
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మహేందర్‌రెడ్డి తెలిపారు.
కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు. సభలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment