Telangana Pradesh Congress Committee
-
టీపీసీసీ ఎస్సీ విభాగానికి సోనియా ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఎస్సీ విభాగం ఏర్పాటుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం అమోదించారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగ విస్తరణకు కూడా ఆమె ఆమోదముద్ర వేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. టీపీసీసీ ఎస్సీ విభాగంలో ఆరుగురు వైస్ చైర్మన్లు, ఐదుగురు కన్వీనర్లను నియమించారు. గజ్జెల కాంతం, బి.కైలాష్, పి.యాకస్వామి, ఏవీ స్వామి, నగరిగారి ప్రీతం, కృశాంక్ మన్నె వైస్చైర్మన్లుగా... ఎం.ఆగమయ్య, జేబీ శౌరి, నీలం వెంకటస్వామి, బుర్రి కృష్ణవేణి, ఐతా రజనీదేవి కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఏపీపీసీసీ ఎస్సీ విభాగ విస్తరణలో.. అదనంగా నలుగురు కన్వీనర్లను నియమించారు. వీరిలో సత్యశ్రీ, ఎం.అన్నపూర్ణ, గాడి సరోజినీదేవి, మేకల జ్ఞానేశ్వరి ఉన్నారు. -
జంబో పీసీసీ
110 మందితో జాబితాను ప్రకటించిన ద్వివేది సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది. జిల్లాలు, వర్గాలతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఊహించిన దానికంటే కాస్త భారీ పరిమాణంలోనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. గతంలో 400కు పైగా ఉన్న కార్యవర్గ పరిమాణాన్ని ఈసారి 110 మందికి ఏఐసీసీ, పీసీసీ పెద్దలు కుదించారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదంతో కార్యవర్గ జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది శనివారం ప్రకటించారు. 13 మంది ఉపాధ్యక్షులుగా, 31 మంది ప్రధాన కార్యదర్శులుగా, 35 మంది కార్యనిర్వాహక సభ్యులుగా నియమితులవగా 22 మందిని శాశ్వత ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. మరో 31 మందితో టీపీసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శులను 10 మందికి పరిమితం చేయాలని భావించినా సీనియర్లకు, జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న నాయకులకు స్థానం కల్పించాల్సి రావడంతో 35కు చేరింది. ఉపాధ్యక్షుల సంఖ్యను పెద్దగా పెంచలేదు. అయితే జిల్లాలు, లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పూర్తికాలం పని చేసేవారు ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారు. ఉపాధ్యక్షులు 1. నంది ఎల్లయ్య 2. సబితా ఇంద్రారెడ్డి 3. డి.కె.అరుణ 4. డి.శ్రీధర్‌బాబు 5. మల్లు రవి, 6. గడ్డం ప్రసాద్‌కుమార్ 7. పి.బలరాం నాయక్ 8. పొన్నం ప్రభాకర్, 9. టి.నాగయ్య 10. పి.నరసింహారెడ్డి 11. అబీద్ రసూల్ ఖాన్ 12. ఎం.రంగారెడ్డి 13. టి.కుమార్‌రావు ప్రధాన కార్యదర్శులు 1. పి.లక్ష్మణ్‌రావు గౌడ్ 2. సంపత్‌కుమార్ 3. సి.జె.శ్రీనివాసరావు 4. జెట్టి కుసుమ్‌కుమార్ 5. కోలేటి దామోదర్ 6. హెచ్.వేణుగోపాలరావు 7. ప్రేమ్‌లాల్ 8. ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డి 9. పి.శ్రావణ్‌కుమార్‌రెడ్డి 10. టి.నిరంజన్ 11. ఆదం సంతోష్‌కుమార్ 12. బండ కార్తీకరెడ్డి 13. అజ్మతుల్లా హుస్సేనీ 14. రేగా కాంతారావు 15. ఎస్.ఎస్.అఫ్జలుద్దీన్ 16. బొల్లు కిషన్ 17. మక్సూద్ అహ్మద్ 18. గండ్ర సుజాత 19. ప్రేమలతా అగర్వాల్ 20. గంగాధర్ 21. ఉజ్మా షకీర్ 22. బక్కా జడ్సన్ 23. శ్రవణ్ దాసోజు 24. ఆత్రం సక్కు 25. కొండేటి మల్లయ్య 26. బి.మహేశ్‌కుమార్ గౌడ్ 27. సుజాత 28. రవీంద్రరావు 29. సిహెచ్.లక్ష్మీనరసింహరావు 30. ఎన్.శ్రీనివాస్ 31. నాగుబండి రాంబాబు. కోశాధికారి: గూడూరు నారాయణరెడ్డి కార్యనిర్వాహక కమిటీ సభ్యులు 1. కె.జానారెడ్డి 2. మహహ్మద్ అలీ షబ్బీర్ 3. పొన్నాల లక్ష్మయ్య 4. ఎస్.జైపాల్‌రెడ్డి 5. సర్వే సత్యనారాయణ 6. మర్రి శశిధర్‌రెడ్డి 7. దామోదర్ రాజనర్సింహ 8. కె.ఆర్.సురేశ్‌రెడ్డి 9. జీవన్‌రెడ్డి 10. జె.గీతారెడ్డి 11. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 12. టి.రామ్మోహన్‌రెడ్డి 13. సీహెచ్.వంశీచంద్‌రెడ్డి 14. ఎన్.భాస్కరరావు 15. ఎన్.పద్మావతిరెడ్డి 16. పువ్వాడ అజయ్ కుమార్ 17. దొంతి మాధవరెడ్డి 18. ఫరూఖ్ 19. పి.సుధాకర్‌రెడ్డి 20. సంతోష్‌కుమార్‌రెడ్డి 21. ఆకుల లలిత 22. రాజగోపాల్‌రెడ్డి 23. కె.దామోదర్‌రెడ్డి 24. గుత్తా సుఖేందర్‌రెడ్డి 25. వి.హన్మంతరావు 26. రేణుకా చౌదరి 27. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 28. ఎం.ఎ.ఖాన్ 29. ఎం.అంజన్‌కుమార్ యాదవ్ 30. జి.వివేక్ 31. మధు యాష్కీ 32. సురేశ్ షెట్కార్, 33. ఆర్.దామోదర్‌రెడ్డి 34. దానం నాగేందర్ 35.రాజ్‌గోపాల్‌రెడ్డి శాశ్వత ఆహ్వానితులు 1. అన్ని అనుబంధ సంస్థలు, విభాగాల అధ్యక్షులు 2. గండ్ర వెంకట్రాంరెడ్డి 3. కె.లక్ష్మారెడ్డి 4. ఇ.అనిల్‌కుమార్ 5. బి.కమలాకర్‌రావు 6. గండ్ర వెంకట రమణారెడ్డి 7. క్యామా మల్లేశం 8. పోడెం వీరయ్య 9. గౌరీ శంకర్ 10. పి.వినయ్‌కుమార్ 11. ఎ.చంద్రశేఖర్ 12. జె.రాఘవరెడ్డి 13. వల్లె నారాయణ రెడ్డి 14. జి.నిరంజన్ 15. ఇందిరా శోభన్ 16. జబీర్ పటేల్ 17. ఎ.సిద్ధిఖీ 18. కె.దయాసాగర్ రావు 19. డి.రవీందర్ నాయక్ 20. నమిండ్ల శ్రీనివాస్ 21. అనీత జక్కని 22. సంభాని చంద్రశేఖర్. టీపీసీసీ సమన్వయ కమిటీ 1. ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి 2. భట్టి విక్రమార్క మల్లు 3. కె.జానారెడ్డి 4. షబ్బీర్ అలీ 5. వి.హన్మంతరావు 6. పొన్నాల లక్ష్మయ్య, 7. దామోదర్ రాజనర్సింహ 8. కె.ఆర్.సురేశ్‌రెడ్డి 9. జి.రేణుకాచౌదరి 10. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 11. రాపోలు ఆనందభాస్కర్ 12. ఎం.ఎ.ఖాన్ 13. గుత్తా సుఖేందర్‌రెడ్డి 14. సీహెచ్.వంశీచంద్‌రెడ్డి 15. ఎస్.జైపాల్‌రెడ్డి 16. సర్వే సత్యనారాయణ 17. జె.గీతారెడ్డి 18. డి.నాగేందర్ 19. ఎం.శశిధర్‌రెడ్డి 20. జి.వివేక్ 21. పి.వీరయ్య 22. జి.చిన్నారెడ్డి 23. మధు యాష్కీ 24. పి.సుధాకర్‌రెడ్డి 25. కె.గౌరీశంకర్, 26. ఆర్.దామోదర్ రెడ్డి 27. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 28. డి.కె.అరుణ, 29. టి.జీవన్‌రెడ్డి 30. శ్రీధర్ బాబు 31. ఎం.రంగారెడ్డి -
టీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాటాలకు కాంగ్రెస్ రెడీ!
-
క్షేత్రస్థాయికి వెళ్లండి..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ఇటీవలి కాలంలో చేపట్టిన కార్యక్రమాలను అభినందిస్తూనే... క్షేత్రస్థాయికి వెళ్లి కార్యక్రమాలు చేపట్టాలంటూ పార్టీ నేతలకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఉపదేశించారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ, మండలిలో ప్రతిపక్షనాయకులు కె. జానారెడ్డి, షబ్బీర్‌అలీ కలిశారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతోపాటు, టీపీసీసీ, సీఎల్పీ పనితీరును సమీక్షించారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు ఓటుకు కోట్లు, ఫిరాయింపులు వంటి అంశాలను రాహుల్ రాష్ట్ర నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 30లోగా పార్టీ సభ్యత్వ ప్రక్రియను పూర్తిచేయాలని, పోలింగ్‌బూత్‌కు 50 మంది క్రియాశీల సభ్యులను పూర్తిచేసి అధిష్టానానికి నివేదిక పంపించాలని సూచించారు. అదేవిధంగా పార్టీనేతల వ్యక్తిగత పనితీరును కూడా అడిగితెలుసుకున్న రాహుల్.. పార్టీ సభ్యత్వ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి వివరాలు అందించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, వరంగల్ నగరపాలక, వరంగల్ లోక్‌సభ ఎన్నికలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. నియోజకవర్గస్థాయిలో టీపీసీసీ సమావేశాలు నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్.. సీఎల్పీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా సరైన పాత్రను పోషించడం లేదని రాహుల్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీ ఫిరాయింపులపై నిలదీస్తా... సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు, ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకున్న అంశం, ఈ సందర్భంగా స్పీకరు, గవర్నరు వ్యవహరిస్తున్న తీరుపై పార్లమెంటులోనే నిలదీస్తానని రాహుల్ చెప్పారు. ఇదిలాఉండగా, ఇప్పటిదాకా ఎంఐఎంతో పరస్పర అవగాహనతో పనిచేసినా, భవిష్యత్తులో అమీతుమీ తేల్చుకోవాలని టీపీసీసీ నేతలకు రాహుల్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కేడర్ విస్తరణపై దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా రాహుల్ టీపీసీసీ నేతలకు సూచించారు. పాతబస్తీలో రాహుల్ సద్భావనా యాత్ర ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు మొదటివారంలో ‘సద్భావనా పాదయాత్ర’ పేరుతో దీనిని చేపట్టే అవకాశముంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముందు గా పాతబస్తీలో పర్యటించాలని నిర్ణయించారు. రాహుల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జీలు దిగ్విజయ్‌సింగ్, ఆర్.సి.కుంతియాతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీనేత కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. కాగా, హైదరాబాద్, వరంగల్‌లో వరుసగా పాదయాత్ర నిర్వహిస్తే బాగుంటుందా లేక రెండు వేర్వేరు తేదీల్లో విడతల వారీగా యాత్ర చేస్తే బాగుంటుందా అనే విషయంపై టీపీసీసీని నివేదిక ఇవ్వాలని రాహుల్‌గాంధీ ఆదేశించినట్టు తెలిసింది. -
పాదయాత్రను విజయవంతం చేయాలి
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ రూరల్ : హైదరాబాద్‌లో సచివాలయం, ఛాతి అస్పత్రి తరలింపునకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన గాంధీ భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆయన తన స్వగృహంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, టీపీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు ఎ.కృష్ణ, నమిండ్ల శ్రీనివాస్, ప్రొటోకాల్ కన్వీనర్ బట్టి శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి రాపోలు జయప్రకాశ్, రాజారపు ప్రతాప్‌తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయూలకు నిరసనగా చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని నాయకులకు పొన్నాల సూచించారు. దళిత చైతన్య సదస్సును జయపప్రదం చేయూలి : నాయిని హన్మకొండలోని నందన గార్డెన్స్‌లో ఈనెల 9నజరిగే దళిత చైతన్య జిల్లా సదస్సును విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన స్వగృహంలో జిల్లా, నగర నాయకులతో సమావేశమయ్యారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్‌తోపాటు సీనియర్ నాయకులు సదససుకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను తరలించేలా చూడాలని నాయకులకు సూచించారు. సమావేశంలో నగర అధ్యక్షుడు విద్యాసాగర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యుడు ప్రతాప్, టీపీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, కోన శ్రీకర్, మనోహర్, మేకల ఉపేందర్ పాల్గొన్నారు. -
పొన్నాల’కు తలనొప్పి
⇒ తెరపైకి రాంపూర్ భూముల వ్యవహారం ⇒ శాసనసభలో సుదీర్ఘ చర్చ ⇒ అదే సమయంలో అధికారుల సర్వే సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. సుదీర్ఘకాలంగా వివాదంలో ఉన్న ధర్మసాగర్ మండలం రాంపూర్‌లోని అసైన్డ్ భూముల వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. దీనిపై శాసనసభలో బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా సాధారణ ఎన్నికలను ఎదుర్కొన్న పొన్నాలకు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతోపాటు స్వయంగా ఆయన కూడా ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి పొన్నాల నాయకత్వంపై సొంత పార్టీలోనే అసంతృప్తులు పెరుగుతున్నారు. తాజాగా రాంపూర్ అసైన్డ్ భూముల వ్యవహారం జిల్లాలోని రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శాసనసభలో చర్చ.. రాంపూర్‌లో సర్వే.. రాంపూర్‌లోని అసైన్డ్ భూముల వ్యవహారంపై శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలోనే రెవె న్యూ అధికారులు సర్వే నిర్వహించారు. రాంపూర్ పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతంలోని పొన్నాలకు చెం దిన తిరుమల హెచరీస్ భూముల్లో బుధవారం రెవె న్యూ, ల్యాండ్ సర్వే అధికారులు సర్వే చేశారు. కలెక్ట ర్ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ధర్మసాగర్ ల్యాండ్ సర్వే డి ప్యూటీ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, ఆర్ఐ కరణ్బాబు, రాంపూర్ వీఆర్వో సింగ్‌లాల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇదీ నేపథ్యం ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన భూములలోని సర్వే నంబర్లు 337, 339/2లోని 8.28 ఎకరాలను అదే గ్రామానికి చెందిన దళితులకు 1971లో ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అనంతరం ఈ భూములను ప్రభుత్వం 1987లో ఏపీఐఐసీకి అప్పగి స్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ ఈ భూముల ను పొన్నాల లక్ష్మయ్యకు చెందిన తిరుమల హెచరీస్ కు అప్పగించింది. దళితులకు చెందిన భూములను తిరుమల హెచరీస్ అక్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకుందని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ అసైన్డ్ భూమిని పొ న్నాలకు అప్పగించిందంటూ అప్పట్లో వివాదం చెల రేగింది. తిరుమల హెచరీస్ గడువులోపు పరిశ్రమ స్థాపించలేదు. పౌల్ట్రీ పరిశ్రమలో వచ్చిన బర్డ్‌ప్లూ కారణంగా స్థాపించలేకపోయామని తిరుమల హెచరీస్ ఏపీఐఐసీకి వివరణ ఇచ్చింది. గడువు ముగియడంతో 2013లో భూముల కేటాయింపు రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇంకా అమ లు కాలేదు. సాధారణ ఎన్నిల ముందు ఈ భూములపై వివాదం రేగింది. దీనిపై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్ట ప్రకారం నేరం. దీనికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా శిక్షగా ఉంది. తమ ఆదీనంలో అసైన్డ్ భూములు ఉన్నట్లు తేలితే మూడు నెలల్లో వాటిని ప్రభుత్వానికి అప్పగించాలి. లేని పక్షంలో శిక్షకు అర్హులు అవుతారు. -
పీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్‌గా శ్రీనివాసరావు
వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యదర్శిగా, మీడియా కన్వీనర్‌గా ఈవీ శ్రీనివాసరావును నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శ్రీనివాసరావు హైదరాబాద్‌లో పొన్నాల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసరావు 20 ఏళ్లుగా ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్తర్తించారు. పార్ట్లీ మీడియా బాధ్యతలు సైతం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ పదవిని కేటాయించినట్లు పొన్నాల తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని ఎప్పటికి గుర్తింపు ఉంటుందని, ఇందుకు నిదర్శనం తానేనని అన్నారు. పార్టీకి, మీడియాకు మధ్య సమన్వయం చేస్తూ కాంగ్రెస్ ప్రతిష్ట పెరిగేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఈ అవకాశమిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు జిల్లా, నగర కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు. -
ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ లొల్లి
ఖమ్మం : జిల్లా కాంగ్రెస్ సారథి ఎంపికపై కొనసాగుతున్న లొల్లి ఢిల్లీకి చేరింది. ఏ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తే ఏ తంటా వస్తుందోనని తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ చేతులెత్తేయండంతో ఈ అంశం హస్తినాకు చేరింది. డీసీసీ అధ్యక్షుడెవరో తేల్చేందుకు ఈనెల 15న ఢిల్లీ పెద్దలు ముహూర్తం పెట్టారు. అక్కడి నుంచి టీపీసీసీకి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఢిల్లీకి పయనం కావాలని జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ నాయకులు వర్తమానం పంపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదనే నెపంతో అప్పటి డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన డీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి అప్పగించకుండా కార్యాలయ ఇన్చార్జీల పేరుతో ఐదుగురు సభ్యులను నియమించారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతోపాటు పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరడంతో జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఎవరో ఒకరిని ఎంపిక చేసి కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులు భావించారు. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉన్న నాయకుడిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించుకునేందుకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పావులు కదిపారు. తమ వర్గీయుడికే పదవి ఇవ్వాలని పట్టుపట్టడంతో ఈ వ్యవహారాన్ని టీపీసీసీ ఏటూ తేల్చలేకపోయింది. ఈ వ్యవహారాన్ని ఏఐసీసీకి వదిలేసింది. ఈ నేపథ్యంలో 15న పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని జిల్లా నాయకులకు అధిష్టానం కరుబు పంపింది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీనివాస్, జానారెడ్డి, జిల్లా పార్టీ ఇన్చార్జ్ కుసుమ కుమార్ పాల్గొనే ఈ భేటీకి ఖమ్మం, పాలేరు, మధిర ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఖమ్మం డీసీసీ అధ్యక్ష పదవి ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రేణుకాచౌదరి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, షోకాజ్ నోటీసులు ఇప్పించుకోవడం జరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో ఈనెల 15న హస్తినలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ జిల్లా సారథి ఎంపిక సాఫీగా జరుగుతుం దా..? అనే చర్చ జిల్లా కాంగ్రెస్ శ్రే ణుల్లో సాగుతోంది. -
ముఖ్యులు దూరం
కాంగ్రెస్ సభ్యత్వ నమోదుకు ప్రధాన నేతలు గైర్హాజరు తెలంగాణ పీసీసీ చీఫ్ వైఖరే కారణమని పార్టీ శ్రేణుల్లో చర్చ వచ్చిన నాయకులు కూడా అలకపాన్పు దూషణలు.. కొట్లాటలతో సాగిన ప్రారంభ సమావేశం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన పొన్నాల వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హన్మకొండలోని డీసీసీ భవన్లో మంగళవారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆ పార్టీలోని గ్రూపు తగాదాలను మరోసారి బహిర్గతం చేసింది. ప్రారంభ సమావేశానికి పలువురు ముఖ్య నేతలు దూరంగా ఉండగా, అలకపాన్పులు.. తోపులాటల మధ్యనే కార్యక్రమాన్ని కొనసాగించారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మాజీ మంత్రి సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల, జిల్లాకు చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎమ్మెల్యే కవిత, మాజీ చీఫ్ విప్ గండ్ర, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వెంకటస్వామిగౌడ్, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి తదితరులు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. జిల్లాపరిషత్ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో పొన్నాల హాజరైన ఈ సమావేశానికి కావాలనే దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వేదికపైకి నేతలను ఆహ్వానించే సమయంలో ప్రొటోకాల్ పాటించలేదంటూ పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిరమాదేవి అలకబూనారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుడు వరదరాజేశ్వర్‌రావు ఆమెకు నచ్చజెప్పి వేదికపైకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వేదికపైకి తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు బస్వరాజు కుమారస్వామిని ఆహ్వానించాలని కొందరు నినాదాలు చేశారు. దీంతో ఆయనను వేదికపైకి ఆహ్వానించారు. ఇక.. