నల్లగొండ/ దామరచర్ల : రాష్ట్రాన్ని గడగడలాసిస్తున్న స్వైన్‌ఫ్లూ జిల్లాను తాకింది. రెండు రోజులుగా స్వైన్‌ఫ్లూ పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే జిల్లాకు సంబంధించిన స్వైన్‌ఫ్లూ బాధితులు ఎవరైనా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లయితే వారి వివరాలు సేకరించాల్సిందిగా కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో శనివారం జిల్లా నుంచి ఇద్దరు హెల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను హైదరాబాద్‌కు పంపారు. జిల్లాకు చెందిన ఐదుగురు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులుగా గాంధీ ఆసుపత్రిలో నమోదైనట్లు వివరాలు సేకరిం చారు. దీంట్లో ఇద్దరు డిసెంబర్ 23 తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగిలిన ఇద్దరిలో బీబీనగర్‌కు చెందిన ప్రసాద్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నాడు.
దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడానికి చెందిన మూడేళ్ల చిన్నారి అక్షిత. మోతె మండలం విభళాపురానికి చెందిన శ్రీనివాస్ మృతిచెందారు. ఇదిలా ఉండగా అక్షితను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి ఐదు రోజుల క్రితం తీసుకెళ్లారు. అయితే అక్షిత పుట్టకతోనే గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతోంది. దీంతో అక్కడి వై ద్యులు పూర్తిస్థాయి పరీక్షలు చేయించాలని అక్షిత తల్లిదండ్రులకు చెప్పడంతో వారు భయప డి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ వెళ్లిన బృం దానికి గాంధీ ఆసుపత్రి అధికారులు ఇదే విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న కలెక్టర్ తక్షణమే అక్షిత వివరాలు సేకరించి జిల్లా కేం ద్ర ఆసుపత్రికి తీసుకురావాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు.
దీంతో తాళ్లవీరప్పగూడానికి హుటాహు టిన బయల్దేరి వెళ్లిన వైద్యులు శనివారం మధ్యాహ్నం అక్షితను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీ సుకొచ్చారు. ప్రస్తుతం అక్షిత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే నల్లగొండ ఎస్‌ఎల్‌బీసీలో ఉన్న ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థికి జ్వరం, తలనొప్పిగా ఉందని చెప్పడంతో శనివారం రాత్రి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉంచారు. స్వైన్‌ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ నిర్ధార ణకు వచ్చిన కేసులు జిల్లాలో నమోదు కాలేదని కలెక్టర్ తెలిపారు.
విభళాపురంవాసి మృతి
విభళాపురం(మోతె): స్వైన్‌ప్లూతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో చోటు చేసుకొంది. బంధువులు తెలిసిన వివరాల ప్రకారం.. మోతె మండలం విభళాపురం గ్రామానికి చెందిన మొక్క శ్రీనివాస్(40) కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో నివాసంఉంటున్నాడు. భార్య విజయ బోడుప్పలో ఏఎన్‌ఎంగా పనిచేస్తుండగా, శ్రీనివాస్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. రెండు,మూడు రోజుల నుంచి శ్రీనివాస్ జలుబు, ఒళ్లునొప్పులతో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
జిల్లాను తాకిన స్వైన్‌ఫ్లూ
Published Sun, Jan 25 2015 3:44 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement