
భర్త అంత్యక్రియలు నిర్వహిస్తున్న భార్య సుజాత
హుజూరాబాద్‌రూరల్: మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సైదాపూర్ రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా అతడి చితికి భార్య నిప్పుపెట్టింది. గ్రామానికి చెందిన గడ్డం రాజేందర్(45)కు ఆదివారం వేకువజామున గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. రాజేందర్‌కు వివాహమై 20 ఏళ్లయినా పిల్లలు పుట్టలేదు. అప్పటి నుంచి మనోవేదనకు గురయ్యేవాడు. సాయంత్రం రాజేందర్ మృతదేహానికి భార్య సుజాత అంత్యక్రియలు నిర్వహించి, చికితి నిప్పుపెట్టింది. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment