తండాకు కరెంట్ షాక్ | current shock to thanda | Sakshi
Sakshi News home page

తండాకు కరెంట్ షాక్

Published Fri, Dec 12 2014 2:41 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

తండాకు కరెంట్ షాక్ - Sakshi

తండాకు కరెంట్ షాక్

ఒకరు మృతి... వరంగల్ జిల్లాలో ఘటన
పాలకుర్తి: తండా మొత్తానికి విద్యుత్ షాక్ రావడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరు గ్రామపంచాయతీ శివారు చీమలభాయి తండాలో  లకావత్ నాను నాయక్(60) స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుదా ఘాతానికి గురై ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అంతకు ముందే ఒక మహిళ విద్యుదాఘాతానికి గురైంది.

తండాకు చుట్టపుచూపుగా వచ్చిన జనగామ మండలం పెద్దపహాడ్‌వాసి బానోతు బాలు కరెంట్ షాక్‌కు గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమారు 120 గృహా లున్న చీమలభాయి తండాలో ఒకే ట్రాన్స్‌ఫారం ఉందని, దానికి విద్యుత్ ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో నేరుగా కరెంట్ సరఫరా అయి  ప్రాణాలు పోతున్నాయని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement