
కేసీఆర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కేసీఆర్ ప్రయాణించిన హెలీకాఫ్టర్ టేకాఫ్ కావడానికి కొద్ది సమయం ముందు అందులో మంటలు వ్యాపించాయి. సీఎం ఆఫీసుకు చెందిన ఓ బ్యాగులోంచి మంటలు వ్యాపించినట్టు గుర్తించారు. అప్రమత్తమైన సెక్యురిటీ సిబ్బంది వెంటనే ఆ బ్యాగును హెలీప్యాడ్ సమీపంలో పడేశారు. అనంతరం కేసీఆర్ అదే హెలీకాప్టర్‌లో బయలుదేరారు. ఈ సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.
కాగా, ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపానని, కేసీఆర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. ఆదిలాబాద్ టూర్‌లో సీఎం ఉన్నారని తెలిపారు. 'చింతించాల్సిన అవసరం లేదు ... ఆల్ ఇజ్ వెల్' అని కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment