సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మున్నూరు కాపులు
ఎటపాక(అల్లూరి సీతారామరాజు జిల్లా): మున్నూరు కాపు కులస్తులకు బీసీ–డీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎటపాక మండలం తోటపల్లిలో మున్నూరు కాపులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కాపు సంఘం అధ్యక్షుడు ఆకిశెట్టి ఉమాశంకర్‌నాయుడు, గంజి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ సీఎం జగన్ పేదల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో మున్నూరు కాపులు బీసీ–డీ లుగా ఉన్నారని, అయితే రాష్ట్ర విభజన తర్వాత విలీన మండలాల ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం కులధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేసి ఇబ్బందిపెట్టిందని గుర్తుచేసుకున్నారు. దీంతో మున్నూరు కాపులు విద్య, ఉపాధి రంగాలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమగోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కృషితో సీఎం స్పందించి జీవో ఇవ్వడం హర్షణీయమన్నారు.
ఏడు విలీన మండలాల్లోని మున్నూరు కాపులంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని చెప్పారు కార్యక్రమంలో సంఘం నేతలు మారాసు గంగాధర్, ఆకుల వెంకటరామారావు, మారాసు సత్యనారాయణ, రంభాల నాగేశ్వరరావు, గంజి సత్యానందం, అనసూరి శ్రీనివాస్, ములిశెట్టి రమేష్, బండారు శివాజీ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment