సాక్షి, మంచిర్యాల : వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే నాయకులు లేకపోవడంతో జిల్లాలోని ఆ పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. పార్టీలో అన్ని తామే అని ఆధిపత్య పోరు నడిపించిన నాయకులు గప్‌చుప్‌గా ఉండటంతో శ్రేణులకు మార్గదర్శకం కరువైంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమేనని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక, పురపాలక, సార్వత్రిక ఫలితాలన్నింటిలోనూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు చేదు ఫలితాన్ని మూటగట్టుకుంది.
మంచిర్యాల మున్సిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యం సంపాదించగా, బెల్లంపల్లి పురపాలకంలో పీఠం కైవసం చేసుకునేందుకు కావాల్సిన స్థానాలకుసమీప స్థాయిలో ఉంది. ఇవే చెప్పుకోదగ్గ ఫలితాలుగా ఉన్నాయి. మండల ప్రాదేశిక ఫలితాల్లోనూ ఆ పార్టీ పరాభవం మూటగట్టుకుంది. తెలంగాణ ఏర్పాటు క్రె డిట్‌తో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు దక్కించుకోవడమే కాకుండా జెడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కావాల్సిన స్థానాల కంటే ఎక్కువ సభ్యులనే ఆ పార్టీ గెలుచుకుంది.
కనిపించని ఉద్దండులు
పది రోజుల క్రితం వెలువడిన సార ్వత్రిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి శ్రేణులను నిరాశకు గురిచేశాయి. కేవలం ఒకే ఒక ముథోల్ అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ ఎంపీ సహా పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, బెల్లంపల్లిలో ఆ పార్టీ మద్దతు ఇచ్చిన గుండా మల్లేశ్ ఓటమి పాలయ్యారు. ఇదే ఫలితాల్లో జిల్లా కాంగ్రెస్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రయత్నించిన తాజా మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావులు అపజయం పాలయ్యారు.
ఈ ఎన్నికల్లో వీరిద్దరు బరిలో నిలవడమే కాకుండా వారి వర్గం నాయకులను రంగంలో నిలిపారు. అయితే వారు కూడా ఓటమి పాలయ్యారు. ఓటమి పాలయిన అభ్యర్థులతోపాటు ఆయా నియోజకవర్గాల్లోని ద్వితియ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో ఇప్పటివరకు కనీసం సమీక్షా సమావేశాలు ఆ పార్టీ తరఫున లేదా ఆయా నాయకులు ఏర్పాటు చేయలేదు. సమావేశం ఏర్పాటు చేసి ఓటమికి కారణాలు విశ్లేషించడంతోపాటు తమకు భవిష్యత్ మార్గదర్శకం చేయాల్సిందని నాయకులు, పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
‘స్థానిక’ పీఠాలపై నిరాసక్తత
జిల్లాలో మొత్తం 52 జెడ్పీటీసీ స్థానాలను కేవలం పది స్థానాలను మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జిల్లాలోని 636 ఎంపీటీసీ స్థానాలకు 165 మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. కేవలం నాలుగు మండల పరిషత్ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కింది. మున్సిపాలిటీలోను కేవలం మంచిర్యాల, బె ల్లంపల్లి అధ్యక్ష స్థానాలపై మాత్రమే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఈ విధంగా నిరాసక ్తంగా ఉన్న ఫలితాల నేపథ్యంలో శ్రేణులకు మార్గదర్శకం చేయాల్సిన పార్టీ, పార్టీ అగ్రనేతలు వారి ఊసే ఎత్తకపోవడం ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్ నేత లు క్యాంపుల నిర్వహణలో బిజీబిజీగా ఉంటే కాంగ్రెస్‌లో ఆ సందడి లేకపోవడం గమనార్హం. నాయకులు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని ఆ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.
హస్తవ్యస్తం
Published Mon, May 26 2014 12:35 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement