దత్తాత్రేయను తొలగించడంపై ఆగ్రహం | Dattatreya ‍has been fired bc leaders become angry | Sakshi
Sakshi News home page

దత్తాత్రేయను తొలగించడంపై ఆగ్రహం

Published Sun, Sep 3 2017 9:52 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

దత్తాత్రేయను తొలగించడంపై ఆగ్రహం - Sakshi

దత్తాత్రేయను తొలగించడంపై ఆగ్రహం

కేంద్ర కేబినెట్‌ విస్తరణపై బీసీ సంఘం మండిపాటు
సాక్షి, హైదరాబాద్‌: బీసీ సామాజిక వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించడంపై బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు ఏ.సత్యనారాయణ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు బీసీ మంత్రి తొలగింపుతో పాటు రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడంపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేకిగా మారుతోందని ఆరోపించారు.

ఆదివారం బీసీ భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించడం, కొత్త మంత్రివర్గంలో రాష్ట్రానికి అవకాశం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 7న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నాయకులు పాల్గొనాలని బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం ప్రతినిధులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్‌, సి.రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement