దూపకుంటకు ‘డబుల్’ హారం! | Department of Revenue to exercise | Sakshi
Sakshi News home page

దూపకుంటకు ‘డబుల్’ హారం!

Published Fri, Jan 22 2016 2:37 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

Department of Revenue to exercise

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి
రెవెన్యూ శాఖ కసరత్తు
జీ ప్లస్ 4 పద్ధతిలో నిర్మాణం
గతంలో పట్టాలు పొందినవారికి తొలి ప్రాధాన్యం

 
హన్మకొండ : డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి నగర శివారులో ఉన్న దూపకుంట గ్రామం పరిధిలోని భూములను ఎం పిక చేసే దిశగా రెవెన్యూ శాఖ కసరత్తు చే స్తోంది. మురికివాడలు లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతానంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి త్వరితగతిన ఆచరణాత్మక రూపు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశారు. వరంగల్ పరిధిలోని దాదాపు 30వేల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం భారీగా స్థలం అవసరం ఉంది. నగర పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. రెవెన్యూ రికార్డులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాస్ట ర్ ప్లాన్, కాకతీయ అర్బ న్ డెవలప్‌మెంట్ లే ఔట్లను క్షుణ్ణంగా పరిశీలి స్తున్నారు. వేలాది ఇళ్లు నిర్మించాల్సి ఉన్నందు న ఎక్కువ విస్తీర్ణంలో ఒకేచోట ప్రభుత్వ స్థలం లభ్యత ఉన్న ప్రదేశాలపై అధికారులు దృష్టిసారించారు. గ్రేటర్‌లో ఇటీవల విలీనమైన గీసుకొండ మండలం దూపకుంట పరిధిలో ఒకేచోట 22 ఎకరాల స్థలం ఉన్నట్లుగా గుర్తించారు. గత ఏడాది 9 మురికివాడల్లో ఇళ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే స్థలం అందించే విషయం లో స్థానికుల నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈసారి అలా కాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

అభ్యంతరాలు రాకుండా..
దూపకుంటలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గతంలో పేదలకు 50 గజాల వంతున ప్రభుత్వం పంపిణీ చేసింది. విద్యుత్, రోడ్డు సౌకర్యం కల్పించారు. ఐదేళ్లు గడిచినా ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు జరుగలేదు. దీంతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు ఈ స్థలం అనువైనదని అధికారులు భావిస్తున్నారు. గతంలో భూములు పొంది, ఇళ్లు కట్టుకోలేకపోయిన పేదలకు  డబుల్ బెడ్‌రూం ఇళ్ల  కేటాయిం పులో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా ఇళ్ల నిర్మాణానికి, స్థల సేకరణకు పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

లిఫ్టు వసతితో..
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం వరంగల్ నగరంలో 30వేల ఇళ్లను నిర్మించా ల్సి ఉంది. స్థల లభ్యత, సేకరణ ప్రక్రియ, స్థానికుల నుంచి మద్దతు విషయంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు తది తర సౌకర్యాలు ఉండే లేఔట్‌తో స్థలమున్న చోటే పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణరుుంచారు. దీంతో దూపకుంటలో నిర్మించనున్న డబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్లను కనీసం జీ ప్లస్ 4 పద్ధతిలో నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ విధానంలో నిర్మించే ఇళ్లకు వివిధ అంతస్తుల్లో ఉండే ప్రజలు రాకపోకలు సాగించేం దుకు లిఫ్ట్ వసతిని ఏర్పాటు చేయాల్సి ఉం టుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement