డీసీఎం వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ (లక్సెట్టిపేట) : డీసీఎం వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. లక్సెట్టిపేటలోని ఎల్లారం స్టేజ్ సమీపంలో సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని డీసీఎం వాహనం ఢీకొట్టి వెళ్లింది.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే తీవ్ర గాయాలపాలైన సైకిలిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం వాహనం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.