
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని నందిపేట్ మండలం మారంపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలు మితిమీరాయి. గ్రామంలోని దాదాపు 80మంది దళితులను వీడీసీ సభ్యులు సాంఘీక బహిష్కరణ చేశారు. గ్రామంలోని అంబేద్కర్ భవన నిర్మాణానికి సంబంధించిన విషయంలో తమను సాంఘీక బహిష్కరణ చేశారని దళిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాచారం అందుకున్న ఆర్మూర్ ఏసీపీ అందే రాములు, ఎమ్మార్వో , ఎంపీడీఓ, ఎస్‌లు మారంపల్లి గ్రామాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment