Rashtriya Krishi Vikas Yojana
-
జిల్లా అభివృద్ధ్దికి ప్రతిపాదనలు సమర్పించాలి
జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి మహబూబ్‌నగర్ టౌన్ : వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని డ్వామా కార్యాలయంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆధ్వర్యంలో స్టేట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడిం దని, అయితే ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అనేక అవకాశాలున్నాయన్నారు. ఇందుకుగాను వ్యవసాయం, ఉద్యానవన శాఖ, పశుసంవర ్ధక, పట్టు పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, డెయిరీ డెవలప్మెంట్, మార్కెటింగ్ రంగాలకు చెందిన మౌలిక వసతులతోపా టు, వాటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. వీటిని పూర్తిగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో వేరుశనగ విస్తీర్ణం అధికంగా ఉందని దీనికి కావాల్సిన విత్తనోత్పత్తి కేంద్రాలను బలోపేతం చేయాలన్నారు. ఇక తాండూర్ కందిపప్పులాగా జిల్లా పప్పును విస్తృతంగా ప్రచారం చేసి అత్యధికంగా మార్కెటింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ మామిడి ప్రత్యేకత కాపాడుదాం కొల్లాపూర్ మామిడికి పేరు ప్రఖ్యాతులున్నాయని, వాటిని కలకాలం కాపాడేం దుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో మామిడి రైతులకు కావాల్సిన అవగాహనలతోపాటు, ఇతరత్రా అన్ని విధాలుగా అండగా నిలిచి వాటిని ఇంకా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు. కొల్లాపూర్ మామిడికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, దీని ఆధారంగా ఇంకా మార్కెటింగ్‌ను పెంపొదించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ ఉష, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీడీ విద్యాశంకర్తోపాటు ప్రతినిధులు రుష్కంగ్, శ్రీవల్లి పాల్గొన్నారు. -
ఆధునిక సేద్యమే శరణ్యం
అమలాపురం : ‘సాగు లాభసాటి కావాలంటే రైతులు ఆధునిక పద్ధతిలో సాగు చేయాల్సిందే. తూర్పుగోదావరిలో పంట పెట్టుబడిలో సగం కూలీలకే వ్యయమవుతోంది. వ్యవసాయంలో పూర్తిస్థాయి యాంత్రీకరణ వస్తేపెట్టుబడి తగ్గి రైతులు సంక్షోభం నుంచి గట్టెక్కుతారు. యాంత్రీకరణను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు కల్పించాలి.’ సాగు సమ్మెపై ప్రభుత్వం నియమించిన మోహన్‌కందా కమిటీ ప్రభుత్వానికి చేసిన సిఫారసు ఇది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణకు ఏటా రూ.కోట్లను ప్రభుత్వం కేటాయిస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర్ర పభుత్వం జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణకు రాయితీలు కల్పించడం కోసం రూ.5.15 కోట్లు కేటాయించింది. కేంద్రప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద రూ.2.88 కోట్లు, సబ్మిషన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం)కింద రూ.1.30 కోట్లు కేటాయించగా మొత్తం రూ.9.33 కోట్లు వచ్చాయి. రాయితీ కేటాయింపు ఇలా... ఎస్సీ, ఎస్టీ, మహిళ, చిన్న, సన్నకారు రైతులు కొనుగోలు చేసే చిన్నచిన్న యంత్రాలకు 40 నుంచి 50 శాతం వరకు రాయితీకి అవకాశం ఉంది. పెద్ద రైతులు అంటే మెట్టలో ఐదు ఎకరాలు, మాగాణిలో రెండున్నర ఎకరాలు దాటి భూములున్న రైతులకు 30 నుంచి 40 శాతం వరకు యంత్రాల కొనుగోలుపై రాయితీ లభిస్తోంది. నాట్లు వేసే యంత్రం, సీడ్ట్రేలు, లేజర్ గెడైడ్ ల్యాండ్ లెవెలర్ వంటి యంత్రాలు, చిన్న ట్రాక్టర్ల కొనుగోలుపై 50 శాతం వరకు రాయితీకి అవకాశముంది. అదే నాట్లు వేసే యంత్రాలతోపాటు పెద్ద ట్రాక్టరు కొనుగోలు చేస్తే 40 శాతం వరకు రాయితీ పొందవచ్చు. అంటే రూ.28 లక్షల ఖరీదైన ఈ యంత్రాలకు రూ.12 లక్షల వరకు రాయితీ వస్తుందన్నమాట. అలాగే రూ.23.60 లక్షల ఖరీదు చేసే కంబైండ్ హార్వెస్టర్‌కు అయితే రూ.ఐదు లక్షల రాయితీ వస్తోంది. అయితే పెద్ద యంత్రాలపై రాయితీ పొందాలంటే కనీసం ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది. అంతా ఆన్లైన్లోనే... : యాంత్రీకరణ రాయితీలు అందజేసే ప్రక్రియను ప్రభుత్వం ఆన్లైన్ చేసింది. రైతులు దరఖాస్తు చేయడం మొదలు వ్యవసాయ శాఖ అనుమతి, యంత్రాల కొనుగోలు, రాయితీల చెల్లింపు వంటి అన్ని దశలూ ఆన్లైన్లోనే జరిగిపోతాయి. తొలుత రైతులు మీసేవ కేంద్రాలకు వెళ్లి రూ.20 చెల్లించి రాయితీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. తదుపరి రూ.500 నుంచి రూ.2 వేల వరకు డిపాజిట్ చేయాలి. రైతుల దరఖాస్తులు సంబంధిత ఏఓ కు అక్కడినుంచి జేడీకి, ఆపైన యంత్రాలు సరఫరా చేసే కంపెనీకి వెళతాయి. రైతులు పదేపదే వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఈ విధానంలో ఎంతమాత్రం ఉండదు. తగ్గనున్న పెట్టుబడులు వరిసాగు అనే కాదు, అన్నిరకాల పంటల సాగులో యాంత్రీకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నారుమడులు వేయడానికి ఎకరాకు రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు ఖర్చవుతుంది. అదే యంత్రాల ద్వారా నాట్లు వేస్తే రైతుకు అయ్యేది రూ.మూడు వేలే. ఇక డ్రమ్‌సీడర్ పద్ధతిలో అయితే మరో రూ.500 తగ్గుతుంది. వరి, ఇతర పంటల్లో కలుపు నివారణ పనులు కూలీలతో చేయిస్తే రూ.మూడు వేల వరకూ ఖర్చవుతోంది. ఇదే కోనో వీడర్‌తో ఆ పని చేస్తే ఒక మనిషికి కూలి ఖర్చు (రూ.300) మాత్రమే అవుతుంది. వరిలో కోతలు, నూర్పిళ్లకు సంప్రదాయ విధానంలో ఎకరాకు రూ.ఏడు వేల వరకు ఖర్చవుతోంది. అదే కంబైన్డ్ హార్వస్టర్ను అద్దెకు తెచ్చుకుంటే రూ.రెండువేల ఖర్చుతోనే ధాన్యం బస్తాల్లోకి చేరుతోంది. ఈ యంత్రాల వినియోగం వల్ల రైతులకు పంట పెట్టుబడులు గణనీయంగా తగ్గి ఎకరా వరి సాగుకు రూ.18 వేల కంటే తక్కువే వ్యయమవుతుంది. తద్వారా రైతులు గిట్టుబాటు ధర కోసం ఎదురుతెన్నులు చూడాల్సిన అవసరం ఉండదు. పెట్టుబడి తగ్గితే రైతులు లాభాలు పొందే అవకాశముంది. నిబంధనలు మారిస్తే మరింత మేలు యాంత్రీకరణ రాయితీకి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం మారిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా పరిగణించి రాయితీ ఇచ్చేకంటే, జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఆయా ప్రాంతాల్లో భూమి స్థితిగతులను బట్టి యంత్రాలకు రాయితీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పెద్ద యంత్రాలను రైతు గ్రూపులకే కాకుండా కొనుగోలు శక్తి ఉన్న భూస్వామి రైతులకు కూడా ఇస్తే స్థానిక అవసరాలకు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. కోతల సమయంలో స్థానికంగా ఈ యంత్రాలు లేక కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి తెప్పించాల్సి వస్తోందని, దీంతో రవాణాభారం పడుతోందని రైతులు చెబుతున్నారు. రైతు సంఘాలకే కాకుండా ప్రభుత్వ సహకార సంఘాలకు ఈ యంత్రాలను రాయితీలపై ఇస్తే తాము తక్కువ అద్దెకు వీటిని వినియోగించుకునే సౌలభ్యం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు
ఒంగోలు టౌన్ : జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వ్యవసాయ శాఖ, ఇతర అనుబంధ శాఖల 100 రోజుల ప్రణాళికను విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జన్యుపరంగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు గ్రామ విత్తన పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద 50 శాతం సబ్సిడీపై రైతులకు నెలాఖరులోగా విత్తనాలు అందించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద పప్పుదినుసుల పంటల్లో దిగుబడులు పెంచేందుకు 250ఎకరాల విస్తీర్ణంలో సమూహ ప్రదర్శనా క్షేత్రాలు వేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కలుపు మందు, జీవ సంబంధ ఎరువులను 50శాతం సబ్సిడీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 16మండలాల్లో 1815 హెక్టార్లలో కంది నమూనా ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం నియంత్రించి నాణ్యమైన పంట ఉత్పత్తులు పెంచేందుకు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ పథకం కింద వానపాముల పెంపకానికి 50శాతం సబ్సిడీపై 500 పోర్టబుల్ బెడ్స్ సరఫరా చేసేందుకు జిల్లాకు 25 లక్షల రూపాయలు కేటాయించారన్నారు. అదేవిధంగా లక్ష రూపాయల సబ్సిడీతో 5వర్మీ హేచరీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆర్కేవీవై కింద రూ 35.96 లక్షలతో పథకాల అమలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకం కింద ఉద్యానశాఖ ద్వారా రూ.35.96లక్షలతో వివిధ రకాల పథకాలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. 50శాతం సబ్సిడీతో హైబ్రీడ్ కూరగాయ విత్తనాలు 420 హెక్టార్లలో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 50శాతం సబ్సిడీపై తీగ జాతి కూరగాయల పెంపకం కోసం 8హెక్టార్లలో రూ.20లక్షలతో పర్మినెంట్ పందిర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ కింద రూ.1250.13లక్షలతో వివిధ రకాల పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రొయ్యల చెరువులను క్రమబద్ధీకరించుకోవాలి ఉప్పునీటి కయ్యల్లోని రొయ్యల చెరువులను సంబంధిత రైతులు విధిగా క్రమబద్ధీకరించుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని 40మండలాల్లో 1600 ఎకరాల్లో మల్బరీ తోటలు సాగవుతున్నట్లు తెలిపారు. పశుసంవర్ధకశాఖ ద్వారా జూలై 15 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని 4లక్షల 53వేల గొర్రెలు, మేకలకు పీపీఆర్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మోహన్, వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ మురళీకృష్ణ, పశుసంవర్ధకశాఖ జాయింట్ డెరైక్టర్ ఎన్ రజనీకుమారి పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)లకు ప్రభుత్వం వందశాతం రాయితీ కింద ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అందజేయాలని భావించింది. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద పప్పు దినుసుల సాగు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం 2010-11, 2011-12లలో జిల్లాలోని 32 మండలాల్లో రాష్ట్రీయ కృషివికాస్ యోజన(ఆర్కేవీవై) కింద రూ.3.80 కోట్లతో 63 ట్రాక్టర్లు, గొర్రు, విత్తనాలు వేసే యంత్రాలు మంజూరు చేసింది. ఒక్కో యూనిట్ విలువ రూ.5 లక్షలు పూర్తి రాయితీ. కొన్నిచోట్ల సహకార, రైతుమిత్ర, వాటర్‌షెడ్ కమిటీలకు అప్పగించారు. ట్రాక్టర్లపై ఈ సంఘాలకు ‘ఆగ్రోస్’ సంస్థ పూర్తిగా సబ్సిడీ అందించింది. ఒక్కో సహకార, రైతుమిత్ర సంఘాల కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో పప్పుదినుసుల సాగు చేయాలని సూచించారు. పీఏసీఎస్‌ల్లో ఉండాల్సిన ట్రాక్టర్లు.. చైర్మన్ల ఇంట్లో.. జిల్లాలో ఆర్‌కెవీవై పథకం సద్వినియోగం కావడం లేదు. అప్పటి సహకార సంఘాల అధ్యక్షులు ట్రాక్టర్లను తమ ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు మంజూరై మూడేళ్లు గడిచినా జిల్లాలో ఒక్క ఎకరం కూడా సాగుచేసిన దాఖలాలు లేవు. అద్దెకు ఇచ్చినా దాఖలాలు లేవు. కాగా పంపిణీ చేసిన ట్రాక్టర్లు, పరికరాలు అధికారులకు ఎక్కడున్నాయో తెలియదు. ముథోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండల కేంద్రంలోని సహకార సంఘానికి మంజూరైన ట్రాక్టర్‌ను నర్సారెడ్డి లక్ష్మణచాంద మండలం బొప్పారంలో అద్దెకు నడుపుతున్నట్లు సమాచారం. అలాగే సిర్పూరు నియోజకవర్గానికి ఏడు మంజూరు కాగా, బెజ్జూర్ మండలానికి మంజూరైన రెండింటికి కనీసం రిజిస్ట్రేషన్ చేయించక పోగా అందులో ఒకటి అమ్ముకున్నారన్న ప్రచారం ఉంది. మరో ట్రాక్టర్‌ను అనధికారికంగా అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇలా జిల్లాలో కేటాయించిన 63 ట్రాక్టర్లలో సగం ఆచూకీ లేవు. ఉన్న ట్రాక్టర్లు చైర్మన్ల కనుసన్నల్లో అద్దెకు నడుస్తుండటం వివాదాస్పదం అవుతోంది. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పునాదుల్లోనే అవినీతి పురుగు
కాట్రేనికోన, న్యూస్‌లైన్ : కాట్రేనికోన వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధులతో, యార్డు నిధులతో చేపట్టిన గోడౌన్లు, ఇతర కట్టడాల నిర్మాణ ంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. కృషి వికాస్ యోజన నిధులు రూ.3.2 కోట్లతో రెండు గోడౌన్లను, రూ.కోటి 30 లక్షలతో గోడౌన్ పర్యవేక్షణ కార్యాలయం, రోడ్లు, ప్రహరీ గోడ తదితర నిర్మాణ పనులు చేపట్టారు. రూ.కోటికి పైగా యార్డు నిధులతో మరో గోడౌన్ నిర్మిస్తున్నారు. నిజానికి యార్డులో ఇప్పటికే ఉన్న గోడౌన్‌నే పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. అలాంటప్పుడు కొత్తగా గోడౌన్ల నిర్మాణమే అవసరం లేదనుకుంటే.. దానికి తోడు నిర్మాణంలో మట్టితో కలిసిన నాసిరకం కంకర, ఇసుక, ఇనుము వాడటంతో పాటు సిమెంట్‌ను తగిన మోతాదులో వినియోగించడం లేదు. నాణ్యత లేని సామగ్రితోనే గోడౌన్ల బీములు, పిల్లర్లు నిర్మిస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలోనే బీమ్‌లు బీటలు వారి పోతున్నాయి. యార్డు కార్యక్రమాల నిర్వహణకు నిర్మిస్తున్న భవనం పనుల్లో నాణ్యత లేని నాసిరకం సిమెంట్ ఇటుకలను వాడుతున్నారు. ఉప్పునీటితో కట్టడానికే ముప్పు ఇక బేస్మెంట్ నిర్మాణానికి ఇటుకలకు బదులు నాసిరకం పెద్దరాళ్ళను వాడడమే కాక తగిన మోతాదులో సిమెంట్‌ను వాడడం లేదు. బేస్ మెంట్లో నాణ్యమైన ఇసుక వేయాలనే నిబంధనను గాలికి వ దిలేశారు. అధికారుల సమక్షంలోనే కాంట్రాక్టరు బేస్మెంట్లో సముద్రపు పాయల నుంచి తెచ్చిన ఉప్పు నీటి ఇసుకను వేసినా చూస్తూ ఊరుకుంటున్నారు. ఉప్పు నీటితో సిమెంటు పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంజనీర్ల నుంచి సామాన్యుల వరకు స్వచ్ఛమైన ఇసుకనే వినియోగిస్తారు. బేస్మెంట్ను తడిపేందుకు సైతం మంచి నీటిని వినియోగిస్తారు. బేస్మెంట్లో వేసిన ఉప్పు నీటి ఇసుక బిగుసుకునేందుకు నీరు పెట్టినపుడు దానిలోని ఉప్పు శాతం నీటితో కలసి గోడౌన్ గోడలకు చేరే ప్రమాదం ఉంది. ఉప్పు నీటికి ఇసుముకు తుప్పు పట్టించి నాశనం చేసే గుణం ఉంది. అందుకే నిర్మాణ పనులలో ఉప్పు నీరు తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదేమీ బ్రహ్మరహస్యం కాదు. అలాంటిది కాంట్రాక్టర్ యథేచ్ఛగా ఉప్పునీటి ఇసుక వాడుతున్నా, మిగతా నిర్మాణ సామగ్రినీ నాసిరకందే వినియోగిస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మిన్నకుండడం వెనుక వారికి ముట్టాల్సిన ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు తమకు అవసరం లేకున్నా వారి కమీషన్ల కోసమే ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తుతున్నారు. కాగా గోడౌన్ పనుల్లో నాణ్యత లోపిస్తోందని స్థానికులు ఇటీవల కాట్రేనికోనలో జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. అయినా పనులు నాసిరకంగా మెటీరియల్‌తోనే జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బేస్మెంట్లో వేసిన ఉప్పు నీటి ఇసుకను తొలగించి నాణ్యమైన ఇసుకను వేయించాలని, ప్రతి పనీ నాణ్యమైన మెటీరియల్‌తోనే జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.