రెచ్చిపోయిన కుక్కలు | Enraged dogs | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన కుక్కలు

Published Thu, Mar 31 2016 4:49 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

Enraged dogs

52 మందికి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం

 నాగర్‌కర్నూల్: వీధికుక్కలు రెచ్చి పోయాయి. ఏకంగా 52 మందిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలులో బుధవారం చోటుచేసుకుంది. మొదట మూడు కుక్కలు సంజయ్‌నగర్ కాలనీవాసులపై దాడిచేశాయి. 

రాఘవేంద్రనగర్ కాలనీ, ఎర్రగడ్డ కాలనీ, పోస్టాఫీసు, గోదాం ఏరియా తదితర ప్రాంతాల్లోనూ కొందరిపై దాడి చేశాయి. గాయపడిన వారిని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న ఐశ్వర్య, సీఎన్‌ఆర్‌లో మూడో తరగతి చదువుతున్న ముఖేష్, సంజయ్‌నగర్‌కు చెందిన బుచ్చమ్మ, రసూల్‌బీ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement