
గాంధీలో కాంట్రాక్టు నర్సుల సమ్మె
హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సులు గురువారం విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, 10వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలని కోరుతూ సుమారు 200 మంది కాంట్రాక్టు నర్సులు నిరసనకు దిగారు. నర్సులు సమ్మెకు దిగటంతో గాంధీ ఆసుపత్రి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం వారితో సమ్మె విరమింపజేసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతున్నారు.