అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
♦ కాంగ్రెస్, టీడీపీపై హరీశ్ ఫైర్
♦ సభ హుందాతనాన్ని దెబ్బతీస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో చర్చించే సత్తా లేకే కాంగ్రెస్, టీడీపీ సభ నుంచి వాకౌట్ చేశా యని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు అన్నారు. విపక్షాలు గవర్నర్ ప్రసం గాన్ని ఎందుకు బహిష్కరించాయో ప్రజలకు చెప్పాలన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘‘గవర్నర్ ప్రసంగ సమయం లో ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించి ఉండాల్సింది. గవర్నర్‌ను కాంగ్రెస్, టీడీపీ అవమానించాయి. మాట్లాడేందుకు ఆ పార్టీల వద్ద సరుకు లేదు. గతంలో జరిగిన బీఏసీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా నినాదాలు వద్దనుకున్నాం.
అయినా కాంగ్రెస్, టీడీపీ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సభ హుందాతనాన్ని దెబ్బ తీయడమే. ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టాయి. ప్రజల సంక్షేమం కాంగ్రెస్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఆ పార్టీల కు ఎందుకు ఈ తత్తరపాటు? గత సమావేశా ల్లో కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్ అయింది. బీసీలకు పెద్దఎత్తున పథకాలు పెడుతున్నామని తెలిసే కాంగ్రెస్, టీడీపీలు ఏదో విధంగా సభను అడ్డు కోవాలి అని చూస్తున్నాయి’’ అని హరీశ్ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చలో పాల్గొని మాట్లాడాల్సిన పార్టీలు ఇప్పుడే ఆందోళన చేయడం దేనికని నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, విపక్షాలు ఏం మాట్లాడినా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ప్రశ్నించే దమ్ముందా?: తుమ్మల
గవర్నర్ ప్రసంగం మొత్తం వినకుండానే సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేయడం రాజ్యాం గాన్ని అవమానించడమేనని, ఈ విషయంలో వారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఏ అంశంపైనైనా సమా ధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము ప్రతిపక్షాల కుందా అని ఆయన సవాల్ చేశారు.
అభివృద్ధికి అద్దం: కొప్పుల
తెలంగాణ ప్రభుత్వ 33 నెలల అభివృద్ధి, సంక్షేమ పాలనకు గవర్నర్ ప్రసంగం అద్దం పట్టిందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భం గా కాంగ్రెస్, టీడీపీ వాకౌట్ చేయడం విచారకరమని పేర్కొన్నారు. గతంలో జరిగి న బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయా లకు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ వ్యవహరించాయన్నారు. గవర్నర్ టీఆర్‌ఎస్ కు అనుకూలమని విపక్షాలు అనడం హాస్యాస్పదమన్నారు.