సైఫాబాద్ కళాశాలలో అలజడి
- నాగదేవత విగ్రహం ఉందంటూ ఓ విద్యార్థినికి పూనకం
- తవ్వకాలు చేపట్టాలంటూ తోటి విద్యార్థులపై ఒత్తిడి
హైదరాబాద్: కళాశాలలో ఓ యువతి వింతగా ప్రవవర్తించడంతో తోటివిద్యార్థులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని సైఫాబాద్ పీజీ సైన్స్ కళాశాలలో చోటు చేసుకుంది. అత్తాపూర్‌కు చెందిన మహేశ్వరి సైఫాబాద్ కాలేజ్‌లోనే ఇటీవల పీజీ పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం కాలేజ్ ప్రాంగణంలోని ఓ ప్రదేశంలో నాగదేవత విగ్రహం ఉందంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. తాను సూచించిన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాలని కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులపై ఒత్తిడి తెచ్చింది.
ఆమె ఒత్తిడి మేరకు విద్యార్థులంతా సాయంత్రం తవ్వకాలు ప్రారంభించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు తవ్వకాలు నిలిపి వేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఇందుకు నిరాకరించడంతో స్వల్పంగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నా యి. చివరకు పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి మహేశ్వరిని చికిత్సకోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తె లుసుకున్న సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అక్కడికి వచ్చి విద్యార్థులను వివరాలు అడిగి తెలసుకున్నారు. శాస్త్రీయంగా తవ్వకాలు జరిపేందుకు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.