పీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్‌గా శ్రీనివాసరావు | PCC secretary, media Convenor As Srinivasa Rao | Sakshi
Sakshi News home page

పీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్‌గా శ్రీనివాసరావు

Published Wed, Oct 22 2014 2:55 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

పీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్‌గా శ్రీనివాసరావు - Sakshi

పీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్‌గా శ్రీనివాసరావు

వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యదర్శిగా, మీడియా కన్వీనర్‌గా ఈవీ శ్రీనివాసరావును నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శ్రీనివాసరావు హైదరాబాద్‌లో పొన్నాల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసరావు 20 ఏళ్లుగా ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్తర్తించారు. పార్ట్లీ మీడియా  బాధ్యతలు సైతం నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ పదవిని కేటాయించినట్లు పొన్నాల తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని ఎప్పటికి గుర్తింపు ఉంటుందని, ఇందుకు నిదర్శనం తానేనని అన్నారు. పార్టీకి, మీడియాకు మధ్య సమన్వయం చేస్తూ కాంగ్రెస్ ప్రతిష్ట పెరిగేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఈ అవకాశమిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు జిల్లా, నగర కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement