క్షణం.. క్షణం ఉత్కంఠ.. ఉద్విగ్నత.. ఈ పరిస్థితికి మరికొన్ని గడియల్లో తెరపడనుంది.
హైదరాబాద్ : క్షణం.. క్షణం ఉత్కంఠ.. ఉద్విగ్నత.. ఈ పరిస్థితికి మరికొన్ని గడియల్లో తెరపడనుంది. ఈవీఎంలో భద్రంగా నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం బయటపడనుంది. నువ్వా-నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ఫలితాల వెల్లడికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఏడు చోట్ల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
ఓట్ల లెక్కింపులో 1200 మంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. అసెంబ్లీ బరిలో 285 మంది, రెండు ఎంపీ స్థానాలకు 45మంది పోటీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అసెంబ్లీ బరిలో 285 మంది, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో 45మంది అభ్యర్థుల జాతకం తేలనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది.