విద్యార్థుల అభ్యున్నతికి కృషి
Published Fri, Sep 9 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
వనపర్తి : మున్నూరు కాపు సంఘం విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఐక్యంగా కృషి చేద్దామని, ఇందుకు రాష్ట్రంగా ఉన్న సంఘం నాయకుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని మున్నూరు కాపు ట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పీఆర్ అతిథి గృహంలో 250 మంది పేద విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం లో ప్రతిభకనబరిచిన వారితోపాటు పేద విద్యార్థులు చదువులో రాణించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పెంటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జయపాల్‌రెడ్డి, వనపర్తి అధ్యక్షుడు రాములు, నాయకులు కృష్ణయ్య, విజయకుమార్, నారాయణ, తిరుమలయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement