జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి
మహబూబ్‌నగర్ టౌన్ : వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని డ్వామా కార్యాలయంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆధ్వర్యంలో స్టేట్ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడిం దని, అయితే ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అనేక అవకాశాలున్నాయన్నారు. ఇందుకుగాను వ్యవసాయం, ఉద్యానవన శాఖ, పశుసంవర ్ధక, పట్టు పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, డెయిరీ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ రంగాలకు చెందిన మౌలిక వసతులతోపా టు, వాటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.
వీటిని పూర్తిగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో వేరుశనగ విస్తీర్ణం అధికంగా ఉందని దీనికి కావాల్సిన విత్తనోత్పత్తి కేంద్రాలను బలోపేతం చేయాలన్నారు. ఇక తాండూర్ కందిపప్పులాగా జిల్లా పప్పును విస్తృతంగా ప్రచారం చేసి అత్యధికంగా మార్కెటింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కొల్లాపూర్ మామిడి ప్రత్యేకత కాపాడుదాం
కొల్లాపూర్ మామిడికి పేరు ప్రఖ్యాతులున్నాయని, వాటిని కలకాలం కాపాడేం దుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో మామిడి రైతులకు కావాల్సిన అవగాహనలతోపాటు, ఇతరత్రా అన్ని విధాలుగా అండగా నిలిచి వాటిని ఇంకా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు.
కొల్లాపూర్ మామిడికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, దీని ఆధారంగా ఇంకా మార్కెటింగ్‌ను పెంపొదించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ ఉష, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీడీ విద్యాశంకర్‌తోపాటు ప్రతినిధులు రుష్కంగ్, శ్రీవల్లి పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధ్దికి ప్రతిపాదనలు సమర్పించాలి
Published Thu, May 14 2015 3:08 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement