దేవుడికి భక్తుల బిస్కెట్! | Devotees rendered biscuit to Lord Vishnu avatar | Sakshi
Sakshi News home page

దేవుడికి భక్తుల బిస్కెట్!

Published Mon, Aug 18 2014 4:12 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

దేవుడికి భక్తుల బిస్కెట్!

దేవుడికి భక్తుల బిస్కెట్!

భగవంతుడికి ప్రసాదాలు సమర్పించడంలో భక్తులు వివిధ రకాల ఆచారాల్ని పాటిస్తారు. భగవంతుడి పత్ర్యేకతను బట్టి ఆయ ప్రాంతాల్లో ప్రసాదాలు కూడా మారుతుంటాయి. కాని హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలోని వలిగొండ మండలంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని చేపలకు బిస్కెట్లను ప్రసాదాలుగా సమర్పిస్తారు. అందుకు కారణంగా ఈ ఆలయానికి చేరువలోని సరస్సులోని చేపల తలపై విష్ణు నామాలు ఉండటమే కారణమట. వలిగొండ మండలంలోని వెములకొండ గ్రామంలోని ఓ కొండపై ఈ ఆలయం ఉంది. ఈ సరస్సులోని చేపలు బయటకు తేలడానికి భక్తులు బిస్కెట్లను విసరడం ఆనవాయితీగా వస్తోంది. 
 
ఈ సరస్సులోని చేపలు విష్ణుదేవుడ్ని భక్తులు మత్స్య అవతారంలో చూసుకుంటారని ఆలయ పూజారి శ్రీనివాసచార్యులు వెల్లడించారు. ఇక్కడి సరస్సుల్లోని ప్రతి చేప విష్ణుమూరి తొలి అవతారమైన మత్య్స అవతారంలో ఉంటారని గాఢంగా భక్తులు విశ్వసిస్తారని పూజారి తెలిపారు. పులిహోర, దద్దోజనం లాంటి ప్రసాదాలతోపాటు బిస్కెట్లు కూడా ఉదయం ఆరు గంటలకే చేపలకు సమర్పిస్తారని పూజారి అన్నారు. చేపలకు బిస్కెట్ ప్రసాదం సమర్పించడానికి ఆలయ కమిటీ ప్రత్యేకంగా బిస్కెట్ల అమ్మకానికి అనుమతి కూడా ఇచ్చింది. 
 
గతంలో సరస్సును శుద్ది చేసే భాగంగా పాత నీటిని తీసివేసి.. కొత్త నీటితో సరస్సును నింపారట. అయితే కొత్త నీరు చేర్చిన తర్వాత ఓ ట్రక్ లోడ్ సరిపోయే చేపలు సరస్సులో మరణించడం భక్తుల విశ్వాసంపై తీవ్రంగా ప్రభావం చూపిందని అక్కడివారు చెబుతారు. అయితే సరస్సులోని చేపగుడ్లు మళ్లీ ఫలదీకరణం చెందడంతో మళ్లీ విష్ణు నామాలున్న చేపలు భారీ సంఖ్యలో జన్మించాయని స్థానికులు వెల్లడించారు. మండు వేసవి కాలంలో కూడా ఈ సరస్సులో నీళ్లు నిండుగా ఉంటాయన్నారు. ఈ సరస్సులో చేపల్ని పట్టడానికి ఎవర్ని అనుమతించారు, ఎందుకంటే .. గతంలో ఈ సరస్సులో చేపలు పట్టిన స్థానికుడు రక్తం కక్కుకుని మరణించాడని అక్కడి వాళ్లు చెబుతారు. ఆ ప్రాంతపు చుట్టు పక్కల వారు రెగ్యులర్ గా ఆలయాన్ని సందర్శించుకోవడంతోపాటు.. చేపలకు బిస్కెట్ ప్రసాదాన్ని సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement