జంబో పీసీసీ | Executive List of Telangana Pradesh Congress Committee | Sakshi
Sakshi News home page

జంబో పీసీసీ

Published Sun, Apr 17 2016 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

జంబో పీసీసీ

జంబో పీసీసీ

110 మందితో జాబితాను ప్రకటించిన ద్వివేది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది. జిల్లాలు, వర్గాలతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఊహించిన దానికంటే కాస్త భారీ పరిమాణంలోనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. గతంలో 400కు పైగా ఉన్న కార్యవర్గ పరిమాణాన్ని ఈసారి 110 మందికి ఏఐసీసీ, పీసీసీ పెద్దలు కుదించారు. ఏఐసీసీ అధినేత్రి  సోనియాగాంధీ ఆమోదంతో కార్యవర్గ జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది శనివారం ప్రకటించారు.

13 మంది ఉపాధ్యక్షులుగా, 31 మంది ప్రధాన కార్యదర్శులుగా, 35 మంది కార్యనిర్వాహక సభ్యులుగా నియమితులవగా 22 మందిని శాశ్వత ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. మరో 31 మందితో టీపీసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శులను 10 మందికి పరిమితం చేయాలని భావించినా సీనియర్లకు, జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న నాయకులకు స్థానం కల్పించాల్సి రావడంతో 35కు చేరింది. ఉపాధ్యక్షుల సంఖ్యను పెద్దగా పెంచలేదు. అయితే జిల్లాలు, లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పూర్తికాలం పని చేసేవారు ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారు.
 
ఉపాధ్యక్షులు
 1. నంది ఎల్లయ్య 2. సబితా ఇంద్రారెడ్డి 3. డి.కె.అరుణ 4. డి.శ్రీధర్‌బాబు 5. మల్లు రవి, 6. గడ్డం ప్రసాద్‌కుమార్ 7. పి.బలరాం నాయక్ 8. పొన్నం ప్రభాకర్, 9. టి.నాగయ్య 10. పి.నరసింహారెడ్డి 11. అబీద్ రసూల్ ఖాన్ 12. ఎం.రంగారెడ్డి 13. టి.కుమార్‌రావు
 
ప్రధాన కార్యదర్శులు
 1. పి.లక్ష్మణ్‌రావు గౌడ్ 2. సంపత్‌కుమార్ 3. సి.జె.శ్రీనివాసరావు 4. జెట్టి కుసుమ్‌కుమార్ 5. కోలేటి దామోదర్ 6. హెచ్.వేణుగోపాలరావు 7. ప్రేమ్‌లాల్ 8. ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డి 9. పి.శ్రావణ్‌కుమార్‌రెడ్డి 10. టి.నిరంజన్ 11. ఆదం సంతోష్‌కుమార్ 12. బండ కార్తీకరెడ్డి 13. అజ్మతుల్లా హుస్సేనీ 14. రేగా కాంతారావు 15. ఎస్.ఎస్.అఫ్జలుద్దీన్ 16. బొల్లు కిషన్ 17. మక్సూద్ అహ్మద్ 18. గండ్ర సుజాత 19. ప్రేమలతా అగర్వాల్ 20. గంగాధర్ 21. ఉజ్మా షకీర్ 22. బక్కా జడ్సన్ 23. శ్రవణ్ దాసోజు 24. ఆత్రం సక్కు 25. కొండేటి మల్లయ్య 26. బి.మహేశ్‌కుమార్ గౌడ్ 27. సుజాత 28. రవీంద్రరావు 29. సిహెచ్.లక్ష్మీనరసింహరావు 30. ఎన్.శ్రీనివాస్ 31. నాగుబండి రాంబాబు.
కోశాధికారి: గూడూరు నారాయణరెడ్డి
 
కార్యనిర్వాహక కమిటీ సభ్యులు
1. కె.జానారెడ్డి 2. మహహ్మద్ అలీ షబ్బీర్ 3. పొన్నాల లక్ష్మయ్య 4. ఎస్.జైపాల్‌రెడ్డి 5. సర్వే సత్యనారాయణ 6. మర్రి శశిధర్‌రెడ్డి 7. దామోదర్ రాజనర్సింహ 8. కె.ఆర్.సురేశ్‌రెడ్డి 9. జీవన్‌రెడ్డి 10. జె.గీతారెడ్డి 11. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 12. టి.రామ్మోహన్‌రెడ్డి 13. సీహెచ్.వంశీచంద్‌రెడ్డి 14. ఎన్.భాస్కరరావు 15. ఎన్.పద్మావతిరెడ్డి 16. పువ్వాడ అజయ్ కుమార్ 17. దొంతి మాధవరెడ్డి 18. ఫరూఖ్ 19. పి.సుధాకర్‌రెడ్డి 20. సంతోష్‌కుమార్‌రెడ్డి 21. ఆకుల లలిత 22. రాజగోపాల్‌రెడ్డి 23. కె.దామోదర్‌రెడ్డి 24. గుత్తా సుఖేందర్‌రెడ్డి 25. వి.హన్మంతరావు 26. రేణుకా చౌదరి 27. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 28. ఎం.ఎ.ఖాన్ 29. ఎం.అంజన్‌కుమార్ యాదవ్ 30. జి.వివేక్ 31. మధు యాష్కీ 32. సురేశ్ షెట్కార్, 33. ఆర్.దామోదర్‌రెడ్డి 34. దానం నాగేందర్ 35.రాజ్‌గోపాల్‌రెడ్డి
 
శాశ్వత ఆహ్వానితులు
1. అన్ని అనుబంధ సంస్థలు, విభాగాల అధ్యక్షులు 2. గండ్ర వెంకట్రాంరెడ్డి 3. కె.లక్ష్మారెడ్డి 4. ఇ.అనిల్‌కుమార్ 5. బి.కమలాకర్‌రావు 6. గండ్ర వెంకట రమణారెడ్డి 7. క్యామా మల్లేశం 8. పోడెం వీరయ్య 9. గౌరీ శంకర్ 10. పి.వినయ్‌కుమార్ 11. ఎ.చంద్రశేఖర్ 12. జె.రాఘవరెడ్డి 13. వల్లె నారాయణ రెడ్డి 14. జి.నిరంజన్ 15. ఇందిరా శోభన్ 16. జబీర్ పటేల్ 17. ఎ.సిద్ధిఖీ 18. కె.దయాసాగర్ రావు 19. డి.రవీందర్ నాయక్ 20. నమిండ్ల శ్రీనివాస్ 21. అనీత జక్కని 22. సంభాని చంద్రశేఖర్.
 
టీపీసీసీ సమన్వయ కమిటీ
1. ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి 2. భట్టి విక్రమార్క మల్లు 3. కె.జానారెడ్డి 4. షబ్బీర్ అలీ 5. వి.హన్మంతరావు 6. పొన్నాల లక్ష్మయ్య, 7. దామోదర్ రాజనర్సింహ 8. కె.ఆర్.సురేశ్‌రెడ్డి 9. జి.రేణుకాచౌదరి 10. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 11. రాపోలు ఆనందభాస్కర్ 12. ఎం.ఎ.ఖాన్ 13. గుత్తా సుఖేందర్‌రెడ్డి 14. సీహెచ్.వంశీచంద్‌రెడ్డి 15. ఎస్.జైపాల్‌రెడ్డి 16. సర్వే సత్యనారాయణ 17. జె.గీతారెడ్డి 18. డి.నాగేందర్ 19. ఎం.శశిధర్‌రెడ్డి 20. జి.వివేక్ 21. పి.వీరయ్య 22. జి.చిన్నారెడ్డి 23. మధు యాష్కీ 24. పి.సుధాకర్‌రెడ్డి 25. కె.గౌరీశంకర్, 26. ఆర్.దామోదర్ రెడ్డి 27. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 28. డి.కె.అరుణ, 29. టి.జీవన్‌రెడ్డి 30. శ్రీధర్ బాబు 31. ఎం.రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement