దళిత సంఘాల నేతలతో కలిసి మాట్లాడుతున్న ఎల్లవ్వ
సిద్దిపేటరూరల్: ఎస్సీ అయిన తనపై ఇతర కులానికి చెందిన కొందరు వివక్ష చూపుతున్నారని లక్ష్మిదేవిపల్లి సర్పంచ్ పెద్ది ఎల్లవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ..రెండేళ్లుగా గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలను చేయడం ప్రారంభించామన్నారు. నాటి నుంచి ఏటా ఉత్సవాలకు రూ. 10 వేల చొప్పున అందించినా, ఉపసర్పంచ్ ఆంజనేయులు ఇంటి నుంచే శ్రీరామ కల్యాణానికి కావాల్సిన పుస్తెమట్టెలను డప్పుచప్పుల్లతో ఆలయానికి తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆలయం వద్దకు వెళ్లినా ప్రసాదం సైతం పెట్టేవారు కాదన్నారు. ఈ సంవత్సరం గ్రామంలో నిర్మించిన భక్తాంజనేయ ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. కానీ ఓ వ్యక్తి సహాకారంతో గ్రామ పెద్దలు తనకు సమాచారం ఇవ్వకుండానే వేడుకలను జరిపించారని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment