కోరిన వెంటనే నీటి విడుదల! | Drinking water to be released when its needed | Sakshi
Sakshi News home page

కోరిన వెంటనే నీటి విడుదల!

Published Sat, Aug 23 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

Drinking water to be released when its needed

సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం ఇకపై కోరిన వెం టనే జలాశయాల నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ విషయంలో ఉన్నత స్థాయి అనుమతుల్లో జాప్యా న్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నగర/పురపాలక సంస్థలు, పంచాయతీలు, పరిశ్రమల నుంచి విజ్ఞప్తి వచ్చిన వెంటనే నీటిని విడుదల చేసే అధికారాన్ని సంబంధిత జలాశయాల ఇంజనీర్లకు ప్రభుత్వం కట్టబెట్టనుంది. ఇప్పటికే ఈ అంశంపై సీఎం కేసీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జలాశయాల్లోని మొత్తం నిల్వల్లో 10 శాతం నీటిని తాగునీరు, మరో 10 శాతం నీటిని సాగునీటి అవసరాలకే కేటాయించాలని సీఎం గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు  త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement