శాససభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు.
పరకాల(వరంగల్ జిల్లా): శాససభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని అతిథిగృహంలో ఉన్న స్పీకర్ సోమవారం కరీంనగర్ జిల్లా కాటారంలో జరిగిన ఓ విందుకు హాజరయ్యూరు. తిరిగి భూపాలపల్లి మీదుగా హైదరాబాద్‌కు వెళ్తుండగా.. పరకాలకు రాగానే అస్వస్థతకు గురయ్యూరు. వెంటనే పరకాలలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తరలించారు. అక్కడ డాక్టర్లు బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలను చేసి సెలైన్ ఎక్కించారు.
కాగా, స్పీకర్ అస్వస్థతకు గురైనట్లు తెలుసుకున్న టీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. తనకు ఏమీ కాలేదని, తరుచూ బీపీ, షుగర్ పరీక్షలు చేసుకుంటానని, ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్పీకర్ పార్టీ నాయకులకు చెప్పారు. అరుుతే, మీడియూను మాత్రం ఆస్పత్రిలోకి అనుమతించలేదు. అయితే, స్పీకర్ మాత్రం సోమవారం రాత్రి వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు.