హన్మకొండ: కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన దాడికి నిరసనగా ఆ పార్టీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంగళవారం ఉదయం వరంగల్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో కాంగ్రెస్ భనవ్ ముందు ఆ పార్టీ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మకు నిప్పటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.