కానిస్టేబుల్ ఆత్మహత్య
- పోలీసుల ఒత్తిడి వల్లేనని భార్య ఆరోపణ
- మానసిక స్థితి సరిగా లేదంటున్న పోలీసులు
రామకృష్ణాపూర్(చెన్నూర్): మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన పోలీస్ కాని స్టేబుల్ నరుముల్ల రాజేందర్(34) శుక్రవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నానని, డ్యూటీ చేయటం తనవల్ల కావటం లేదని కుటుంబసభ్యులతో ఇటీవల చెప్పిన రాజేందర్ ఆత్మహత్య చేసుకోవటం కలకలం సృష్టించింది. రామకృష్ణాపూర్‌లోని భగత్‌సింగ్‌నగర్ హట్స్ ఏరియాకు చెందిన రాజేం దర్ డిగ్రీ వరకు చదువు కున్నాడు. 2011లో కాని స్టేబుల్‌గా ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో వి«ధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ.. కొంపల్లి ప్రాంతంలో నివాసముంటున్నాడు.
అయితే, రాజేందర్ భార్యాపిల్లలను హైదరాబాద్‌లోనే ఉంచి గత శుక్రవారం స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అప్పటినుంచి తనకు ఏదోలా ఉందంటూ చెప్పాడు. దీంతో భార్య మంజుల, పిల్లలు ప్రీతమ్, సాన్విలను పిలిపించారు. రాజేందర్ శుక్రవారం ఇంటి ముందున్న బావిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు, స్థానికులు గమనించి నిచ్చెన సహాయంతో బయటకు తీశారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరివేసుకునే ప్రయత్నం చేయగా, భార్య.. తల్లిదండ్రులు వారించడంతో ఆ యత్నాన్ని విరమించుకున్నాడు. కొంతసేపటి తర్వాత మరోసారి బావిలోకి దూకడంతో రాజేందర్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ దేవిదాస్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బావి నుంచి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఒత్తిడి వల్లే అఘాయిత్యం: భార్య మంజుల
రాజేందర్ ఆత్మహత్యకు పోలీసుల ఒత్తిడే కారణమై ఉంటుందని అతడి భార్య మంజుల అన్నారు. ‘డ్యూటీ చేయటం నా వల్ల కావటం లేదని.. టెన్షన్‌గా ఉందని.. నేను ఈ జాబ్ చేయనని’ తనతో చెప్పాడని వివరించారు. రాజేందర్ కొద్దిరోజులుగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. అతడిని హైదరాబాద్‌లోని తోటి కానిస్టేబుళ్లు సైకియా ట్రిస్ట్‌కు చూపించుకోవాలని ఇటీవల సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.