కర్ఫ్యూలా...
హన్మకొండ సిటీ : సమగ్ర కుటుంబ సర్వేతో మంగళవారం రైల్వే, ఆర్టీసీ బస్‌స్టేషన్లు, రహదారులు, ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో 945 బస్సులు రోడ్డెక్కలేదు. కార్మికులందరూ కుటుంబ సర్వేలో పాల్గొనడానికి ఇంటి వద్దనే ఉండిపోవడంతో అవి డిపోల్లోనే ఉన్నాయి. మధ్యాహ్నం లోపు సర్వే పూర్తి చేసుకున్న ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కావడానికి రావడంతో సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కో బస్సు డిపోల నుంచి బయటకు వెళ్లింది. ఈ లోపు సర్వే పూర్తి చేసుకున్న ప్రయాణికులు తక్కువ సంఖ్యలో తిరుగుముఖం పట్టారు.
దీంతో అధికారులు సాయంత్రం బస్సులను అడపాదడపా నడిపించారు. హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హైదరాబాద్ రూట్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా బస్సులు నడిపారు. మిగతా రూట్లలో నైట్‌హాల్ట్ బస్సులను పునరుద్ధరించారు. కాగా, బుధవారం తిరుగు ప్రయాణం చేసేవారికి ఇబ్బందు లు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ రూట్‌లో రెగ్యులర్‌గా నడిచే 242 షెడ్యూల్డ్ పోనూ ప్రయూణికుల సంఖ్యను బట్టి అదనపు బస్సులను నడిపించేం దుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ వరంగల్ రీజి నల్ మేనేజర్ ఇ.యాదగిరి తెలిపారు. డిప్యూటీ సీటీఎం భవానీ ప్రసాద్, డిపో మేనేజర్లు అబ్రహం, సుగుణాకర్, సురేష్‌తోపాటు మరికొంద రు సూపర్‌వైజర్లు హన్మకొండ బస్‌స్టేషన్‌లో ఉండి పరిస్థితిని గమినించుకుంటూ ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పారు. మిగతా రూట్లలో కూడా ప్రయాణికుల అవసరాలను బట్టి బస్సులను సమకూర్చనున్నట్లు వెల్లడించారు.