మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దళితుల కు సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మిట్టమీది నాగరాజు శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ స బ్సిడీ రుణాలు నిరుపేద దళితులకు దక్కలేద ని, కేవలం పైరవీకారులు, అనర్హులకు మంజూ రయ్యాయని విమర్శించారు. ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక బ్యాం క్ ఏర్పాటు చేసి అర్హులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేసి దళితుల కు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.