ఖమ్మం మయూరిసెంటర్: ప్రజాపునాదిని విస్తరింపజేసేలా, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణమే లక్ష్యంగా పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయటానికి అన్ని స్థాయిల్లో మహాసభలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు డు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. సోమవా రం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తున్నాయన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, తదితర హిందూమతోన్మాద శక్తులు వామపక్ష నాయకులపైన, సీపీఎం కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని, ఈ తరుణంలో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవా లని సూచించారు. పార్టీ కేంద్ర కమిటీ నిర్దేశిం చిన విధంగా ఖమ్మం జిల్లాలో ఉన్న 500 శాఖ ల్లో 80 శాతం మహాసభలు జరుపుకొని కొత్త కార్యదర్శులను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో 21 రెవెన్యూ మం డలాలతో పాటు కమిటీలకు మహా సభలు నిర్వహించాల్సి ఉందన్నారు.
షెడ్యూల్ కంటే ముందుగానే అక్టోబర్ 27 నుంచే మండల మహాసభలు ప్రారంభం కానున్నాయన్నారు. డిసెంబర్ 19, 20 తేదీల్లో వైరాలో జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 2018 ఏప్రిల్‌లో సీపీఎం అఖిలభారత మహాసభలు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, బత్తుల లెనిన్, బండి రమేష్, మల్సూర్, నర్సయ్య, వై.విక్రమ్, శ్రీనివాసరావు, అఫ్రోజ్ సమీనా, బండి పద్మ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment