munnuru kapu
-
తెలంగాణ బీసీల్లో ముదిరాజ్‌లే టాప్.. తర్వాత ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బలహీనవర్గాల జాబితాలో మొదటి నుంచి అంచనా వేస్తున్న విధంగానే ముదిరాజ్లదే అగ్రస్థానమని వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల మందికి పైగా ముదిరాజ్ (Mudiraj) కులస్తులు ఉన్నారని కులగణన సర్వేలో స్పష్టమైంది. ఆ తర్వాతి స్థానంలో యాదవులున్నారని, వీరి జనాభా 20 లక్షల కంటే ఎక్కువ ఉందని తేలినట్టు సమాచారం. అలాగే తెలంగాణలో గౌడ కులస్తుల జనాభా కూడా గణనీయంగా ఉందని, వారు 16 లక్షలకు పైగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత నాలుగో స్థానంలో మున్నూరుకాపులు (Munnuru Kapu) ఉండగా, వారి జనాభా 13.70 లక్షలకు పైగా ఉన్నట్టు తేలింది. 5వ స్థానంలో 12 లక్షలకు పైగా జనాభాతో పద్మశాలీలున్నారని తాజా సర్వేలో వెల్లడైనట్టు తెలిసింది.తెలంగాణలో మొత్తం 1.60 కోట్ల మంది బీసీలున్నారని తాజా సర్వేలో తేలగా, ఈ ఐదు కులాలు కలిపి మొత్తం బీసీ జనాభాలో (BC Population) సగం మంది కంటే ఎక్కువ ఉ న్నారని సర్వే వెల్లడించింది. ఇక అగ్రవర్ణాల విషయానికి వస్తే రెడ్ల జనాభా 17 లక్షల కంటే ఎక్కువే ఉందని సర్వేలో తేలినట్టు సమాచారం. అయితే, ఈ లెక్కలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.దేశవ్యాప్తంగా కుల సర్వే చేపట్టండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం వివిధ కులాల జనాభా స్థితిగతులను అర్థం చేసుకునేందుకు తెలంగాణలో నిర్వహించిన మాదిరిగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య రాజకీయ, కుల సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసససభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మంగళవారం రాత్రి అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు.‘తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుల సర్వేలో భాగంగా రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు (బీసీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర బలహీన వర్గాల అభివృద్ధి కి కట్టుబడి ఉంది. వివిధ కులాల మధ్య నెలకొన్న అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు, అఫర్మెటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది’అని తీర్మానంలో పేర్కొన్నారు. సర్వే సరే.. ఇప్పుడేం చేస్తారు?: కూనంనేని సమగ్ర కులగణన సర్వే చేపట్టడం హర్షణీయమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అయితే ఈ నివేదిక తర్వాత బీసీలకు జరిగే ప్రయోజనం ఏమిటో చెప్పాలని కోరారు. దీనివల్ల పెద్దగా ఉపాధి అవకాశాలు ఉంటాయని తాను భావించడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే లేవని, ఉన్నవి కూడా కాంట్రాక్టు ఉద్యోగాలని, ఇందులో రిజ్వేషన్లు పాటించేందుకు అవకాశమే లేదని చెప్పారు. గతంలో నిర్వహించిన సమగ్ర సర్వేపై శాస్త్రీయత సందేహాలకు తావిస్తోందన్నారు. ప్రస్తుత సర్వేపై అనుమానాలుంటే, గ్రామసభల్లో పెట్టి, ఇంకెవరినైనా చేర్చాల్సి ఉంటే చేర్చమని సూచించారు. నివేదిక ద్వారా బీసీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మార్చబోతున్నారో, ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారో చెప్పాలని కోరారు. సర్వే వివరాలు బయటపెట్టకుండా చర్చ ఏంటి? సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలు సభ్యులకు ఇవ్వకుండా సభలో చర్చఎలా నిర్వహిస్తారని మండలిలో ప్రతిపక్ష నేత మధసూదనాచారి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని అన్నారు. ప్రకటనలు ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ వేదిక కాదని, కనీసం లోతైన చర్చ కూడా జరపకపోవడం దారుణమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేలో అన్ని వర్గాల జనాభా తగ్గిందని, ఓసీల జనాభాను మాత్రం భారీగా పెంచి చూపించారని ఆరోపించారు. చదవండి: 59 కులాలు, 3 గ్రూపులుబీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వండి: బండ ప్రకాశ్ గత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే వివరాలు ఎంసీఆర్హెచ్ఆర్డీ వైబ్సైట్లో ఉన్నాయని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. అందుకు సభ్యులు కూడా మద్దతుగా నిలుస్తారని తెలిపారు. సర్వే విషయంలో ప్రభుత్వం నుంచి సమాచారం అందకపోవడం, స్పష్టత లేకుండా సభ నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ చర్చలో పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. -
సీఎం జగన్ కలిసిన మున్నూరు కాపు సంఘం నేతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విలీన మండలాల మున్నూరు కాపు సంఘం నేతలు సోమవారం కలిశారు. తమకు బీసీ-డీ సర్టిఫికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ఆధ్వర్యంలో సీఎం జగన్‌ను నేతలు కలిశారు. చదవండి: మా ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలా? చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైర్ అనంతరం.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మీడియాతో మాట్లాడుతూ, విలీనం తర్వాత ఎన్ని సార్లు చంద్రబాబుకి చెప్పుకున్నా ఫలితం లేదన్నారు. వరద పర్యటన సమయంలో సీఎం జగన్‌ను కలిసిన మున్నూరు కాపులు.. బీసీ-డీ కింద చేర్చాలని, తెలంగాణలో ఉన్న పరిస్థితిని విన్నవించారన్నారు. విలీన మండలాల్లో ఉన్న మున్నూరు కాపులను బీసీ-డీ కిందకు తీసుకురావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. కాపు నేస్తం రూపకర్త సీఎం వైఎస్ జగన్.. ఆర్థికంగా వారిని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం ఇలా అన్ని సమస్యలు తీరుస్తుంటే ప్రతిపక్షాలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయన్నారు. జనసేన పార్టీ నాయకుడు ఎక్కడా కాపుల కోసం పోరాడింది లేదని.. చంద్రబాబు కాపుల ఆత్మగౌరవాన్ని రోడ్డుకు ఈడ్చాడని ఆయన దుయ్యబట్టారు. బతికున్నంత వరకూ సీఎం జగన్ వెంటే.. మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఉమాశంకర్ మాట్లాడుతూ, బతికున్నంత వరకూ సీఎం జగన్ వెంటే నడుస్తామన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆశలు చిగురించాయి.. మున్నూరు కాపు నాయకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. మాలో ఆశలు చిగురించాయన్నారు. తమకు మున్నూరు కాపు సర్టిఫికేట్ బీసీ-డీ కింద వచ్చిందన్నారు. -
ప్రభుత్వ నిర్ణయంపై మున్నూరు కాపుల హర్షం
ఎటపాక(అల్లూరి సీతారామరాజు జిల్లా): మున్నూరు కాపు కులస్తులకు బీసీ–డీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎటపాక మండలం తోటపల్లిలో మున్నూరు కాపులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కాపు సంఘం అధ్యక్షుడు ఆకిశెట్టి ఉమాశంకర్‌నాయుడు, గంజి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ సీఎం జగన్ పేదల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మున్నూరు కాపులు బీసీ–డీ లుగా ఉన్నారని, అయితే రాష్ట్ర విభజన తర్వాత విలీన మండలాల ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం కులధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేసి ఇబ్బందిపెట్టిందని గుర్తుచేసుకున్నారు. దీంతో మున్నూరు కాపులు విద్య, ఉపాధి రంగాలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమగోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కృషితో సీఎం స్పందించి జీవో ఇవ్వడం హర్షణీయమన్నారు. ఏడు విలీన మండలాల్లోని మున్నూరు కాపులంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని చెప్పారు కార్యక్రమంలో సంఘం నేతలు మారాసు గంగాధర్, ఆకుల వెంకటరామారావు, మారాసు సత్యనారాయణ, రంభాల నాగేశ్వరరావు, గంజి సత్యానందం, అనసూరి శ్రీనివాస్, ములిశెట్టి రమేష్, బండారు శివాజీ తదితరులున్నారు. -
బీసీ-డీగా మున్నూరు కాపులు.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: మున్నూరు కాపు కులస్తులకు బీసీ-డీ కింద ఏపీ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు బీసీ-డీ కింద కుల ధ్రువీకరణ పత్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మున్నూరు కాపులు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. బీసీ-డీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీకి ఆదేశాలు ఇచ్చారు. చదవండి: (మంత్రి ఆర్కే రోజాని మర్యాదపూర్వకంగా కలిసిన పీవీ సింధు) -
ఒకే కులం–ఒకే సంఘం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన సామాజిక వర్గాల్లో ఒకటైన మున్నూరు కాపు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పటివరకు విడివిడిగా కార్యకలాపాలు నిర్వహించిన పలు సంఘాలు హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని బలిజ, కాపు, మున్నూరు కాపు సంఘ కార్యాలయం వేదికగా ఏకమ య్యాయి. ఒకే కులం–ఒకే సంఘం.. నినాదం తో ఆదివారం నిర్వహించిన ఈ రాష్ట్ర సదస్సుకు మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుతో పాటు పలువురు ముఖ్యులు హాజరయ్యారు. సదస్సు ప్రారంభంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్నూరు కాపు కులస్తులు ఇప్పటివరకు వివిధ సంఘాలుగా విడిపోయి ఉండ టం వల్లనే సామాజికవర్గం అభివృద్ధి వేగంగా జరగలేదని, ఇప్పు డు ఒకే సంఘంగా సమష్టిగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ని అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయని, రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే బీసీ కులాలకు 5 ఎకరాల స్థలం, రూ.5 కోట్ల నిధులు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేశారని చెప్పారు. మున్నూరు కాపుల అభివృద్ధి కోసం సీఎంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్రి సభ్య కమిటీ ఏర్పాటు సదస్సులో భాగంగా మున్నూరు కాపు నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని కాపు సంఘాలను రద్దు చేసి వాటి స్థానంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా మూడు నెలల్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను నియమించి, రాష్ట్ర కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర కన్వీనర్‌గా పుటం పురుషోత్తం వ్యవహరిస్తారు. ఎన్నికల అధికారిగా జె.డి.లక్ష్మీనారాయణను నియమించగా, సంఘం బైలాస్‌ను టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సి.విఠల్ వివరించారు. రిటైర్డ్ ఐజీ సుంకరి బాలకిషన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయ ర్ బొంతు రామ్మోహన్, నేతలు వద్దిరాజు రవిచం ద్ర, వి.ప్రకాశ్, డాక్టర్. కొండా దేవయ్య, మీసాల చంద్రయ్య, దేవన్న, గాలి అనిల్‌కుమార్, కొత్త లక్ష్మ ణ్, జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: (ఐటీ ఉద్యోగులు స్కై వాక్ చేస్తూ ఆఫీస్‌లకు..) సావిత్రిబాయి స్ఫూర్తితోనే గురుకులాలు: గంగుల సాక్షి, హైదరాబాద్: సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను స్థాపించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మహిళల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల విద్యా సంస్థల్లో సగానికిపైగా బాలికల కోసమే కేటాయించిందని వెల్లడించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా గురుకులాలను అభివృద్ధి చేస్తామన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
సమన్వయంతోనే అభివృద్ధి
పోచారం: మున్నూరుకాపులు మరింత అభివృద్ధి సాధించాలంటే..కులస్తులంతా సమన్వయంతో పనిచేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ శివాస్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన మున్నూరుకాపు రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బహుజన కులాల్లో వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన వారిలో మున్నూరుకాపులే అధికంగా ఉన్నారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారంతా లబ్ధి పొందుతారన్నారు. రాజ్యాధికారంలో వెనుకబాటే.. వ్యవసాయాధారిత వృత్తులకు మున్నూరుకాపులే మూలమని, పటేల్, పట్వారీ వ్యవస్థకు వీరే రూపురేఖలు దిద్దారని నీటి పారుదల చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ వివరించారు. ఆ వ్యవస్థలు రద్దవడంతో మున్నూరుకాపులు రాజ్యాధికారంలో వెనకబడ్డారన్నారు. బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేకంటే బహుజన క్లాస్‌గా పిలవాలని, ఈ మార్పునకు తెలంగాణ నాంది కావాలన్నారు. 1 కోటి 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, దీంతో నిరాదరణకు గురైన గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం రాబోతుందని వివరించారు. మన కులం నుండి 9 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం శుభపరిణామమన్నారు. 33 జిల్లాల ప్రతినిధులు ఐక్యవేదిక గా ఏర్పడటం సంతోషంగా ఉందన్నారు. రమేశ్ హజారే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆశిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో మున్నూరు కాపులు కూడా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు రాసిన మున్నూరు కాపుల చరిత్ర–సంస్కృతి పుస్తకం, సంఘం ప్రత్యేక సంచిక, క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం పలు తీర్మానాలు ఆమోదించారు. రైతులకు సన్మానం ఈ సమావేశానికి హాజరైన రైతులను మున్నూరు కాపు సంఘం ఘనంగా సన్మానించింది. మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని, రూ.ఐదు కోట్లను కేటాయించిన సీఎం కేసీఆర్‌కు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సర్దార్ పుటం పురుషోత్తంను సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం ప్రారంభించేముందు కశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళి అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ టి.శ్రీనివాస్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు: - 18 శాతం ఉన్న మున్నూరు కాపులను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించాలని తీర్మానించారు. - మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని దేవాదాయ శాఖ పరిధి నుండి తొలగించాలన్నారు. - ఈ కులానికి కేటాయించిన 5 ఎకరాలు, 5 కోట్ల రూపాయలను రెట్టింపు చేయాలని కోరారు. - ప్రతి జిల్లాలో 2 ఎకరాల స్థలం కేటాయించి, అందులో బాలబాలికలకు హాస్టల్, కల్యాణ మంటపం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. -
విద్యార్థుల అభ్యున్నతికి కృషి
వనపర్తి : మున్నూరు కాపు సంఘం విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఐక్యంగా కృషి చేద్దామని, ఇందుకు రాష్ట్రంగా ఉన్న సంఘం నాయకుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని మున్నూరు కాపు ట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పీఆర్ అతిథి గృహంలో 250 మంది పేద విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం లో ప్రతిభకనబరిచిన వారితోపాటు పేద విద్యార్థులు చదువులో రాణించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పెంటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జయపాల్‌రెడ్డి, వనపర్తి అధ్యక్షుడు రాములు, నాయకులు కృష్ణయ్య, విజయకుమార్, నారాయణ, తిరుమలయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల అభ్యున్నతికి కృషి
వనపర్తి : మున్నూరు కాపు సంఘం విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఐక్యంగా కృషి చేద్దామని, ఇందుకు రాష్ట్రంగా ఉన్న సంఘం నాయకుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని మున్నూరు కాపు ట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పీఆర్ అతిథి గృహంలో 250 మంది పేద విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం లో ప్రతిభకనబరిచిన వారితోపాటు పేద విద్యార్థులు చదువులో రాణించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పెంటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జయపాల్‌రెడ్డి, వనపర్తి అధ్యక్షుడు రాములు, నాయకులు కృష్ణయ్య, విజయకుమార్, నారాయణ, తిరుమలయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
'మున్నూరు కాపులపై చిన్నచూపు తగదు'
ఖమ్మం (మామిళ్లగూడెం) : తెలంగాణ ఉద్యమంలో, సకలజనుల సమ్మెలో 42రోజులు కీలకంగా పనిచేసిన మున్నూరు కాపులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మున్నూరుకాపు ఖమ్మం అధ్యక్షుడు మేకల సంగయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు . జిల్లా వ్యాప్తంగా దాదాపు 3లక్షల మంది తమ వర్గం వారున్నారని పేర్కొన్నారు .కానీ, తమ పిల్లలకు కుల సర్టిఫికెట్ ఇవ్వటానికి అధికారులు నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం తమ వర్గం తక్కువగా ఉందని చూపే ప్రయత్నమేనని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తమ వర్గస్తులకు ఇబ్బందులు కలుగటం బాధాకరమన్నారు. ప్రభుత్వ గెజిట్ 20లో మున్నూరుకాపు బిసి-డి గా ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈనెల 19న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. తమ పిల్లలకు సిర్టిఫికెట్ల విషయంలో ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం సలహదారులు మేకల బిక్షమయ్య, కొత్త సీతారాములు, కోశాధికారి పొన్నం వెంకటేశ్వర్లు, గోలి వెంకటేశ్వర్లు, శ్రీహరి, గాంధీ తదితరులు పాల్గొన్నారు.