- డీఆర్‌డీఏ పీడీ మురళీధర్‌రావు
సత్తుపల్లి టౌన్: స్వయం సహాయక సంఘాల రుణాల విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే వేటు తప్పదని డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్ట్ డెరైక్టర్(పీడీ) మురళీధర్‌రావు హెచ్చరించారు. సత్తుపల్లి ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఆరు మండలాల స్థాయిలో జరిగిన క్లస్టర్ సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు. బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి రుణాల లబ్ధిదారులకు సక్రమంగా అందించాలన్నారు. బ్యాంకు రుణాలు నూరుశాతం వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు రవాణా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు బిల్లులు వెంటనే రావటం కోసం సివిల్ సప్లైకి బిల్లులు పంపించాలన్నారు. ధాన్యం కొనుగోలు, నాణ్యత విషయంలో రాజీ పడవద్దన్నారు.
ప్రతి సభ్యురాలి ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్‌లను ఆన్‌లైన్ చేయాలన్నారు. 2014-15 సంవత్సరానికి ఆమ్ ఆద్మీ, అభయహస్తం, జనశ్రీ బీమా యోజనకు సంబంధించిన ఉపకార వేతనాలు అందించేందుకు 8, 9, 10, ఇంటర్ విద్యార్థుల స్టడీ సర్టిఫికెట్లను ఈ నెల 25వ తేదీలోపు సేకరించాలని సీసీలను ఆదేశించారు. మండలాలవారీగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సీఐఎఫ్ సంఘాల సమావేశాలు, బుక్ నిర్వహణ, మార్కెటింగ్ సెంటర్ల నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయం అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఏరియా కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, స్త్రీ నిధి ఏజీఎం వనిత, ఏపీఎంలు కిరణ్‌రాయ్, రాంబాబు, సత్యనారాయణ, బెనర్జీ, సత్యనారాయణరాజు, సుబ్బారావు, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఆరు మండలాల క్లస్టర్ కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
అవినీతిపరులపై వేటు తప్పదు
Published Wed, May 13 2015 4:30 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement