమస్యలు పరిష్కరించరా?
హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెపై వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తండ్రి ఓ శాఖ, కొడుకు ఓ శాఖ చేతిలో పెట్టుకుని సమస్యలు పరిష్కరించకపోవడం దారుణం అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
కాగా, వేతనాల పెంపుతో సహా 16 డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం ఉదయం నుంచి సమ్మె చేపట్టారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు స్తంభించిపోయాయి. మరోవైపు కార్మికులతో సమ్మె విరమింపజేయడానికి తొలిరోజు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు.