గర్భిణులతో కళకళలాడుతున్న సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి (ఫైల్)
బిడ్డకు జన్మనీయడం తల్లికి పునర్జన్మలాంటిది. ఎన్నో కష్టాలకోర్చి బిడ్డను నవమాసాలు మోసిన తల్లి.. ప్రసవ సమయంలో పడే బాధ వర్ణణాతీతం. అలాంటి మహిళ.. నార్మల్ డెలివరీ కోసం ఎంతటి బాధనైనా భరించేందుకు సిద్ధపడుతుంది. అయితే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వైద్యులు నొప్పి లేకుండా ప్రసవం చేస్తామని.. సిజేరియన్‌ల పేరుతో దోచుకుంటున్నారు. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా.. ఆపరేషన్ చేసి వేలకు వేలు దండుకుంటున్నారనే విమర్శలున్నాయి.
సిజేరియన్‌లు చేసి డబ్బు దండుకోవడం దేశ వ్యాప్తంగా ఆస్పత్రులకు ఒక వ్యాపారంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించిన వారికి రూ.12వేల నగదు ప్రోత్సాహకంతోపాటు కేసీఆర్ కిట్ పేరిట తల్లీబిడ్డకు సరిపడా వస్తువులు ఇస్తున్నారు. దీం తో అనూహ్యంగా ప్రభుత్వాస్పత్రుల వైపు ప్రజలు మొగ్గు చూపడం, ప్రైవేట్ ఆస్పత్రు లు వెలవెలబోవడం జరుగుతున్నాయి.
సాక్షి, సిద్దిపేట : అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ ప్రకటన తర్వాత జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు మూడింతలు పెరిగాయి. జిల్లాలోని 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 అర్బన్ హెల్త్ సెంటర్లు, చేర్యాల, నంగునూరు, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ పట్టణాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుతోపాటు, సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్రంలోనే మెరుగైన వైద్యసేవలు అందించే పేరున్న ఏరియా
Comments
Please login to add a commentAdd a comment