సిరిసిల్ల (కరీంనగర్) : కడ వరకు తోడుంటానని మాటిచ్చిన భర్త జీవిత చరమాంకంలో తనను ఒంటరి చేసి వెళ్లిపోవడంతో.. తట్టుకోలేని ఆ భార్య గుండె ఆగిపోయింది. రోజు మాదిరిలానే భర్తను నిద్రలేపడానికి ప్రయత్నిస్తుండగా.. ఆయన మృతి చెందినట్లు గుర్తించిన భార్య తనువు చాలించింది. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల భావనారుషి నగర్‌లో ఆదివారం ఉదయం జరిగింది.
స్థానికంగా నివాసముంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు చిమ్మని రామస్వామి(78).. ఆదివారం తెల్లవారు జామున మృతిచెందడంతో..ఈ విషయం గమనించిన ఆయన భార్య రామలక్ష్మి(70) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందింది. అరగంట వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
భర్త మరణవార్తను తట్టుకోలేక ఆగిన భార్య గుండె
Published Sun, Jul 10 2016 10:20 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement