పరీక్షల్లో ఇలా దొరికి పోతారు.. | Drink-Driving breathalyzer | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో ఇలా దొరికి పోతారు..

Published Mon, Aug 4 2014 12:51 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

పరీక్షల్లో ఇలా దొరికి పోతారు.. - Sakshi

పరీక్షల్లో ఇలా దొరికి పోతారు..

 పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌ను వాహన చోదకుడి నోటి ముందు పెట్టి ఊదమంటారు. శ్వాస ఊదిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నటై్లతే ఆ యంత్రంలో ఆల్కహాల్ శాతం నమోదవుతుంది.  తక్కువ మోతాదు (బీరు లేదా 15 ఎంఎల్ మద్యం) సేవించినట్లైతే 30 శాతంగా చూపిస్తుంది.   ఎక్కువ మోతాదులో మద్యం సేవిస్తే 60 నుంచి 120 శాతం వరకు ఆల్కహాలు తాగినట్లు యంత్రంలో చూపిస్తుంది.  శ్వాస ఊదినప్పుడు యంత్రంలో కనీసం 30 శాతం ఆల్కహాలు సేవించినట్లు నమోదైతే అతనిపై కేసులు నమోదు చేస్తారు.  శ్వాస పరీక్షల సమయం, ఎంత శాతం ఆల్కహాలు సేవించారనే వివరాలన్నీ శ్వాస యంత్రం నుంచి రశీదు బయటకు వస్తుంది. ఈ మేరకు 185 ఎ కింద కేసు నమోదు చేసిన తర్వాత వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. వాహనదారుడిని మరుసటి రోజు న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. న్యాయమూర్తి ఇచ్చే తీర్పును బట్టి రూ.2 వేల వరకు జరిమానా, కొన్ని సందార్భాల్లో జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
 
 లారీ ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురి మృతి.. ఆటో బోల్తాపడి నలుగురు దుర్మరణం.. మద్యం మత్తులో ద్విచక్ర వాహ నం అదుపుతప్పి ఒకరి మృతి..
 
 నిత్యం ఇలాంటి వార్తలు మనం చదువుతూనే ఉంటాం. వింటూనే ఉంటాం. ఇలాంటి ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని
 
 మిగిల్చుతున్నాయి. ఇందులో పలు సంఘటనలు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లే జరుగుతున్నాయనేది వాస్తవం. మద్యం తాగాక
 
 ‘మందు బాబులం మేము మందుబాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం’ అంటూ ఇంట్లో పడుకోవడమే మేలని
 
 సూచిస్తున్నారు పోలీసులు. రోడ్డుపైకి వచ్చి.. అదీ వాహనం సాయంతో రావడం అంత మంచిది కాదంటున్నారు. మద్యం సేవించి
 
 వాహనాలు నడపడం ద్వారా ఏటా వందలాది సంఖ్యలో చనిపోతున్నారు. అందుకే ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్ర
 
 మాన్ని చేపట్టింది. బ్రీత్ అనలైజర్ యంత్రంతో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని ఈజీగా గుర్తుపట్టొచ్చు. అయితే..
 
 ఈ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో స్పందించిన ప్రభుత్వం
 
 బ్రీత్ అనలైజర్ పరీక్షలను పటిష్టం చేసేందుకు ఉపక్రమించింది. అందులో భాగంగా జిల్లాకు 50 యంత్రాలు మంజూరు
 
 చేసింది. వీటితో మద్యం బాబుల పనిపట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
 - నల్లగొండ క్రైం
 
 అజాగ్రత్తతోనే రోడ్డు ప్రమాదాలు..
 మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణంగా మద్యం సేవించడమేనని పోలీసులు చెబుతున్నారు. అతివేగం, రోడ్డు ప్రమాద నివారణ నిబంధనలు, డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వాహనాలు నడపడంతో అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవింగ్‌పై అన్ని రకాల వాహన దారులకు పోలీసులు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.  వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సిగ్నల్స్ వద్ద ఉన్న గుర్తులు, మిగతా జాగ్రత్తలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు.
 
 అడపాదడపానే తనిఖీలు
 జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అడపాదడపా తనిఖీలు చేసినా ఫలితం  ఉండడం లేదు. రోజూ ఎక్కడో ఒక దగ్గర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు  పాతవి 20 బ్రీత్ ఎనలైజర్లు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతానికి 10 బ్రీత్ ఎనలైజర్ యంత్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిని సూర్యాపేట పట్ట ణం, సూర్యాపేట మండలం, నార్కట్‌పల్లి, నల్లగొండ ట్రాఫిక్, మిర్యాలగూడ పట్టణాల్లో ఉపయోగిస్తున్నారు. మండలాల్లో వాటి నిర్వహణ లేదు. జిల్లావ్యాప్తంగా రెండేళ్లలో డ్రంక్ డ్రైవ్ కేసులు వందకు మించలేదు. ఇందుకు కారణం బ్రీత్ ఎనలైజర్ యంత్రాలు లేకపోవడం ఒకటైతే.. సిబ్బంది కూడా అడపాదడపానే తనిఖీలు చేస్తున్నారన్నది మరో కారణంగా తెలుస్తోంది.
 
 కొత్తగా 50 బ్రీత్ ఎనలైజర్లు మంజూరు
 రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు మత్తులో వాహనాలు నడపడమే ప్రధాన కారణమని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం వీటి నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నివారించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా తనిఖీలు ముమ్మరం చేయాలని భావించింది. ఇందుకోసం జిల్లాకు 50 బ్రీత్ ఎనలైజర్లను కేటాయించింది.  ఇవి రావాల్సి ఉంది. వీటిని పట్టణాలతోపాటు మండలాలకు కేటాయించి డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు.
 
 తాగి నడిపితే..
 మద్యం తాగి వాహనం నడిపి మొదటిసారి పట్టుబడిన వారికి రూ.2వేలు,  రెండోసారి పట్టుబడితే రూ.5వేలు, ఆరునెలల జైలుశిక్ష వేస్తారు. అయితే ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఎవరికి కూడా జరిమానా వేసిన దాఖలాలు లేవు. పట్టుబడిన వారు సిబ్బందితో ‘మాట్లాడుకుని’ బయటపడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement