ఐసెట్‌లో జిల్లా వాసికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ | District Vasiki State First Rank | Sakshi
Sakshi News home page

ఐసెట్‌లో జిల్లా వాసికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

Published Thu, Jun 1 2017 3:11 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

District Vasiki State First Rank

తిరుమలగిరి (తుంగతుర్తి)  : ఐసెట్‌ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా మాలిపురం గ్రామానికి చెందిన ఇరుకుల సోమశేఖర్‌ రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించాడు. బుధవారం ప్రకటించిన ఐసెట్‌ ఫలితాల్లో 200 మార్కులకు గాను 166 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. సోమశేఖర్‌ ప్రస్తుతం సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా నిజామబాద్‌ జిల్లాలో పనిచేస్తున్నాడు.

చదువులో ముందంజ..
తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన ఇరుకుల  భిక్షపతి, సోమలక్ష్మిల పుత్రుడు సోమశేఖర్‌ చిన్నతనం నుంచే చదువులో ముందంజలో ఉన్నాడు. 9వ తరగతి వరకు తిరుమలగిరిలోని వివేకానంద విద్యామందిర్, 10వ తరగతి శ్రీవాణి పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ ఖమ్మంలో చదివాడు. 2014లో  సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబీఏ చేయడానికి ఐసెట్‌ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement