ఖమ్మం (మామిళ్లగూడెం) : తెలంగాణ ఉద్యమంలో, సకలజనుల సమ్మెలో 42రోజులు కీలకంగా పనిచేసిన మున్నూరు కాపులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మున్నూరుకాపు ఖమ్మం అధ్యక్షుడు మేకల సంగయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు . జిల్లా వ్యాప్తంగా దాదాపు 3లక్షల మంది తమ వర్గం వారున్నారని పేర్కొన్నారు .కానీ, తమ పిల్లలకు కుల సర్టిఫికెట్ ఇవ్వటానికి అధికారులు నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం తమ వర్గం తక్కువగా ఉందని చూపే ప్రయత్నమేనని అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత తమ వర్గస్తులకు ఇబ్బందులు కలుగటం బాధాకరమన్నారు. ప్రభుత్వ గెజిట్ 20లో మున్నూరుకాపు బిసి-డి గా ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈనెల 19న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. తమ పిల్లలకు సిర్టిఫికెట్ల విషయంలో ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం సలహదారులు మేకల బిక్షమయ్య, కొత్త సీతారాములు, కోశాధికారి పొన్నం వెంకటేశ్వర్లు, గోలి వెంకటేశ్వర్లు, శ్రీహరి, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
'మున్నూరు కాపులపై చిన్నచూపు తగదు'
Published Wed, Apr 8 2015 6:46 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement