
కోతలు తప్పవా?
కరెంటు కొరతపై సర్వత్రా ఆందోళన
* రోజు రోజుకూ పెరుగుతున్న వినియోగం
* రబీ సాగు తగ్గడంతో కొంత ఉపశమనం
* ఇలాగైతే వచ్చే ఖరీఫ్‌లోనూ కష్టమే
* మొత్తం విద్యుత్ కనెక్షన్లపె ప్రభావం
* విద్యుత్ అధికారులతో నేడు సీఎం భేటీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పొంచి ఉన్న విద్యుత్ కోతల భయం జిల్లావాసులను మళ్లీ ఆందోళనకు గురి చే స్తోంది. ఖరీఫ్ ముగింపు, రబీ ఆరంభం స మయంలో ‘కోత’లు సతమతం చేశా యి. వర్షాభావ పరిస్థితులు, కరెంట్ కోతలతో ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులు, అదే కారణంతో రబీకి దూరంగా ఉన్నారు. రబీ లక్ష్యం 1,78,686 హెక్టార్లు కాగా, ఇప్పటికీ 76,242 హెక్టార్లలోనే (42.67 శాతం) పంటలు వేశారు.
వరి 80,670 హెక్టార్లలో వేస్తారని అంచనా వేయగా, శనివారంనాటికి 8,061 హెక్టార్లకే పరిమితమైంది. దీం తో ఉచిత విద్యుత్ కనెక్షన్ల వినియోగం తగ్గింది. గత ఐదారు రోజులుగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. రోజు 6.5 మిలియన్ యూనిట్ల నుంచి 7.2 మిలియన్ యూనిట్లకు పెరిగింది. వేసవినాటికి రోజుకు 10 నుంచి 12 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశముంది.
అయితే, కేవలం నెలకు 220 మిలియన్ యూనిట్ల వరకే జిల్లాకు కరెంటు సరఫరా చేసే అవకాశం ఉండగా, అం తకు మించి వినియోగం పెరిగితే కోతలు తప్పవని విద్యుత్ శాఖ అధికారులే చెబుతున్నారు. ముందున్న కరెంట్ కోతలు అం దరినీ భయపెడ్తుండగా, సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయలో విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంత రించుకుంది.
ఈ మేరకు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) సీఎండీతోపాటు ఎస్‌ఈ, డీఈఈలకు శనివారం సమాచారం అందింది. చలికాలం.. అందులో తగ్గిన రబీసాగు తో విద్యుత్ కోతలు ప్రస్తుతం అంతగా లేవు. అడుగంటిన జలాశయాలు, విద్యుత్తు సమస్యల నేపథ్యంలో ఖచ్చితంగా ఆరుతడి పంటలే వేయాలని ప్రభుత్వం ప్రచారం చేసింది. జిల్లాలో అన్ని కేటగిరీలకు సంబంధించి మొత్తం 8.63 లక్షల విద్యుత్ కనెక్షన్లుండగా, ఇందులో వ్యవసాయానికి సం బం ధించి 2,16,920 ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
ఇందులో 99 శాతం బోరుబావులు ఉండగా, ప్రస్తుతం 10 శాతం బోర్లు కూడ సరిగా నడవడం లేదు. మొత్తం ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు వినియోగంలోకి వస్తే అప్పుడు ఏర్పడే ‘కోత’లను ఊహించలేం. గత రబీ సాగు విస్తీర్ణాన్ని దష్టిలో పెట్టుకొని అధికారులు 2014-1 5 రబీలో 1,78,684 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారని యాక్షన్‌ప్లాన్‌లో పేర్కొన్నారు.
జిల్లాలో ప్రధానంగా రబీలో వరి, జొన్న, చెరుకు, మొక్కజొన్న, శనగ తదితర పంటల సాగు అధికంగా ఉండే అవకాశం ఉండగా, ఆ తర్వాత పొద్దుతిరుగుడు, పెసర, వేరుశనగ తదితర పంటలు వేస్తారని పేర్కొన్నారు.వరి 86,670 హెక్టార్లు,జొన్న 6,177, మొక్కజొన్న 27,607, శనగ 26,650, పొద్దుతిరుగుడు 9,446, చెరకు 4,660, ఉల్లి 2,211, నువ్వులు 3,184, గోధుమలు 1443 హెక్టార్లు కాగా, మిగతా విస్తీర్ణంలో పెసర, కందులు, సజ్జలు వేస్తారని భావించారు.
అయితే ఈ రబీలో ఇప్పటి వరకు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. శనివారంనాటికి 8,061 హెక్టార్లలోనే వరి నాట్లు వేశారు. అవి ఇంకా పుంజుకునే అవకాశం ఉంది. అన్ని రకాలకు సంబంధించిన విద్యుత్ వినియోగం పెరగనున్న నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి 9.650 మిలియన్ యూనిట్ల నుంచి 12.210 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా.