సకల ఉద్యోగుల మహాసభను జయప్రదం చేయాలి | Employees Protest On Cps Policy | Sakshi
Sakshi News home page

సకల ఉద్యోగుల మహాసభను జయప్రదం చేయాలి

Published Fri, Mar 23 2018 3:31 PM | Last Updated on Fri, Mar 23 2018 3:31 PM

Employees Protest On Cps Policy - Sakshi

వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

సంగారెడ్డి రూరల్‌: హైదరాబాద్‌లో ఈ నెల 25న నిర్వహించే సకల ఉద్యోగుల మహాసభను జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని తెలంగాణ రెవెన్యూ  ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వై. శివప్రసాద్‌ పిలుపునిచ్చారు. సమీకృత కలెక్టరేట్‌ ఆవరణలో గురువారం సాయంత్రం అసోసియేషన్‌ సభ్యులతో కలిసి మహాసభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్‌ అంశంతో ఉద్యోగులు భద్రత లేని బతుకులు వెల్లదీస్తున్నారన్నారు. జిల్లాల విభజనలో భాగంగా ఉద్యోగులు తమ అనుమతి లేకుండా జరిగిన బదిలీలతో అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించి అవసరమైన చోట ఖాళీలు భర్తీ చేసేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. 11వ పే రివిజన్‌ కమిషన్‌ను వెంటనే నియమించి  ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బొమ్మరాములు, వీరేశం, బాల్‌రాజ్, వరప్రసాద్, శ్రీనివాస్, గుండేరావు, సయ్యద్‌ఉమర్‌పాష, కిరణ్‌కుమార్, అలీమ్, విశ్వేశ్వర్, కిశోర్‌  పాల్గొన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement