bus stations
-
ఓటుహక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్లకు వెళ్తున్న ఓటర్లు
-
సంక్రాంతికి ఎట్లైనా ఊరికి పోవాలె (ఫొటోలు)
-
బస్స్టేషన్లలోని మరుగుదొడ్లలో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్: సజ్జనార్
ఖైరతాబాద్: గౌలిగూడ మహాత్మాగాంధీ, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ల లో ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు శానిటరీ ప్యాడ్ బాక్స్‌లు కూడా ఏర్పా టు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లలో నవంబర్‌లోగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. బాలికా విద్య, మహిళలు రుతు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ (ప్యూర్) స్వచ్ఛంద సంస్థ ‘ప్యూరథాన్’ నిర్వహించింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా ఆదివారం ఉదయం జరిగిన 2కె, 5కె రన్, వాక్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళల్లో శానిటరీ ప్యాడ్స్ గురించి మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఆర్టీసీ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. కొందరు రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడతారని, ఇది ప్రకృతి సహజమైనదని అన్నారు. ప్యాడ్స్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థినులు పాఠశాలల నుంచి డ్రాపవుట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుతుక్రమంపై ముఖ్యంగా మగవారిలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, సినీ నటుడు సత్యదేవ్ అన్నారు. జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో అలాగే ప్యాడ్లను కొనుగోలు చేసేలా మహిళలు, యువతులు, బాలికల్లో ధైర్యం పెంచేందుకు ఈ పరుగును నిర్వహించినట్లు ప్యూర్ సంస్థ ఎండీ శైలా తాళ్లూరి తెలిపారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రమేష్, సినీనటి దివి, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, గాయని గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. -
అద్దె మాఫీ.. వారికి ఉపశమనం..
సాక్షి, అమరావతి బ్యూరో: బస్స్టేషన్లలో ఉన్న షాపులకు అద్దెల భారం నుంచి ఉపశమనం కలిగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో బస్స్టేషన్లలో షాపులను మూసివేశారు. దీంతో నిర్వాహకులు ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ అమలులోకి వచ్చిన మార్చి 23 నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తిరిగి మే 21 నుంచి పాక్షికంగా తిరుగుతున్నాయి. బస్సులు తిరగకపోవడంతో బస్ స్టేషన్లకు వచ్చే వారే లేకుండా పోయారు. ఫలితంగా అక్కడ ఉండే షాపులను తెరవలేదు. వ్యాపారం సాగకపోవడంతో అద్దె బకాయిలను రద్దు చేయాలని సంబంధిత షాపుల నిర్వాహకులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఏప్రిల్, మే, జూన్లకు వారు చెల్లించాల్సిన షాపుల అద్దెలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. రీజియన్‌లో పరిస్థితి.. ♦ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో 14 డిపోలున్నాయి. వీటిలో 414 అద్దె స్టాళ్లు(షాపులు) ఉండగా, 320 వరకు నడుస్తున్నాయి. ♦అందులో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్)లో 141 షాపులకు గాను దాదాపు వంద స్టాళ్లు రన్నింగ్‌లో ఉన్నాయి. ♦ఒక్కో షాపునకు నెలకు కనీసం రూ.11 వేల నుంచి 4 లక్షల వరకు అద్దె♦ చెల్లిస్తున్నారు. ♦బస్స్టేషన్లలో బ్యాంకు ఏటీఎంలకు మాత్రమే అత్యల్పంగా రూ.11 వేల అద్దె ఉంది. ♦మిగిలిన షాపులకు అద్దె రూ.20 వేల నుంచి లక్షల్లో ఉంది. ఇలా భారీ మొత్తంలో అద్దె చెల్లిస్తున్న వాటిలో డారి్మటరీలు, హోటళ్లు వంటివి ఉన్నాయి. ♦ఈ రీజియన్‌లోని బస్స్టేషన్లలో నడుస్తున్న అద్దె షాపుల నుంచి నెలకు రూ.1.62 కోట్ల అద్దె వస్తోంది. ♦ఈ లెక్కన ఆర్టీసీ యాజమాన్యం తాజా నిర్ణయం ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలకు దాదాపు రూ.5 కోట్ల వరకు అద్దె మాఫీ కానుంది. ఖాళీ షాపులకు త్వరలో టెండర్లు.. వివిధ బస్స్టేషన్లలో ఖాళీగా ఉన్న షాపులకు త్వరలో టెండర్లు పిలవడానికి ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. వీటికి టెండర్లు ఖరారు చేస్తే ఈ షాపుల నుంచి కూడా ఆర్టీసీకి అద్దెల రూపంలో మరింత ఆదాయం సమకూరనుంది. -
సంక్రాంతి పండుగ రద్దీ
-
చలో పల్లె‘టూర్’
-
హైదరాబాద్‌లో ‘ఆలంబాగ్’!
ఆధునిక బస్స్టేషన్ల నిర్మాణానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.హైదరాబాద్ నగర అందాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా వీటిని నిర్మించడంతో పాటు, అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తారు. ఏసీ సదుపాయం , ఫుడ్‌ప్లాజాలు, షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు, బ్యాంకులు, తదితర అన్ని వాణిజ్య కార్యకలాపాలకు, వినోదాలకు కేంద్రంగా సిటీబస్స్టేషన్ల ఏర్పాటుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. నగర వాసులను, పర్యాటకులు సైతం వీటిని సందర్శించేవిధంగా నిర్మించనున్నారు.యూపీ రాజధాని లక్నోలోని ఆలంబాగ్‌లో కట్టించిన హైటెక్ బస్‌స్టేషన్ తరహాలో నగరంలోని గౌలిగూడ, జూబ్లీబస్‌స్టేషన్, తదితర ప్రాంతాల్లో నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందుకోసం ఆర్టీసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తంతో పాటు మరి కొందరు సీనియర్ అధికారులతో కూడిన బృందం ఫిబ్రవరి ఒకటో తేదీన లక్నోకు వెళ్లనుంది. యూపీలోని పలు నగరాల్లో ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో కట్టించిన బస్స్టేషన్లను కూడా అధికారులు పరిశీలించనున్నారు. ఈ బస్స్టేషన్లలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఏటా రూ.100 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి, హైదరాబాద్ ఆలంబాగ్ ప్రత్యేకతలు.. - మొత్తం 26,500 చదరపు గజాల విస్తీర్ణంలో అక్కడి అందాలను రెట్టింపుచేసే విధంగా నిర్మించారు. - రోజుకు 80 వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగేలా ఏర్పాట్లు . 50 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. - షాలీమార్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుమారు రూ.200 కోట్లతో నిర్మించింది. ఇది ఒక అత్యాధునిక టౌన్షిప్పులా ఉంటుంది. - డిజైన్,బిల్డ్, ఫైనాన్స్,ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో దీన్ని కట్టించారు. 35 ఏళ్ల పాటు దీనిని లీజుకు ఇచ్చారు. - ఇలాంటివే లక్నో, ఆగ్రా, అలహాబాద్, మీరట్, ఘజియాబాద్, కాన్పూర్లలో 21 బస్స్టేషన్లను యూపీఎస్ ఆర్టీసీ నిర్మిస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం.. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని బస్స్టేషన్లలో స్టాల్స్, ఇతర వ్యాపార కేంద్రాల నుంచి ఆర్టీసీకి ఏటా రూ.86 కోట్ల ఆదాయం లభిస్తోంది.ఈ ఏడాది రూ.103 కోట్లకు పెంచేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. మరోవైపు పెట్రోల్ బంకుల ద్వారా మరో రూ.25 కోట్లను ఆర్జించేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో 113 చోట్ల బంకుల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టారు. వీటిలో 9 బంకులు ఆచరణలోకి వచ్చాయి. మరో 5 చోట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక ఆధునిక బస్స్టేషన్ల ఏర్పాటు ద్వారా రానున్న రెండేళ్లలో మొత్తంగా వాణిజ్య ఆదాయాన్ని రూ.300 కోట్లకు పెంచుకోవాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇందులో తొలి విడతగా గౌలిగూడలోని 4.5 ఎకరాలు, జూబ్లీబస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న 3.5 ఎకరాల స్థలాల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్లో అత్యా ధునిక బస్స్టేషన్లు నిర్మించనున్నారు. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్‌కు, మహాత్మాగాంధీ మెట్రో స్టేషన్‌కు ఆనుకొని ఉండే ఈ స్థలాల్లో బస్స్టేషన్లను ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ–మెట్రో కనెక్టివిటీ పెరగడంతో పాటు, రెండు చోట్లా మల్టీప్లెక్స్ థియేటర్లు, మాల్స్, ఫుడ్‌ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ బస్స్టేషన్లు భాగ్యనగర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మించి 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యాపారులకు లీజుకు ఇస్తారు. అనంతరం చిలకలగూడ, మెట్టుగూడ,కాచిగూడ, ఆర్టీసీ పాత ఎండీ కార్యాలయ స్థలాల్లోనూ పీపీపీ తరహాలో వాణిజ్య భవన సముదాయాలను నిర్మించే ప్రణాళికలో అధికారులు ఉన్నారు. -
పోటెత్తిన దసరా రద్దీ.. కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
-
'23 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ'
తాండూరు: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లను ఆధునీకరించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తాండూరు బస్టాండ్ ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. తాండూరు నుంచి గానుగాపూర్ నూతన బస్సు సర్వీసు ప్రారంభించారు. 10 జిల్లాల్లోని 95 డిపోల పరిధిలో ఉన్న బస్టాండ్లను రూ.23 కోట్ల నిధులతో ఆధునీకరించనున్నట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు. -
కర్ఫ్యూలా...
హన్మకొండ సిటీ : సమగ్ర కుటుంబ సర్వేతో మంగళవారం రైల్వే, ఆర్టీసీ బస్స్టేషన్లు, రహదారులు, ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో 945 బస్సులు రోడ్డెక్కలేదు. కార్మికులందరూ కుటుంబ సర్వేలో పాల్గొనడానికి ఇంటి వద్దనే ఉండిపోవడంతో అవి డిపోల్లోనే ఉన్నాయి. మధ్యాహ్నం లోపు సర్వే పూర్తి చేసుకున్న ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కావడానికి రావడంతో సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కో బస్సు డిపోల నుంచి బయటకు వెళ్లింది. ఈ లోపు సర్వే పూర్తి చేసుకున్న ప్రయాణికులు తక్కువ సంఖ్యలో తిరుగుముఖం పట్టారు. దీంతో అధికారులు సాయంత్రం బస్సులను అడపాదడపా నడిపించారు. హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హైదరాబాద్ రూట్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా బస్సులు నడిపారు. మిగతా రూట్లలో నైట్‌హాల్ట్ బస్సులను పునరుద్ధరించారు. కాగా, బుధవారం తిరుగు ప్రయాణం చేసేవారికి ఇబ్బందు లు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ రూట్లో రెగ్యులర్‌గా నడిచే 242 షెడ్యూల్డ్ పోనూ ప్రయూణికుల సంఖ్యను బట్టి అదనపు బస్సులను నడిపించేం దుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ వరంగల్ రీజి నల్ మేనేజర్ ఇ.యాదగిరి తెలిపారు. డిప్యూటీ సీటీఎం భవానీ ప్రసాద్, డిపో మేనేజర్లు అబ్రహం, సుగుణాకర్, సురేష్‌తోపాటు మరికొంద రు సూపర్వైజర్లు హన్మకొండ బస్‌స్టేషన్‌లో ఉండి పరిస్థితిని గమినించుకుంటూ ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పారు. మిగతా రూట్లలో కూడా ప్రయాణికుల అవసరాలను బట్టి బస్సులను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. -
అభివృద్ధి రికార్డులకే పరిమితం
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : ఆర్టీసీలో అభివృద్ధి అనేది రికార్డులకే పరిమితమైంది. జిల్లా కేంద్రంలోని రెండు బస్స్టేషన్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ప్రయాణికులు కూర్చునేందుకు అనువైన కుర్చీలు, బల్లలు కూడా లేవంటే ఈ బస్స్టేషన్లు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గ్యారేజీలో మిగిలిపోయిన, తుప్పు పట్టిన కమ్ములను వెల్డింగ్ చేసి కుర్చీలుగా వినియోగిస్తున్నారు. బస్సుల కోసం వేచి చూడటంలో భాగంగా విసుగు చెందకుండా కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన టీవీలు అమావాస్యకు, పౌర్ణానికి మాత్రమే పనిచేస్తున్నాయి. ఒకవేళ టీవీలు పని చేస్తున్నప్పుడు ప్రకటనలతో ఊదరగొట్టడం తప్ప ప్రయాణికులకు అవసరమైన సమాచారం, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలకు చోటులేదనే విమర్శలున్నాయి. మరుగుదొడ్ల పరిస్థితి అంతంత మాత్రమే. బస్టాండ్ ప్రాంగణంలో కాంట్రాక్టర్ నిర్వహణలో ఉన్న మరుగుదొడ్లలో మలవిసర్జనకు రూపాయి మాత్రమే వసూలు చేయాల్సి అంతకు ఐదింతలు ప్రయాణికుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు స్టేషన్ల అభివృద్ధి పేరుతో ప్రయాణికుల నుంచి ప్రతి టికెట్‌పై రూపాయి (డెవలప్మెంట్ సెస్సు) వసూలు చేస్తున్నారు. రీజియన్ పరిధిలో ఈ విధంగా వసూలు చేసిన డబ్బు లక్షల్లో ఉంటుంది. ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ వారికి సౌకర్యాలు కల్పించడంలో చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సుల కండీషన్ అధ్వానం ప్రధాన నగరాలకు వెళ్లే సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు చూసేందుకు ఒకింత అందంగా కనపడినా గ్రామీ ణ బస్సుల్లో సీట్లు చిరిగి, రేకులు, చీలలు పైకి లేచి అధ్వానంగా ఉన్నాయి. 2వ డిపో నుంచి వివిధ గ్రామాలకు కాలం చెల్లిన బస్సులనే నడుపుతుండటంపై విమర్శలు ఉన్నాయి. సాధారణంగా 12 లక్షల కిలో మీటర్లు తిరిగిన బస్సును పాత ఇనుము కింద విక్రయించాలి. అయితే రీజియన్ పరిధిలోని 862 బస్సుల్లో సగానికి పైగా బస్సులు 30 లక్షల కిలో మీటర్లు తిరిగినవేనని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. కేవలం డ్రైవర్ల నైపుణ్యం, అంకిత భావం వల్లే ఈ బస్సులను రోడ్లపై నడిపి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా బస్సును తిరిగి సురక్షితంగా డిపోలో అప్పగిస్తున్నారు. పేరుకే ‘సూపర్’.. లగ్జరీ కరువే ఆర్టీసీ గరుడ బస్సుల తర్వాత అధిక చార్జీలు వసూలు చేసేది సూపర్ లగ్జరీ బస్సుల్లోనే. మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ఆదరించేది, ప్రయాణించేది సూపర్ లగ్జరీ బస్సుల్లోనే. ఈ బస్సుల్లోనూ వసతులు అరకొరగానే ఉన్నాయి. పలు బస్సుల్లో టీవీలు పని చేయడం లేదు. దుర్గంధభరితంగా ప్రధాన బస్‌స్టేషన్ ప్రధాన బస్‌స్టేషన్ ప్రవేశ ద్వారంలోనే పలువురు మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో ప్రవేశంలోనే ఎవరైనా ముక్కులు మూసుకోవాల్సిందే. బస్స్టేషన్ల్లోని మరుగుదొడ్లలో నగదు వసూలు చేస్తుండటంతో ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బస్‌స్టేషన్‌లో రోడ్లు అధ్వానం బస్‌స్టేషన్‌లో రోడ్డు పగుళ్లిచ్చి గుంత లు ఏర్పడి ఉన్నాయి. పక్కనే ఉన్న హోటల్ నుంచి వచ్చే వ్యర్థపు నీరు, బస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ నుంచి వచ్చే మురుగు నీరు ఈ గుంతల్లో నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగనివ్వం : ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగనివ్వం. బస్‌స్టేషన్‌లో అనునిత్యం పారిశుధ్య చర్యలు చేపడతాం. 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో అదనపు బస్సులు నడుపుతున్నాం. - చింతా రవికుమార్, ఆర్ఎం