Rajendar
-
తెలంగాణ నెక్కొండ వాసికి అరుదైన అవకాశం..
వరంగల్: అత్యంత ప్రతిష్టాత్మకంగా పారిస్‌లో జరగనున్న 33వ పారా ఒలింపిక్స్ క్రీడా సమరంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించే అరుదైన అవకాశం ఉమ్మడి వరంగల్ బిడ్డకు దక్కింది. షటిల్ బ్యాడ్మింటన్ టెక్నికల్ అఫీషియల్‌గా భారతదేశం నుంచి ఇద్దరికి అవకాశం రాగా.. అందులో వరంగల్ వ్యక్తి ఒకరు కావడం విశేషం.ఆగస్టులో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (మలేషియా) పారా ఒలింపిక్స్‌లో న్యాయ నిర్ణేతలుగా పాల్గొనేందుకు భారత్ నుంచి పూణేకు చెందిన ఒకరిని నియమించగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్‌కు అవకాశం కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశ ఒలింపిక్స్ కొనసాగుతుండగానే.. రెండో దశలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.ఈ ఒలింపిక్స్‌లో కొమ్ము రాజేందర్ టెక్నికల్ అఫీషియల్స్‌గా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి తనకు అందిన ఈఅవకాశాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నానని చెబుతున్నారు ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్.గురువుల ప్రోత్సాహంతోనే..పాఠశాల స్థాయిలో ఆటల్లో నా ప్రతిభను గుర్తించి నాటి నుంచి ఒలింపిక్స్‌లో టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికవడం వరకు అడుగడుగునా గురువులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. క్రీడా గురువులు రాజశేఖర్, చెన్న కృష్ణ, సాంబయ్య, నిమ్మ మోహన్‌రావు, పి.కుమారస్వామి ఆట నేర్పిస్తే, అంపైర్‌గా రాణించేలా షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎస్.రమేశ్‌కుమార్, డాక్టర్ పి.రమేశ్‌రెడ్డి, రాష్ట్రస్థాయిలో కేసీహెచ్ పున్నయ్య చౌదరి, సుధాకర్ వేమూరి భుజం తట్టారు. – కొమ్ము రాజేందర్, ఒలింపిక్స్ టెక్నికల్ అఫీషియల్ -
అత్తగారింటికొచ్చి, అనుమానాస్పదంగా చెరువులో శవమై..
సాక్షి, కరీంనగర్: వెల్గటూర్ మండలకేంద్రంలోని పెద్దవాగులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నస్పూరి రాజేందర్ (42)కు మండలకేంద్రానికి చెందిన పుట్టపాక శంకరమ్మ–కిష్టయ్య కూతురు స్రవంతితో 15 ఏళ్లక్రితం వివాహం జరిగింది. రజక కులానికి చెందిన రాజేందర్ శుభకార్యాలకు వంట పనులు చేస్తుంటాడు. మంగళవారం ఉదయం పనినిమిత్తం వెల్గటూర్‌లోని తన అత్తగారింటికి వచ్చాడు. ఓ శుభకార్యంలో మేకలు కోసేందుకు వెళ్లి రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో బావమరిది పుట్టపాక జయందర్ మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం ఉదయం రాజేందర్ మృతదేహం వెల్గటూర్‌లో పెద్దవాగులో లభ్యమైంది. అయితే రాజేందర్ మంగళవారం సాయంత్రం రాజక్కపల్లిలోని ధర్మాజి సత్యం ఇంటికి వెళ్లాడని, అక్కడ గొడవ జరగడంతో పారిపోతుండగా పెద్దవాగులో ఈదుకుంటూ వెళ్లి మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో రాజేందర్ మృతిపై ధర్మాజి సత్యం, ధర్మాజి గంగారాంపై అనుమానాలున్నాయని జయంధర్ ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: నా కొడుకుది ప్రమాదం కాదు, కావాలనే ఇలా చేశారు! -
టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రవీందర్‌రెడ్డి, రాజేందర్
సాక్షి, హైదరాబాద్: టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్ మరోమారు ఎన్నికయ్యారు. దీంతో మూడోసారి వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 6న 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆమోదం మేరకు ఎన్నికల అధికారిని నియమించి నోటిఫికేషన్ జారీచేశారు. ఆరోజు జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ప్రతిపాదనల మేరకు రాష్ట్ర కార్యవర్గానికి చేపట్టిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. నామినేషన్లన్నీ సరిగ్గా ఉండటంతో అంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ కార్యవర్గం మూడేళ్లపాటు కొనసాగనుంది. ఎన్నికైన రవీందర్ రెడ్డి, రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ నాయకత్వం పట్ల నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. టీఎన్జీవో సంఘం అనేక సమస్యలను పరిష్కరించిందని, ఇతర సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎంను కలుస్తామని వెల్లడించారు. సంఘం ఎన్నికల్లో వీరితోపాటు సహ అధ్యక్షురాలుగా బి.రేచల్, కోశాధికారిగా రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కస్తూరి వెంకటేశ్వర్లు, శ్యాం సుందర్, నరసింహస్వామి, నరసింహచారి, ఉమాదేవి, కార్యదర్శులుగా తిరుమల్ రెడ్డి, లక్ష్మణ్ రావు, రాము నాయక్, రవి, దివ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా కొండల్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా జగదీశ్వర్, కార్యవర్గ సభ్యులుగా కొనిదెన శ్రీనివాస్, రవిందర్, నర్సింహులు, సిద్దిరాములు, మాధవి, శైలజ, సత్యం ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సుబ్బారావు, సహాయ ఎన్నికల అధికారిగా రాధాకృష్ణమూర్తి వ్యవహరించారు. -
భర్త చితికి నిప్పుపెట్టిన భార్య
హుజూరాబాద్‌రూరల్: మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సైదాపూర్ రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా అతడి చితికి భార్య నిప్పుపెట్టింది. గ్రామానికి చెందిన గడ్డం రాజేందర్(45)కు ఆదివారం వేకువజామున గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. రాజేందర్‌కు వివాహమై 20 ఏళ్లయినా పిల్లలు పుట్టలేదు. అప్పటి నుంచి మనోవేదనకు గురయ్యేవాడు. సాయంత్రం రాజేందర్ మృతదేహానికి భార్య సుజాత అంత్యక్రియలు నిర్వహించి, చికితి నిప్పుపెట్టింది. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. -
‘తెలంగాణ విత్తనం’కు సహకారం
సాక్షి, హైదరాబాద్: విత్తన భాండాగారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ బి.రాజేందర్ హామీ ఇచ్చారు. శనివారం ఇక్కడ జరిగిన జాతీయ విత్తన ధ్రువీకరణ సదస్సులో ఆయన మాట్లాడారు. 17 రాష్ట్రాల విత్తన ధ్రువీకరణ డైరెక్టర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. రాజేందర్ మాట్లాడుతూ, ఈ జాతీయ సదస్సు చర్చించే కీలకాంశాలను తాము పరిశీలిస్తామని, అందుకనుగుణంగా విత్తన చట్టానికి, మాన్యువల్‌లో మార్పులు, చేర్పులు చేస్తామని చెప్పారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలంటే అందుకు విత్తన నాణ్యతే కీలకమని, అందుకోసం విత్తన ధ్రువీకరణలో ప్రమాణాలు పెంచాలన్నారు. విత్తనోత్పత్తి ద్వారా రైతులకు సాధారణ పంటలకంటే ఐదు నుంచి పది రెట్లు అధికంగా ఆదాయం సమకూరుతుందన్నారు. బీజీ–3 పత్తి విత్తనంపై కేంద్రం సమాలోచనలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ, ఈ ఏడాది రబీలో 6 వేల ఎకరాల్లో విత్తన ధ్రువీకరణ కింద రిజిస్ట్రేషన్ చేశామన్నారు. తద్వారా 50 వేల క్వింటాళ్ల వరకు ధ్రువీకరించిన విత్తనోత్పత్తి జరగనుందన్నారు. సేంద్రియ ధ్రువీకరణ సంస్థలను ప్రభుత్వపరంగా అన్ని రాష్ట్రాల్లో ప్రారంభిం చాలని సూచించారు. తమిళనాడు రాష్ట్రం ఫౌండేషన్ స్టేజ్–2 విత్తనాన్ని 90 శాతం తెలంగాణ నుంచే తీసుకెళ్తుందన్నారు. వచ్చే జూన్ నాటికి హైదరాబాద్‌లో ఇస్టా ల్యాబ్ అందుబాటులోకి రానుందని వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ రసాయన ఎరువులతో పంటలు పండించడం వల్ల జనం రోగాల బారిన పడుతున్నారన్నారు. జాతీయ విత్తన సంస్థ ఎండి. వి.కె.గౌర్, తెలంగాణ విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ ఆత్మహత్య
- పోలీసుల ఒత్తిడి వల్లేనని భార్య ఆరోపణ - మానసిక స్థితి సరిగా లేదంటున్న పోలీసులు రామకృష్ణాపూర్(చెన్నూర్): మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన పోలీస్ కాని స్టేబుల్ నరుముల్ల రాజేందర్(34) శుక్రవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నానని, డ్యూటీ చేయటం తనవల్ల కావటం లేదని కుటుంబసభ్యులతో ఇటీవల చెప్పిన రాజేందర్ ఆత్మహత్య చేసుకోవటం కలకలం సృష్టించింది. రామకృష్ణాపూర్‌లోని భగత్‌సింగ్‌నగర్ హట్స్ ఏరియాకు చెందిన రాజేం దర్ డిగ్రీ వరకు చదువు కున్నాడు. 2011లో కాని స్టేబుల్‌గా ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో వి«ధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ.. కొంపల్లి ప్రాంతంలో నివాసముంటున్నాడు. అయితే, రాజేందర్ భార్యాపిల్లలను హైదరాబాద్‌లోనే ఉంచి గత శుక్రవారం స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అప్పటినుంచి తనకు ఏదోలా ఉందంటూ చెప్పాడు. దీంతో భార్య మంజుల, పిల్లలు ప్రీతమ్, సాన్విలను పిలిపించారు. రాజేందర్ శుక్రవారం ఇంటి ముందున్న బావిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు, స్థానికులు గమనించి నిచ్చెన సహాయంతో బయటకు తీశారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరివేసుకునే ప్రయత్నం చేయగా, భార్య.. తల్లిదండ్రులు వారించడంతో ఆ యత్నాన్ని విరమించుకున్నాడు. కొంతసేపటి తర్వాత మరోసారి బావిలోకి దూకడంతో రాజేందర్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ దేవిదాస్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బావి నుంచి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒత్తిడి వల్లే అఘాయిత్యం: భార్య మంజుల రాజేందర్ ఆత్మహత్యకు పోలీసుల ఒత్తిడే కారణమై ఉంటుందని అతడి భార్య మంజుల అన్నారు. ‘డ్యూటీ చేయటం నా వల్ల కావటం లేదని.. టెన్షన్‌గా ఉందని.. నేను ఈ జాబ్ చేయనని’ తనతో చెప్పాడని వివరించారు. రాజేందర్ కొద్దిరోజులుగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. అతడిని హైదరాబాద్‌లోని తోటి కానిస్టేబుళ్లు సైకియా ట్రిస్ట్కు చూపించుకోవాలని ఇటీవల సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. -
అక్కడ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి
మిస్టరీ సిమ్లా... 2005... ‘‘సురభీ... సురభీ... ఏంటా మొద్దు నిద్ర? బాబు ఏడుస్తున్నాడు చూడు’’... భార్య వీపు మీద చరిచాడు రాజేందర్. ఉలిక్కిపడి లేచింది సురభి. పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. గబగబా చేతుల్లోకి తీసుకుని పాలు పట్టింది. ఊరుకున్నాడు. ‘‘ఏంటింత నిద్ర పట్టేసింది? పిల్లాడు ఏడ్చినా మెలకువ రాలేదు. ఛ’’... మనసులో అనుకోవాల్సింది పైకే అంది. ‘‘ఫర్లేదులే... అలసిపోయావ్ కదా, అందుకే మత్తుగా నిద్ర పట్టేసివుంటుంది’’ అంది అత్తగారు. ‘‘రైలు ఆగి చాలా సేపయ్యింది. ఇంకా బయలుదేరడం లేదేంటి?’’ అన్నాడు రాజేందర్ కిటికీలోంచి బయటకు చూస్తూ. అప్పుడుగానీ రైలు కదలడం లేదన్న విషయం మిగిలినవాళ్లకి అర్థం కాలేదు. అందరూ ఒకేసారి కిటికీలోంచి బయటకు చూశారు. కానీ ఏమీ కనిపించడం లేదు. చిమ్మ చీకటి. ‘‘బాబోయ్... ఏంటింత చీకటిగా ఉంది?’’ అంది సురభి భయంగా. ‘‘నేను తెలుసుకుని వస్తాను ఉండు’’ అంటూ లేచి వెళ్లాడు రాజేందర్. చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అంటే వాళ్లంతా కూడా దిగి ఉంటారు. వడివడిగా తనూ రైలు దిగాడు. అది ఒక టన్నెల్... రైలు సరిగ్గా అందులో ఆగిపోయింది. అందుకే అంత చీకటిగా అనిపించింది. డ్రైవర్, కొంతమంది టెక్నీషియన్లు లాంతర్లు పట్టుకుని రైలు ఎందుకు ఆగిందా అని పరిశోధిస్తున్నారు. విసిగి పోయిన ప్రయాణికులు అటూ ఇటూ తిరుగుతున్నారు. కొందరు సిగరెట్లు ముట్టించారు. కొందరు పక్కవాళ్లతో బాతాఖానీ కొట్టడంలో మునిగిపోయారు. ‘‘ఏమైందండీ... ఇంకా ఎంతసేపు పడుతుంది రైలు బయలుదేరడానికి?’’... డ్రైవర్ని అడిగాడు రాజేందర్. ‘‘ఏమోనయ్యా... సమస్య ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు ఆగిందో ముందు నాకు తెలిస్తే, ఎంత సమయం పట్టుద్దో నేను నీకు చెప్తా’’ అన్నాడు విసుగ్గా. రాజేందర్ మౌనం వహించాడు. అంతలో... ‘‘పోనీ నన్ను ఓసారి చూడమంటారా?’’ అన్న స్వరం వినబడింది. డ్రైవర్, రాజేందర్‌లతో పాటు అందరూ అటువైపు చూశారు. ఎవరో పెద్దాయన. తెల్లగా ఉన్నాడు. విదేశీయుడనుకుంటా. ‘‘మీకు అభ్యంతరం లేకపోతే నేను చూస్తాను’’ అంటూ వచ్చాడు. ‘‘మీకు ఎలా తెలుస్తుంది?’’ అన్నాడు డ్రైవర్. ‘‘నేను ఇంజినీరింగ్ చేశాను. అలా అని కచ్చితంగా సమస్యేంటో నేను కనిపెట్టేస్తానని చెప్పడం లేదు. కనిపెట్టడానికి ట్రై చేస్తానంతే’’ అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. సరేనని తలూపి లేచాడు డ్రైవర్. మిగతా వాళ్లంతా కూడా తప్పుకుని దారి ఇచ్చారు. ఆ పెద్దాయన ఇంజిన్ దగ్గరకు వెళ్లి తన పనిలో తాను మునిగిపోయాడు. ఐదు... పది... ఇరవై నిమిషాలు గడిచాయి. ‘‘ఓకే... అయిపోయింది. చిన్న సమస్యే. ఇక స్టార్ట చేయండి’’ అన్నాడాయన ఊపిరి గట్టిగా వదులుతూ. అందరి ముఖాలూ ఒక్కసారిగా వెలిగాయి. క్యాబిన్లోకి వెళ్లి డ్రైవర్ స్టార్ట్ చేశాడు. స్టార్ట అయ్యింది. ‘‘థ్యాంక్సండీ. పొద్దుటి వరకూ ఈ చీకట్లో ఇక్కడే పడిగాపులు పడాలేమోనని భయపడి చచ్చాను’’ అన్నాడు ఆనందంగా. ‘‘ఫరవాలేదు’’ అన్నాడాయన. ‘‘అందరూ వెళ్లి ఎక్కండి... త్వరగా’’ అన్నాడు ప్రయాణీకుల వైపు చూస్తూ. అందరూ గబగబా వెళ్లి ఎవరి బోగీల్లోకి వాళ్లు ఎక్కారు. రాజేందర్ కూడా వెళ్లబోతూ ఆయన దగ్గర ఆగాడు. ‘‘యు ఆర్ గ్రేట్ సర్. మీరు ఎక్కడం లేదేంటి’’ అన్నాడు. ‘‘మీరు పదండి. కాస్త చేతులు కడుక్కుని ఎక్కుతాను’’ అన్నాడాయన నవ్వుతూ. ‘‘సరే. ఇంతకీ మీది ఏ కోచ్?’’ ‘‘ఎస్ 2... బెర్త్ నంబర్ పదిహేడు’’ ‘‘ఓకే’’ అనేసి వెళ్లి రెలైక్కి తన సీట్లోకెళ్లి కూచున్నాడు రాజేందర్. రైలు బయలుదేరింది. ఒక్కసారిగా అతడి మెదడులో ఏదో మెదిలినట్లయ్యింది. చప్పున లేచి నిలబడ్డాడు. గబగబా కోచ్ అంతా కలియదిరిగాడు. ఆయన ఎక్కడా కనిపించలేదు. మతి పోయినట్లయ్యింది. నీరసంగా వచ్చి సీట్లో కూర్చున్నాడు. ‘‘ఏమైందండీ... ఎందుకలా టెన్షన్ పడుతున్నారు?’’... అడిగింది సురభి. ‘‘ఆయన... ఆయన లేడు. ఎక్కడా లేడు. ఏమయ్యాడు?’’ అంటూ మౌనంగా బెర్తుపై వాలాడు రాజేందర్. ఉదయం రైలు దిగాక కూడా అతడి గురించి అంతా వెతికాడు. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ‘‘మళ్లీ ఆయన కోసమే వెతుకు తున్నారా?’’ అంది సురభి భర్తవైపు విచిత్రంగా చూస్తూ. ‘‘అవును సురభీ. ఎస్ 2... బెర్త్ నంబర్ పదిహేడు అని చెప్పాడు. నేనూ ఊకొట్టేశాను. కానీ ఆ బెర్త్ నాది. అందులో నేనే ప్రయాణిస్తున్నాను. ఆ విషయం నాకు తట్టనే లేదు. అసలు ఎవరాయన? ఎందుకలా చెప్పాడు? ఏమైపోయాడు?’’ ప్రశ్నలే ప్రశ్నలు. జవాబు లేని ప్రశ్నలు. బహుశా ఆ రైలు ఆగిపోయిన స్థలం గురించి పూర్తిగా తెలిసివుంటే రాజేందర్ మనసులో అన్ని ప్రశ్నలు తలెత్తేవి కావు. ఇంతకీ ఏమిటా స్థలం వెనుక, ఆ వ్యక్తి వెనుక ఉన్న రహస్యం? రైలు ఆగిపోయిన ఆ చోటు... బరోగ్ టన్నెల్. రైలు బాగు చేసిన ఆ వ్యక్తి... బ్రిటిష్ కల్నల్ బరోగ్. ఆయన చనిపోయి అప్పటికి చాలా సంవత్సరాలయ్యింది!!! టన్నెల్ నంబర్ 33... బరోగ్ టన్నెల్... ఈ మాట వింటేనే సిమ్లాలో చాలామంది ఉలిక్కిపడుతుంటారు. దాని గురించి మాట్లాడటం ఎందుకులే అన్నట్టు ముఖం పెడతారు. ఎందుకంటే దాని చరిత్ర అలాంటిది. బ్రిటిష్‌వాళ్లు భారతదేశాన్ని పరిపా లించిన కాలంలో, కల్కా ప్రాంతంలో ఒక రైలు మార్గాన్ని నిర్మించాలని తలచారు. ఆ పనికి కల్నల్ బరోగ్కి అప్పగించారు. బరోగ్ రైలు మార్గాన్ని వేయడానికి ప్రణాళికలన్నీ సిద్ధం చేశాడు. అయితే అక్కడ ఓ కొండ అడ్డుగా ఉంది. దాన్ని తొలిచి, సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసి, అందులో రైల్వే లైను వేయాలన్నది బరోగ్ ఆలోచన. అనుకున్నదే తడవుగా ఆ పని మొదలు పెట్టేశాడు. త్వరగా పూర్తవడం కోసమని... కొండను రెండు పక్కల నుంచి తవ్వుకుంటూ రమ్మని పనివాళ్లను ఆదేశించాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఆ అతి పెద్ద కొండని చెమటోడ్చి తవ్వసాగారు పనివాళ్లు. అయితే కొలతలు వేయడంలో తేడా వల్ల రెండు పక్కల నుంచీ తవ్వుకుంటూ వెళ్తే ఆ దార్లు ఒకేచోట కలవడం అసాధ్యమని తేలింది. షాకైపోయాడు బరోగ్. తన లెక్క ఎక్కడ తేడా వచ్చిందో అర్థం కాలేదు. తప్పును సరి చేసుకుందామంటే అప్పటికే లక్షల్లో ఖర్చయ్యింది. పనివాళ్లు కూడా తవ్వి తవ్వి విసిగిపోయి ఉన్నారు. దానికితోడు అధికారులు కూడా గుర్రుమంటున్నారు. దాంతో తీవ్ర మనస్తాపం చెందాడు బరోగ్. తన తప్పుకు తనలో తానే కుమిలి పోయాడు. ఓ రోజు మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఆయన... కొండ దగ్గరకు వెళ్లి, తుపాకీతో కాల్చుకుని మరణించాడు. ఈ సంఘటన అందరినీ నివ్వెర పరిచింది. అధికారులు సైతం షాకై పోయారు. కేవలం ఓ రైలు మార్గం కోసం ఓ మంచి అధికారి ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలచివేసింది. దాంతో ఆ కొండ దగ్గరే ఆయన్ని గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. ఆ తర్వాత మరో అధికారిని నియమించి, కొత్త ప్లాన్ వేసి, టన్నెల్‌ను పూర్తి చేశారు. దానికి బరోగ్ పేరునే పెట్టారు. అక్కడితో ఆ కథ ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ ముగియలేదు. మొదలైంది. రైళ్లు ఆ టన్నెల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏవేవో వింత శబ్దాలు, అరుపులు వినిపించడం మొదలైంది. ఒక్కోసారైతే ఎవరో మౌనంగా ఏడుస్తున్నట్టు అనిపించేది. ఆ ఏడుపు చాలా బాధతో నిండినట్టుగా ఉండేది. అలాగే బరోగ్ కూడా చాలా మందికి కనిపిస్తూ ఉండేవారు. మొదట్లో ఆయనెవరో ఎవరికీ తెలిసేది కాదు. కానీ బరోగ్ ఎలా ఉంటారో తెలిసిన కొందరు, అది బరోగ్ ఆత్మ అని తేల్చారు. నాటి నుంచీ బరోగ్ ఆత్మ తన ప్రాణాన్ని బలి తీసుకున్న టన్నెల్ చుట్టూనే తిరుగు తోందనే వార్త అంతటా పాకింది. అయితే ఎప్పుడూ ఎవరికీ ఏ హానీ మాత్రం జరగలేదు. పైగా ఓసారి రైలు చెడిపోతే ఆయన ఆత్మ వచ్చి రైలును బాగు చేసిందని కూడా కొందరు చెబుతుంటారు. ఇవన్నీ నిజమని నమ్మేవాళ్లు చాలామంది ఉంటే... కాదని వాదించేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. టన్నెల్ విషయంలో జరిగిన తప్పు వల్ల ఆయన ప్రాణాలు తీసుకుని ఉండొచ్చు, కానీ ఆయన ఆత్మ అక్కడే ఉందనడం మాత్రం అసత్యం అని తేల్చి చెప్పేస్తున్నారు వాళ్లు. ఏది నిజమో మనకు తెలియదు. నిజమే అయినా మనం చేసేదేమీ లేదు. నిజం కాకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. అయితే నిజమా అబద్ధమా అన్నదానితో సంబంధం లేకుండా నేటికీ ఆ సొరంగ మార్గంలో రైళ్లు ప్రయాణిస్తూనే ఉన్నాయి. నిజానిజాలు నిర్ధారించుకోవాలన్న ఆసక్తి కనుక మీరు ఉంటే... ఓసారి మీరూ వెళ్లి ఆ దారిలో ప్రయాణించి రావొచ్చు! -
హత్యకేసులో అనుమానితుడి ఆత్మహత్యాయత్నం
తిమ్మాపూర్ : పోలీసుల భయంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంకరపట్నం మండలం మొలంగూర్ వద్ద ముత్తారానికి చెందిన రాజేందర్ ఆదివారం రాత్రి హత్యకు గురి కాగా, ఈ కేసులో తిమ్మాపూర్ మండలం మక్తపల్లెకు చెందిన మైలారం శంకర్‌ను పోలీసులు అనుమానించారు. సోమవారం సాయంత్రం శంకరపట్నం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు మక్తపల్లెకు వచ్చి శంకర్‌ను, ఆయన భార్యను, స్నేహితులను విచారించారు. అనంతరం ఇంటివరకు అతడిని తీసుకుని పోలీసులు వెళ్లగా బాత్రూంకు వెళ్లివస్తానని ఇంటి వెనుకకు వెళ్లిన శంకర్ తిరిగి రాలేదు. పోలీసులు వెనక్కి వెళ్లి చూడగా శంకర్ గొంతును కత్తితో కోసుకున్నాడు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. ప్రైవేటు ఆసుపత్రిలో శంకర్ గొంతుకు శస్త్ర చికిత్స జరిగిందని, ఏమీ మాట్లడలేని స్థితిలో ఉన్నాడని స్థానికులు తెలిపారు. -
పెళ్లింట విషాదం
సిరిసిల్ల టౌన్, న్యూస్‌లైన్ : తెల్లవారితే ఆ ఇంట్లో పెళ్లి. పందిళ్లు... టెంట్లు.. ఇతర ఏర్పాట్లు... బంధువుల కోలాహలంతో అంతా సందడిగా ఉంది. ఇంతలో ఓ తాగుబోతు డ్రైవర్ ఆగడం ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. ఆటోను ఇష్టారాజ్యంగా నడపడంతో ఇంటిముందు వేసిన పందిరితోపాటు పెళ్లికూతురు తండ్రిని ఢీకొట్టగా అతడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం... సిరిసిల్ల పట్టణంలోని తారకరామనగర్‌కు చెందిన వేముల పుండరీకం(50) నేత కార్మికుడు. భార్య జమున బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు కాగా.. పెద్దకుమార్తెకు పెళ్లయింది. రెండోకూతురు అశ్విని వివాహం స్థానిక గణేశ్‌నగర్‌కు చెందిన పాముల రాజేందర్‌తో నిశ్చయించారు. గురువారం పెళ్లి. పెళ్లికూతురు ఇంటి ఎదుట పందిరి వేసి బుధవారం అంతా ఏర్పాట్లుచేస్తున్నారు. ఇంతలో అతిగా మద్యం తాగి టాటా ఏస్ వాహనం(ట్రాలీ ఆటో) నడుపుకుంటూ వచ్చిన ఓ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా పోనిస్తూ పందిరిని ఢీకొట్టాడు. పందిరి కూలడంతో ఇంట్లో ఉన్న పుండరీకం బయటకు వచ్చి డ్రైవర్‌ను నిలదీసే ప్రయత్నం చేశాడు. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ వాహనాన్ని వెనకకు తీస్తూ పుండరీకంపైనుంచి పోనిచ్చాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని చూసిన డ్రైవర్ వెంటనే అక్కడినుంచి ట్రాలీతో సహా పారిపోయాడు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. పీటలదాకా వచ్చిన అశ్విని పెళ్లి జరిపే విషయం పెద్దలు చర్చిస్తున్నారు. -
గడువులోగా సమాచారం ఇవ్వండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సాయిలు జిల్లాలోని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, సాధ్యమైనంత వర కూ కార్యాలయాల పూర్తి వివరాలను డిస్ప్లే బోర్డుపై ఉంచాలన్నారు. దీంతో సమాచార హక్కు ద్వారా అందే దరఖాస్తులను కొద్దిమేరైనా నివారించవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి 30 రోజుల్లోపు కోరిన సమాచారాన్ని అందజేయాలన్నారు. లేకపోతే జరిమానా తప్పదన్నారు. చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లా శిక్షణా కేంద్రం నుంచి వివిధ కార్యాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారులు అనవసరమైన సమాచారం కోరుతున్నారని వివిధ శాఖల అధికారులు డీఆర్ఓ ద ృష్టికి తీసుకురాగా, సెక్ష న్8 ప్రకారం ఇలాంటి దరఖాస్తులను తిరస్కరించాలని సూచించారు. అనంతరం సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ, చట్టం అమలులో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలన్నారు. సెక్షన్ 4(1)బి పరిధిలోని అంశాలకు అన్ని కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని తెలుగులో ఆర్టీఐ లోగో ముద్రించిన కాగితంపై ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా అధికారిక వెబ్సైట్లో పొందుపర్చాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ఆర్టీఐ సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ శివకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ పునర్నిర్మాణం’ సదస్సును జయప్రదం చేయండి
ఖమ్మం మామిళ్లగూడెం,న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణంపై నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్లో జరుగనున్న సదస్సును జయప్రదం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ కోరారు. ఆదివారం ఖమ్మంనగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పురిటిగడ్డ ఖమ్మం ఖిల్లా అని, 2009లో తెలంగాణ రాష్ట్ర సాదనకు కేసీఆర్ కరీంనగర్లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి ఆయన్ని ఖమ్మం తీసుకువచ్చారని, అది చారిత్రక దినంగా పాటిస్తున్నామని అన్నారు. 60 సంవత్సరాల ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు తీసుకువచ్చి తెలంగాణ సాధించారని అన్నారు. నేడు జరుగనున్న సదస్సుకు టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, టీజీవో రాష్ట కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఖాజామీయా పాల్గొంటారని తెలిపారు. పద్మావతి, పమ్మి కళాబృందాల ఆధ్వర్యంలో ధూంధాం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండీ అబ్దుల్ నబి, పాలేరు ఇన్చార్జ్ బత్తుల సోమయ్య, నాయకులు ఎస్‌యూ బేగ్, డోకుపర్తి సుబ్బారావు, నందిగాం రాజ్‌కుమార్, రయిస్ అన్వర్, రడం సురేష్ గౌడ్, పమ్మిరవి, రవికాంత్, శంకర్రావు, కాసాని నాగేశ్వరరావు, పగడాల నరేందర్ పాల్గొన్నారు. -
ఉల్లాసంగా రావణ దహనం
న్యూఢిల్లీ: తేలికపాటి జల్లులు నగరవాసుల ఉత్సాహాన్ని ఎంతమాత్రం నీరుగార్చలేకపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో పది తలల రావణాసురుడితోపాటు మేఘనాధుడు, కుంభకర్ణుల దిష్టిబొమ్మలను ఆదివారం దగ్ధం చేశారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ కార్యక్రమానికి వేలాది మంది నగరవాసులు తరలివచ్చారు. దీంతో ఆయా ప్రాంతాలు కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా నగరవాసులు కొత్త దుస్తులు ధరించి నగరంలోని వివిధ రాంలీలా మైదానాలకు వచ్చారు. నగరం నిండా దానవ రూపాలే మనిషిరూపంలో దానవులు సంచరించే మాటెలా ఉన్నా దసరా ఉత్సవాల సందర్భంగా నగరంలో అడుగడుగునా దానవ రూపాలు కొలువుదీరి కనిపించాయి. రాంలీలా ఉత్సవాల కోసం తయారై సిద్ధంగా ఉన్న దానవ మూర్తులు రావణ, కుంభకర్ణ, మేఘనాథ్‌ల దిష్టిబొమ్మలు బాటసారులను కట్టిపడేశాయి. రాక్షస రాజులు రావణసూరుడు, కుంభకర్ణుడు, మేఘనాథ్‌ల విగ్రహాలను రాంలీలా ఉత్సవాల్లో భాగంగా దహనం చేయడం జనాచారంగా కొనసాగుతోంది. తరాలుగా దానవేంద్రుల విగ్రహాల తయారీలో కొనసాగుతున్న తితార్‌పూర్ కళాకారుడిని ప్రశ్నించగా ‘‘దానవ విగ్రహాల్లో అన్నింటికంటే ఎత్తైది రావణాసురుడిది. ఇది విజయ దశమి రాత్రి రాంలీలా మైదానంలో దహనమైపోతుంది. విగ్రహాల ఎత్తు ప్రమాణంగా కుంభకర్ణుడు, మేఘానాథ్, రావణులకు మధ్య తేడా చూపిస్తాం’’ అని వివరించాడు. నడి రోడ్డుపై ప్రదర్శనగా ఉంచిన విగ్రహాలను గురించి ప్రస్తావించగా కళాకారుడు రాజేందర్ మాట్లాడుతూ ‘‘గత వారం విగ్రహాలు తయారీ పూర్తవుతున్న సమయంలో వర్షం కురవడంతో తడిసి పోయాయి. రంగులు వేసి ఆరడం కోసం రోడ్డు మధ్య నిలిపి ఉంచాం. రాంలీలా ఉత్సవాల కోసం రెండు నెలలు రాత్రింబవళ్లు కష్టపడతాం. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి 35 మంది కళాకారులను ఇందుకోసం పిలిపించుకుంటాం’’ అని ఆయన వివరించాడు. రాజేందర్ ఈ విగ్రహాల తయారీ 40 ఏళ్లుగా చేస్తున్నాడు. ఈసారి దానవమూర్తుల విగ్రహాలకు భారీ గుబురు, వంకలు తిరిగిన పొడవాటి మీసాలను అలంకరించాం. రెండు తలల విగ్రహాలకు ఈసారి డిమాండ్ పెరిగింది. సుమారు 50 అడుగుల ఎత్తయిన విగ్రహాలను రూ. 7 నుంచి 8 వేల ఖరీదుతో విక్రయించారు. -
ఈ విగ్రహాన్ని చూసైనా గోవుని రక్షించుకుంటారని..
ఖైరతాబాద్ వినాయకుడి పేరు చెప్పగానే ఆకాశమెత్తు గణనాథుడు కళ్లముందు దర్శనమిస్తాడు. అంతెత్తు వినాయకుడిని చూడగానే ఆ విగ్రహానికి రూపాన్నిచ్చిన రాజేందర్‌ను చాలామంది తలచుకుంటారు. నిజమే మరి... మూడునెలలపాటు కృషి చేస్తేగాని ఆ బొజ్జగణపయ్య మన ముందుకు రాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలే ఈరోజు మన కళాత్మకం. ప్ర: ఇప్పటివరకూ మీ చేతిలో ఎన్ని ఖైరతాబాద్ వినాయక విగ్రహాలు తయారయ్యాయి? జ: ఇప్పటివరకూ నేను పాతిక విగ్రహాలు చేశాను. ప్రస్తుతం మన కళ్లముందున్నది 59 అడుగుల విగ్రహం. 1978 నుంచి నేను చేస్తున్నాను. మధ్యలో తొమ్మిదేళ్లు చేయలేకపోయాను. 1978కి ముందు ధూల్‌పేట్ నుంచి విగ్రహాన్ని తెచ్చిపెట్టేవారు. నా చేతిలో తయారైన పాతిక విగ్రహాలకు పాతిక రకాల రూపాలు ఇచ్చాను. ప్ర: అన్ని విగ్రహాల్లోకి మీకు బాగా పేరు తెచ్చిన రూపం..? జ: 1982వ సంవత్సరంలో ఎలుక రూపంలో తయారుచేసిన గణేశవిగ్రహం నాకు బాగా పేరు తెచ్చింది. దర్శకులు కె విశ్వనాథ్‌గారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు ఆయన దర్శకత్వం వహించిన ‘సాగరసంగమం’ సినిమా షూటింగ్ కూడా ఆ విగ్రహం ముందు తీశారు. కమలహాసన్ నృత్యం చేస్తున్న దృశ్యాన్ని చిత్రీకరించారు. అలాగే విశ్వరూపం ఆకారంలో చేసిన వినాయకుడికి కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. ‘ఆది నేనే... అంతం నేనే’ అనే అర్థం వచ్చేట్టు విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఆ విగ్రహం ప్రతిక్షణం నా కళ్లలోనే ఉంటుంది. ప్ర: ప్రస్తుతం విగ్రహం రూపం ఏమిటి? జ: గో నాగచతుర్ముఖ వినాయకుడు. ఈ వినాయకుడు విగ్రహం తయారుచేయడానికి మూడు నెలల సమయం పట్టింది. రూపం తేవడానికి ఎంత కృషి చేస్తామో రూపాన్ని ఎన్నుకోవడానికి అంతే ఆలోచిస్తాం. ఏటా ఉండే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రూపాన్ని నిర్ణయిస్తాం. ఈ ఏడాది గోవధ గురించి వచ్చిన వార్తలు మా మనసుని కలచివేశాయి. అందుకే ఆవుని రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈసారి గోనాగ చతుర్ముఖ విగ్రహాన్ని తయారుచేశాను. కనీసం ఈ విగ్రహాన్ని చూసైనా గోవుని రక్షించుకుంటారని మా ఆశ. ప్ర: ఖైరతాబాద్ వినాయకుడు అనగానే ‘ఎత్తు’ సమస్య గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు. మీరేమంటారు? జ: 2000 సంవత్సరంలో 63 అడుగుల అతి ఎత్తై విగ్రహం తయారుచేశాం. కొన్ని ఇబ్బందుల కారణంగా తర్వాతి ఏడాది నుంచి పొడవు తగ్గించేశాం. ప్రస్తుత విగ్రహం పొడవు 59 అడుగులు. వచ్చే ఏడాదికి ఖైరతాబాద్ విగ్రహానికి 60 ఏళ్లు. అందుకే వచ్చే ఏడాది 60 అడుగుల విగ్రహం తయారుచేసి ఆ పై ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గించి తయారుచేస్తాను. ఏటా ఒక అడుగు తగ్గించుకుంటూ అరవై ఏళ్లనాటికి ఖైరతాబాద్ వినాయకుడిని కూడా ఇంట్లో వినాయకుడిలా ఒక్క అడుగులో దర్శనమివ్వాలనేది నా కోరిక. ప్ర: వినాయకుడి ‘రంగుల’ మాటేమిటి జ: వాతావరణాన్ని కలుషితం చేసే రంగులకి నేను వ్యతిరేకినే. పూర్వం వాడిన రంగులు నిజంగానే హానికరమైనవి. ఎప్పుడైతే వీటి గురించి ఆలోచించడం మొదలెట్టామో... అంటే... 2000 సంవత్సరం నుంచి కేవలం వాటర్పెయింట్స్ మాత్రమే వాడుతున్నాం. - భువనేశ్వరి