హైదరాబాద్: నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా శుక్రవారం నుంచి పది వామపక్షాలు బస్సుయాత్ర చేపట్టనున్నాయి. భువనగిరిలో శుక్ర వారం ప్రారంభించి నల్లగొండ వరకు ప్రచారం కొనసాగించనున్నారు. ఈ మేరకు గురువారం మగ్దూం భవన్‌లో జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), వేములపల్లి వెంకట్రామయ్య (న్యూడెమోక్రసీ),తదితరులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.