
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని ప్రదర్శిస్తోందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.భుజంగరావు, జి.సదానంద్‌గౌడ్ పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావా లని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ శనివారం ఇందిరాపార్కు వద్ద ఎస్టీయూ మహాధర్నా నిర్వహించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సమస్యలు లేనప్పుడే ప్రశాంతంగా పనిచేస్తారన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. ఉద్యోగుల పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, మధ్యంతర భృతి ఇచ్చి పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు బ్రహ్మచారి, బాలకృష్ణయ్య, ఎ.లక్ష్మణ్,33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment