general results
-
18న జిల్లాకు టీపీసీసీ చీఫ్ రాక
- సార్వత్రిక ఫలితాలపై నేతలతో సమీక్ష - భవిష్యత్ కార్యాచరణపై కేడర్‌తో చర్చ - ఓటమికి కారణాలపై విశ్లేషణ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఈనెల 18న జిల్లాకు రానున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జిల్లాకు రెండు సార్లు వచ్చారు. అంతకు ముందు భారీ నీటి పారుదలశాఖ మంత్రిగా జిల్లాలో పర్యటించినా.. టీపీసీసీ అధ్యక్షునిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పొన్నాల లక్ష్మయ్య మరోమారు జిల్లాకు వస్తున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డి.శ్రీనివాస్, పి.సుదర్శన్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, కేఆర్ సురేశ్‌రెడ్డి తదితరులకు సమాచారం అందించిన పిదప జిల్లా పర్యటనకు సిద్ధమైనట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని విధంగా దెబ్బ తగిలింది. రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, కాంగ్రెస్ రెండో లేదా మూడో స్థానంలో నిలిచింది. ఘోరపరాజయంపై తెలంగాణ జిల్లాల్లో ‘పోస్టుమార్టం’ నిర్వహిస్తున్న పొన్నాల లక్ష్మయ్య.. జిల్లాలోనూ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించనున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలతో కూడా మాట్లాడి అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఓటమిపై సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఆయన పార్టీ శ్రేణులకు వివరించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
వామపక్షాల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఒక వెలుగు వెలిగిన వామపక్షాల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. సుదీర్ఘకాలం పాటు జిల్లా రాజకీయాల్లో తమదైన శైలిలో విశిష్ట పాత్ర పోషించిన వామపక్షాలు... తాజాగా వెలువడిన సార్వత్రిక ఫలితాల అనంతరం కుదేలైపోయాయి. జిల్లాలోని ప్రధాన వామపక్షాలైన సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ)లలో ఒక్క సీపీఎంకు మాత్రమే కేవలం ఒక అసెంబ్లీ స్థానం దక్కగా, మిగిలిన రెండు పార్టీలు తెలంగాణ నూతన అసెంబ్లీలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కోల్పోయాయి. క్షేత్రస్థాయిలో బలం చెదురుతోందా? దశాబ్దాల రాజకీయ పరిణామాలను గమనిస్తే... వామపక్షాలకు పుట్టినిల్లయిన ఖమ్మం జిల్లాలో కామ్రేడ్లు క్రమేపీ పట్టు కోల్పోతున్నారనే చర్చ నడుస్తోంది. వామపక్షాల బలాన్ని గుర్తించేందుకు ఎన్నికలే ప్రాతిపదికగా అంచనా వేసే పరిస్థితి లేకపోయినా... క్షేత్రస్థాయిలో కూడా ఆ పార్టీల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందనే వాదన వినబడుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో ఒకప్పుడు ఈ మూడు పార్టీలలో ఏదో ఒక పార్టీ బలంగా ఉండేది. కొన్ని చోట్ల అయితే రెండు పార్టీలు బలంగా ఉండి వారిద్దరే ఆధిపత్యం కోసం పోరాటం చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మూడు పార్టీలు మూడు నియోజకవర్గాల్లో మాత్రమే ఉనికిని చాటుకోగలిగాయి. మిగిలిన చోట్ల రెండు, మూడు మండలాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో అసలు జిల్లాలోని మూడు ప్రధాన వామపక్షాల భవిష్యత్తుపై కేడర్‌లో భరోసా లేకుండా పోతోంది. ప్రజాసమస్యల పరిష్కారంలో తమ పాత్ర ఎలా ఉంటుందో అంతుపట్టడం లేదని, ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలోని కామ్రేడ్లను మళ్లీ గాడిలో పెట్టడం ఎలా అనేది అర్థం కావడం లేదని జిల్లాకు చెందిన ఓ ముఖ్య కమ్యూనిస్టు నాయకుడే వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. మార్క్సిస్టుల బలం ఏమైంది? ముఖ్యంగా ఖమ్మం పరిసరాలు, భద్రాచలం ఏజెన్సీలో బలంగా ఉండే సీపీఎం ఇప్పుడు రెండు చోట్లా పట్టుకోల్పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భద్రాచలంలో వైఎస్సార్సీపీతో అవగాహనతో పాటు అక్కడి కాంగ్రెస్, టీడీపీల్లో నెలకొన్న వర్గ విభేదాలు సీపీఎంకు విజయాన్ని చేకూర్చాయి. వాస్తవానికి అసెంబ్లీ కౌంటింగ్‌లో ఒక సమయంలో సీపీఎం దా దాపు పరాజయం అంచున నిల్చుంది. అయి తే, వెంకటాపురం, చింతూరు మండలాల్లో పెద్ద ఎత్తున ఆధిక్యం సంపాదించి అత్తెసరు మెజార్టీతో గెలుపొందింది. స్థానిక ఎన్నికల ఫలితాల్లోనూ సీపీఎం ఆశించినన్ని స్థానాలు పొందలేకపోయింది. మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో 97 వార్డులకు ఎన్నికలు జరిగితే మధిర మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో మాత్రమే సీపీఎం గెలుపొందింది. ఇక జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి కేవలం రెండు జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలే దక్కాయి. ఈ పరిస్థితుల్లో సీపీఎం మళ్లీ పుంజుకుంటుందా అనేది జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. అయితే, ఆ పార్టీ తెలంగాణ సారథ్య బాధ్యతలు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు తమ్మినేని వీరభద్రానికి దక్కిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పోషించే నూతన పాత్ర, నిర్మించే ప్రజా ఉద్యమాలను బట్టి పార్టీ భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే, ప్రస్తుతానికి మాత్రం పార్టీ నాయకత్వం పూర్తిగా మేధోమథనంలో పడి, పార్టీ పరాజయానికి కారణాలు వెతుక్కునే పనిలో ఉంది. సీపీఐకి కష్టకాలం ఇక, జిల్లాలో మరో ప్రధాన వామపక్షమైన సీపీఐకి కూడా తాజా ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. గత శాసనసభలో జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుండగా, ఇప్పుడు అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకోగా, స్వయంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్. కె. నారాయణ ఖమ్మం ఎంపీ బరిలో నిలిచినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రాలేదు. ఆయనతో పాటు జిల్లాలో ఆ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులంతా ఓటమిపాలు కావడం పార్టీ నాయకత్వంతో పాటు కేడర్‌ను కూడా నైరాశ్యంలో ముంచింది. ఇక స్థానిక సంస్థల విషయానికి వస్తే ఆ పార్టీకి 13 మున్సిపల్వార్డులు, ఒక జెడ్పీటీసీ, 43 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే లభించాయి. సార్వత్రిక పరాజ యంతో పాటు మున్సిపల్, పరిషత్ ఎన్నికలో ్లనూ నామమాత్రపు ఫలితాలే సాధించడంతో సీపీఐ భవిష్యత్తుపై ఆ పార్టీ సానుభూతిపరు లు, కార్యకర్తల్లో బెంగ నెలకొంది. ప్రత్యేక తె లంగాణ వాదాన్ని భుజానెత్తుకున్నా ఫలితం లేకపోవడంతో ఇప్పుడేం చేయాలన్న దానిపై పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆశించిన ఫలితం లేని ఎన్డీ సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) విషయానికి వస్తే ఆ పార్టీ రెండు వర్గాలుగా ఎన్నికలకు ముందే చీలిపోయింది. రాయల, చంద్రన్న వర్గాలుగా ఎన్నికల బరిలో నిలిచాయి పార్టీ శ్రేణులు. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీచేసినా కేవలం ఒక్క ఇల్లెందు అసెంబ్లీనే టార్గెట్‌గా పనిచేశాయి. కానీ ఎక్కడా అనుకూల ఫలితం రాలేదు. ఇక పరిషత్ ఎన్నికలలో మాత్రం పార్టీ పట్టున్న చోట సత్తా చాటింది . ఇల్లెందు నియోజకవర్గంతో పాటు గుండాల మండలంలో మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 3 జెడ్పీటీసీలతో పాటు 30 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే కేవలం ఇల్లెందులో మాత్రమే చెరో వర్గం... ఒక్కో కౌన్సిలర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మొత్తంగా ఆశించిన ఫలితాలు రాని పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎలా నెగ్గుకురావాలన్నది ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వం ముందున్న ప్రశ్న. -
హస్తవ్యస్తం
సాక్షి, మంచిర్యాల : వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే నాయకులు లేకపోవడంతో జిల్లాలోని ఆ పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. పార్టీలో అన్ని తామే అని ఆధిపత్య పోరు నడిపించిన నాయకులు గప్‌చుప్‌గా ఉండటంతో శ్రేణులకు మార్గదర్శకం కరువైంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమేనని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక, పురపాలక, సార్వత్రిక ఫలితాలన్నింటిలోనూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు చేదు ఫలితాన్ని మూటగట్టుకుంది. మంచిర్యాల మున్సిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యం సంపాదించగా, బెల్లంపల్లి పురపాలకంలో పీఠం కైవసం చేసుకునేందుకు కావాల్సిన స్థానాలకుసమీప స్థాయిలో ఉంది. ఇవే చెప్పుకోదగ్గ ఫలితాలుగా ఉన్నాయి. మండల ప్రాదేశిక ఫలితాల్లోనూ ఆ పార్టీ పరాభవం మూటగట్టుకుంది. తెలంగాణ ఏర్పాటు క్రె డిట్తో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు దక్కించుకోవడమే కాకుండా జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కావాల్సిన స్థానాల కంటే ఎక్కువ సభ్యులనే ఆ పార్టీ గెలుచుకుంది. కనిపించని ఉద్దండులు పది రోజుల క్రితం వెలువడిన సార ్వత్రిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి శ్రేణులను నిరాశకు గురిచేశాయి. కేవలం ఒకే ఒక ముథోల్ అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ ఎంపీ సహా పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, బెల్లంపల్లిలో ఆ పార్టీ మద్దతు ఇచ్చిన గుండా మల్లేశ్ ఓటమి పాలయ్యారు. ఇదే ఫలితాల్లో జిల్లా కాంగ్రెస్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రయత్నించిన తాజా మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావులు అపజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరు బరిలో నిలవడమే కాకుండా వారి వర్గం నాయకులను రంగంలో నిలిపారు. అయితే వారు కూడా ఓటమి పాలయ్యారు. ఓటమి పాలయిన అభ్యర్థులతోపాటు ఆయా నియోజకవర్గాల్లోని ద్వితియ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో ఇప్పటివరకు కనీసం సమీక్షా సమావేశాలు ఆ పార్టీ తరఫున లేదా ఆయా నాయకులు ఏర్పాటు చేయలేదు. సమావేశం ఏర్పాటు చేసి ఓటమికి కారణాలు విశ్లేషించడంతోపాటు తమకు భవిష్యత్ మార్గదర్శకం చేయాల్సిందని నాయకులు, పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘స్థానిక’ పీఠాలపై నిరాసక్తత జిల్లాలో మొత్తం 52 జెడ్పీటీసీ స్థానాలను కేవలం పది స్థానాలను మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జిల్లాలోని 636 ఎంపీటీసీ స్థానాలకు 165 మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. కేవలం నాలుగు మండల పరిషత్ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కింది. మున్సిపాలిటీలోను కేవలం మంచిర్యాల, బె ల్లంపల్లి అధ్యక్ష స్థానాలపై మాత్రమే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఈ విధంగా నిరాసక ్తంగా ఉన్న ఫలితాల నేపథ్యంలో శ్రేణులకు మార్గదర్శకం చేయాల్సిన పార్టీ, పార్టీ అగ్రనేతలు వారి ఊసే ఎత్తకపోవడం ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ నేత లు క్యాంపుల నిర్వహణలో బిజీబిజీగా ఉంటే కాంగ్రెస్‌లో ఆ సందడి లేకపోవడం గమనార్హం. నాయకులు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని ఆ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. -
తేలనున్న మాజీ హోం తనయుల భవితవ్యం
హైదరాబాద్ : పోటాపోటీగా జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో హేమాహేమీలతోపాటు రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మాజీ హోం మంత్రుల తనయుల భవితవ్యం కూడా తేలనుంది. చేవెళ్ల నుంచి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉండగా, టీడీపీ నుంచి మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేంద్ర గౌడ్ పోటీలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా రాఘవరెడ్డి, టీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాలు ఇక్కడే... కౌంటింగ్ కేంద్రం ........... నియోజకవర్గాలు డీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీ, ........... మేడ్చల్, మల్కాజిగిరి, బౌరాంపేట్, కుత్బుల్లాపూర్ ......... కుత్బుల్లాపూర్, కూకట్పల్లి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ....... ఉప్పల్, ఎల్బీనగర్ శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ......... ఇబ్రహీంపట్నం అండ్ టెక్నాలజీ, శేరిగూడ వీఎం హోం, సరూర్‌నగర్ ......... మహేశ్వరం జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి ..... రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, చేవెళ్ల .......... చేవెళ్ల మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ........ వికారాబాద్, తాండూర్ -
రంగారెడ్డిలో తొలి ఫలితం ఒంటిగంటకు!
హైదరాబాద్ : క్షణం.. క్షణం ఉత్కంఠ.. ఉద్విగ్నత.. ఈ పరిస్థితికి మరికొన్ని గడియల్లో తెరపడనుంది. ఈవీఎంలో భద్రంగా నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం బయటపడనుంది. నువ్వా-నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ఫలితాల వెల్లడికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఏడు చోట్ల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో 1200 మంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. అసెంబ్లీ బరిలో 285 మంది, రెండు ఎంపీ స్థానాలకు 45మంది పోటీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అసెంబ్లీ బరిలో 285 మంది, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో 45మంది అభ్యర్థుల జాతకం తేలనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. -
సార్వత్రిక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: క్షణం.. క్షణం ఉత్కంఠ.. ఉద్విగ్నత.. ఈ పరిస్థితికి మరికొన్ని గడియల్లో తెరపడనుంది. ఈవీఎంలో భద్రంగా నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం బయటపడనుంది. నువ్వా-నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ఫలితాల వెల్లడికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఏడు చోట్ల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో 1200 మంది సిబ్బంది పాలుపంచుకోనున్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు కలెక్టర్ బి.శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. ఉదయం పది గంటలకల్లా జనం నాడి ఎటువైపు ఉందో వెల్లడయ్యే అవకాశాలున్నాయి. పోటాపోటీగా జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో హేమాహేమీలతోపాటు జిల్లాలో ఇద్దరు మాజీ హోం మంత్రుల తనయుల భవితవ్యం కూడా తేలనుంది. అసెంబ్లీ బరిలో 285 మంది, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో 45మంది అభ్యర్థుల జాతకం తేలనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. అలాగే మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి సంబంధించిన ఫలితం అర్ధరాత్రి దాటాకే వచ్చే అవకాశం ఉంది. కాగా ఫలితాల సరళిని తెలుసుకునేందుకు కౌంటింగ్ కేంద్రాల వెలుపల ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేయడమే కాకుండా రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బరిలో ఉద్దండులు.. ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో రాజకీయాల్లో కాకలుతీరిన నాయకుల భవితవ్యం తేలనుంది. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ కీలకంగా భావించాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లు పోటాపోటీగా ప్రచారపర్వాన్ని కొనసాగించాయి. చేవెళ్ల లోక్‌సభ సీటు కు నలుగురు వారసులు బరిలో ఉండ డం, మల్కాజిగిరి ఎంపీ స్థానంలో ప్రముఖులేగాకుండా, అధిక సంఖ్యలో ఆశావహులు రంగంలో నిలవడంతో వీటికి ప్రత్యేకత సంతరించుకుంది. కౌంటింగ్ కేంద్రాలు ఇక్కడే... కౌంటింగ్ కేంద్రం నియోజకవర్గాలు డీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీ, మేడ్చల్, మల్కాజిగిరి, బౌరాంపేట్, కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్, కూకట్పల్లి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ఉప్పల్, ఎల్బీనగర్ శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇబ్రహీంపట్నం అండ్ టెక్నాలజీ, శేరిగూడ వీఎం హోం, సరూర్‌నగర్ మహేశ్వరం జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, చేవెళ్ల చేవెళ్ల మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వికారాబాద్, తాండూర్ -
అభ్యర్థుల గెలుపుపై చర్చోప చర్చలు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఎన్నికల జాతర ముగిసింది. ఇక ఫలితాల కోసమే అందరి ఎదురుచూపు. నెల రోజులుగా పట్టణ, పల్లె ప్రాంతాల్లో కొనసాగిన ఓట్ల పండుగకు తెరపడింది. ఏకకాలంలో మున్సిపాలిటీ, స్థానిక, సార్వత్రిక పోరు జరగడంతో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. నెల రోజులపాటు ఓటరు మహాశయులకు వినోదం పంచింది. తాజాగా ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. అభ్యర్థులైతే చర్చోపచర్చలు సాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే కారణంతో మున్సిపల్, ప్రాదేశిక ఓట్ల లెక్కింపును సుప్రీంకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక ఫలితాలు ఐదు రోజుల వ్యవధిలో వెలువడనుండడంతో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. గెలుపు ధీమాలో ఉన్నవారు మెజార్టీపై లెక్కలు వేసుకుంటుంటే.. పోటాపోటీగా ఉన్నచోట గట్టెక్కుతామా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. సాధారణ ఎన్నికల సందడిలో నిమగ్నమైన రాజకీయ నాయకులు ఇప్పుడు ఫలితాల విశ్లేషణపై దృష్టి సారించారు. బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కీలకఘట్టం ముగిడయంతో జిల్లా యంత్రాంగం కూడా ఓట్ల లెక్కింపుపై దృష్టిసారించింది. రేపే మున్సిపల్ ఫలితాలు జిల్లాలో మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ ఈ ఆరు మున్సిపాలిటీల్లోని 189 వార్డుల్లో 1,095 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీటి ఫలితాలు సోమవారం (12వ తేదీ)న వెలువడనున్నాయి. ఈ ఎన్నికలకు ఈవీఎంలు ఉపయోగించడంతో.. కౌంటింగ్ రోజు కొద్ది గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అయితే మున్సిపల్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా తమ అభ్యర్థులు బరిలోకి దింపాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల ఫలితాల జాతరలో మున్సిపల్ ఫలితాలు తొలుత వెలువడనుండడంతో అన్ని పార్టీలలో ప్రస్తుతం దీనిపైనే ఆసక్తి చూపుతున్నారు. 13న పరిషత్.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల కోసం పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆత్రుత నెలకొంది. మార్చి 6న తొలివిడత, 11న మలివిడత ఎన్నిలకు జరిగాయి. నెల రోజుల తర్వాత ఫలితాలు వెలువడనుండడంతో పల్లెపోరులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనని ఇటు అభ్యర్థులు, అటు రాజకీయ పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పరిషత్ ఫలితాలు వెలువరించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరిషత్ ఎన్నికల్లో 52 జెడ్పీటీసీ స్థానాలకు 269 మంది అభ్యర్థులు, 636 ఎంపీటీసీ స్థానాలకు 2,654 మంది బరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలపై పరిషత్ ఎన్నికలు ప్రభావం చూపడనుండడంతో ఆయా పార్టీలు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సార్వత్రిక ఫలితాలు కీలకం మూడు ఎన్నికలు జాతరగా జరిగినా సార్వత్రిక ఎన్నికల ఫలితాలే అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ఈనెల 16న సార్వత్రిక ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలతోనే జిల్లాలో ఏ బలం ఎంత అనేది బయటపడనుంది. అలాగే తెలంగాణలో తొలి అసెంబ్లీలో జిల్లా నుంచి ఎవరు అడుగుపెడతారో తేలనుంది. నామినేషన్లు వేసినప్పటి నుంచి అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రచార పర్వం, ఓటర్లకు గాలం వేయడంలో అభ్యర్థులు వినూత్న శైలిలో ముందుకెళ్లారు. పది అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, రెండు లోక్‌సభ స్థానాలకు 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి బ్రహ్మరథం పడతారో వేచిచూడాల్సిందే. 1000 మంది ప్రజాప్రతినిధులు ఎన్నికల జాతరతో జిల్లాలో 1000 మంది ప్రజాప్రతినిధులు కొలువుదీరనున్నారు. మరో పది రోజుల్లో మూడున్నర సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మండల, జిల్లా పరిషత్, పురపాలక సంఘాల్లో పదవుల జాతర మొదలుకానుంది. అయితే ఏ పదవి ఎవరిని వరిస్తుందో ఫలితాలు వెల్లడయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే. జిల్లా వ్యాప్తంగా 636 మండల ప్రాదేశిక సభ్యులు, 189 మంది కౌన్సిలర్లు, 52 మంది మండల అధ్యక్షులు, మరో 52 మంది మండల ఉపాధ్యక్షులుగా, 52 మంది జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నిక కానున్నారు. వీరితోపాటు 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఆరుగురు పురపాలక సంఘం అధ్యక్షులుగా పదవులు చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి దాదాపు 1000 మంది ప్రజాప్రతినిధులు కొలువుదీరనున్నారు. ఓట్ల లెక్కింపు.. ఈనెల 12న జిల్లాలోని ఆరు మున్సిపాల్టీల ఓట్ల లెక్కింపు ఆదిలాబాద్ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఒక్కో మున్సిపాలిటీ ఒక్కో గదిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కోసం టేబుల్లు ఏర్పాటు చేశారు. ఆది లాబాద్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కోసం 12 టేబుల్లు, మంచిర్యాలకు 10, నిర్మల్, బెల్లంపల్లి, భైంసా, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కిం పుకు ఎనిమిదేసి టేబుల్లను ఏర్పాటు చేశారు. ఈనెల 13న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసిఫాబాద్ డివిజన్‌కు సంబంధించి ఐటీడీఏ బాలికల వసతి గృహంలో, మంచిర్యాల డివిజన్‌కు సంబంధించి లక్సెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలో, ఆదిలాబాద్ డివిజన్‌కు సంబంధించి ఆదిలాబాద్ కొలాం ఆశ్రమ పాఠశాలలో, నిర్మల్ డివిజన్‌కు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్‌లో, ఉట్నూర్ డివిజన్‌కు సంబంధించి కేబీ కాంప్లెక్స్ ఉట్నూర్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈనెల 16న శాసన, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో నిర్వహిస్తారు. -
‘స్థానిక’ కౌంట్‌డౌన్
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: అన్ని రకాల ఎన్నికలూ ముగిశాయి. ఇక తేలాల్సింది గెలుపోటములే. ఇటు పార్టీలు.. అటు అధికార యంత్రాంగం ఇప్పుడు వాటిపైనే దృష్టి సారించాయి. సార్వత్రిక ఫలితాలకు ముందే స్థానిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానుండటంతో పార్టీలు ఇప్పుడు ఆ లెక్కలతో కుస్తీ పడుతున్నాయి. ఈ ఏడాది మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు జరిగిన పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పాలకొండ మున్సిపాలిటీల కౌంటింగ్ ఈ నెల 12న చేపట్టనున్నారు. అలాగే ఎన్నికలు జరిగిన 37 జెడ్పీటీసీలు, 675 ఎంపీటీసీల స్థానాల కౌంటింగ్ 13న నిర్వహిస్తారు. వాస్తవానికి పోలింగ్ జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే వీటి లెక్కింపు పూర్తి కావాల్సి ఉన్న సార్వత్రిక ఎన్నికలపై ఆ ఫలితాల ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో సార్వత్రిక పోలింగ్ ముగిసిన తర్వాతే స్థానిక ఎన్నికల కౌంటింగ్ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 72 గంటల వ్యవధిలోనే మొదట మున్సిపల్.. ఆ మరుసటి రోజే ప్రాదేశిక ఫలితాలు వెల్లడికానుండటంతో అభ్యర్ధుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ పూర్తయిన తొలి రోజుల్లో వీరు ఉత్కంఠకు గురైనా.. కోర్టు తీర్పుతో లెక్కింపు వాయిదా పడటం, సార్వత్రిక ఎన్నికలు బిజీలో పడి ఆ విషయం మరిచిపోయారు. తమ ఫలితం తేలే సమయం ఆసన్నం కావడంతో ప్రాంతాలవారీగా పోలైన ఓట్ల లెక్కలతో గెలుపు అవకాశాలను అంచనా వేయడం ప్రారంభించారు. సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ సరళి.. స్థానిక ఎన్నికల నాటి పరిస్థితిని బేరీజు వేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. గతంలో ఏ ఎన్నికలు జరిగినా పందాలు జోరుగా సాగేవి. ఈసారి మున్సిపల్, జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై పందాలే జరగక పోవడం విశేషం. సాధారణ ఎన్నికలపై పందాలు జోరు రోజురోజుకూ పెరుగుతుండగా స్థానిక సంస్థల ఎన్నికలపై మాత్రం పందాలు జరగడం లేదు. ఓట్ల లెక్కింపు ముందు రోజు నుంచి పందాలు జోరుగా సాగవచ్చని పలువురు చెబుతున్నారు.