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల మాట్లాడుతుండగా నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా లేచి తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వారిని పలువురు నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పర దూషణలు చేసుకుంటూ కొట్లాటకు దిగడంతో వారిని హాలు నుంచి బయటికి వెళ్లగొట్టారు. వీరందరూ మాధవరెడ్డి అనుచరులుగా భావిస్తున్నారు. గందరగోళం మధ్యనే డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ పొన్నాల ముందుగా రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌కు సభ్యత్వ నమోదు రశీదును అందజేశారు. ఆ తర్వాత వరుసగా నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ కార్యదర్శి డాక్టర్ హరిరమాదేవికి సభ్యత్వం కల్పిస్తూ రశీదులు ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సమావేశంలో నాయకులు విజయరామారావు, కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, బండా ప్రకాష్, బొచ్చు సమ్మయ్య, పుల్లా పద్మావతి, పుల్లా భాస్కర్, మంద వినోద్‌కుమార్, సాంబారి సమ్మారావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వరద రాజేశ్వర్‌రావు, జంగా రాఘవరెడ్డి, ఘంటా నరేందర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్, జమాల్ షరీఫ్, బట్టి శ్రీనివాస్, పోశాల పద్మ, నమిండ్ల శ్రీనివాస్, డాక్టర్ శ్రీధర్, కొత్తపల్లి శ్రీనివాస్, మెడకట్ల సారంగపాణి, ఆశం కళ్యాణ్, చందుపట్ల ధన్‌రాజ్, మండల సమ్మయ్య, కూర కుమార్, బిన్ని లక్ష్మణ్, తాడిశెట్టి మధు, నలుబోల రాజ, తోట వెంకన్న, నెక్కొండ కిషన్, పసుల యాకస్వామి, కానుగంటి శేఖర్, నరొత్తమరెడ్డి పాల్గొన్నారు. కాగా, పొన్నాలను జిల్లా నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు. దొరల పాలనగా మారితే సహించరు : పొన్నాల కొత్త రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన దొరల పాలనగా మారితే ఈ గడ్డ ప్రజలు సహించరని... చరమగీతం పాడుతారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. ప్రజాస్వామ్య ముసుగులో సీఎం కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ప్రజలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల 240 మంది ైరె తులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వీరిని పరామర్శించే తీరిక ఈ నాయకులకు లేదా.. అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను ఆదుకోవడంతో జాప్యం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం... చివరకు 460 మందిని ఆదుకుంటున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. 1200 మందికి అండగా నిలిస్తే పోయేదేముందని పొన్నాల అన్నారు. చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్, మూడెకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, 120 గజాల్లో ఇళ్ల నిర్మాణంలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. జిల్లాకు గోదావరి నీళ్లు, గూగుల్‌తో ఒప్పం దం చేసుకుని 3జీ సేవలు, ఐటీఐఆర్ తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలంటూ కాళోజీ సభలో ఉప ముఖ్యమంత్రి రాజయ్యను హెచ్చరించారని, అదే పది రోజుల్లో హెల్త్ యూనివర్సిటీ ఎలా వచ్చిందన్నారు. కేసీఆర్ పాలన రికార్డేనని, ఖరీఫ్‌లో రుణమివ్వకుండానే కాలం గడిచిందని... ఎంసెట్ కౌన్సిలింగ్, నంబర్ ప్లేట్లు, ఫాస్ట్ పథకంపై కోర్టు మొట్టికాయలు వేసిందంటూ ఎద్దేవా చేశారు. సభ్యత్వ రశీదు అపురూపమైందంటూ 1948లో ‘మా అయ్య జీతగాడిగా కాంగ్రెస్ సభ్యత్వ రశీదు తీసుకుని 1990 వరకు దాచుకున్నాడని’ వివరించారు. విద్రోహుశక్తుల దాడుల్లో ఇల్లు ధ్వంసం కావడంతో అది కాలిపోయిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియూ గాంధీ తెలంగాణ ఇస్తే ప్రజలు ఆదరించలేదన్నారు. తెలంగాణ ఒక్క కేసీఆర్‌తో రాలేదని అన్ని వర్గాలు కలిసి ఒత్తిడి తెచ్చారన్నారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. వివాదాలు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ పటిష్టానికి కృషిచేయాలని, రానున్న నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్వరలో జిల్లా నూతన కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచిం చారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ జలధార వంటిదని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తిరిగి నిలబడుతుందన్నారు. -
ఢిల్లీలో డీకే అరుణ బిజీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను కలిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌తో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య కూడా డీకే అరుణ వెంట ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను మార్చే యోచన ఉంటే తన పేరు పరిశీలించాల్సిందిగా పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్షం నాయకత్వ బాధ్యతల కోసం కూడా డీకే అరుణ తీవ్ర ప్రయత్నాలు చేశారు. సీనియర్ నేత జానారెడ్డికి ఆ పదవి దక్కడంతో డీకే అరుణ ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన మహిళగా తనకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని బలోపేతం చేస్తానని దిగ్విజయ్‌కు చెప్పినట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రిగా అవకాశమిస్తామని పార్టీ చేసిన ప్రకటనను డీకే ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు సమాచారం. గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని మహిళలకు కేటాయించని విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ తాను పీసీసీ రేసులో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సన్నిహితవర్గాలు వెల్లడించాయి. పీసీసీ రేసులో తాను లేనంటూ కొందరు చేస్తున్న ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టేందుకే పార్టీ నేతలను తమ నాయకురాలు కలిసినట్లు డీకే సన్నిహితులు చెబుతున్నారు. -
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన: పొన్నాల
గవర్నర్‌కు టీపీసీసీ చీఫ్ పొన్నాల లేఖ సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. ఆప్షన్ల ప్రకారమే రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులుంటాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు అయోమయంలో ఉన్నారన్నారు. ఉద్యోగుల విభజనకు ఆప్షన్లు ఒక్కటే ప్రామాణికం కాదని ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం-2014లో ఇతర మార్గాలనూ సూచించిందని గుర్తు చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరిగితేనే తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని పొన్నాల పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుత సచివాలయాన్ని రెండుగా భాగాలుగా విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లకు కేటాయించాలని తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలె త్తే అవకాశం ఉందని తెలిపారు. ఒకే కంపౌండ్‌లో రెండు రాష్ట్రాల సచివాలయాలు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఉండడం వల్ల ప్రభుత్వాల పనితీరుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌ను వీడినా బహిష్కరణ వేటు!
వనమా, దొంతి, మరో 10 మందిపై ఆరేళ్ల వేటు సాక్షి, హైదరాబాద్: పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసినా కూడా.. వారిని బహిష్కరిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చిత్రమైన నిర్ణయం తీసుకుంది. పార్టీకి రాజీనామా చేసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డిలను ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వీరితో పాటు మరో 10 మందిపైనా బహిష్కరణ వేటు వేసింది. తక్షణమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. వాస్తవానికి వనమా, మాధవరెడ్డి 10 రోజుల కిందే కాంగ్రెస్ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు.ప్రస్తుతం వనమా వైఎస్సార్సీపీ కొత్తగూడెం అభ్యర్థిగా, మాధవరెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయినప్పటికీ ఇరువురు నేతలను బహిష్కరించడం పట్ల టీ పీసీసీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వద్ద శనివారం విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావించగా... ‘‘వాళ్లు పార్టీకి రాజీనామా చేసినట్లు మాకు తెలియదు. పత్రికల్లో మాత్రమే చూశాను. ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై చర్యలు తీసుకున్నాం’’అని చెప్పడం గమనార్హం. వనమా వెంకటేశ్వరరావు ఇప్పటికే వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా.. ఇంకా బహిష్కరించడం దేనికని ప్రశ్నించగా... ‘అదంతా మాకు తెలియదు’అని పొన్నాల పేర్కొన్నారు. కాగా, బహిష్కరణకు గురైన మిగతా నేతలు.. వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ (ఖమ్మం), రామ సహాయం నరేష్‌రెడ్డి, భూక్యా ప్రసాద్ (వరంగల్), వై.బాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఎం.కృష్ణ, ఎం.వెంకటరెడ్డి, కె.గురునాథ్‌రెడ్డి (రంగారెడ్డి), ఎం.సోమేశ్వరరెడ్డి, ఎం.గాలిరెడ్డి(మెదక్) ఈ జాబితాలో ఉన్నారు. -
12 మంది కాంగ్రెస్ రెబెల్స్‌పై వేటు
పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించిన టీపీసీసీ మల్రెడ్డి రంగారెడ్డికి మినహాయింపు సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కాంగ్రెస్ రెబెల్స్‌పై వేటు పడింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసిన 12 మంది తిరుగుబాటు అభ్యర్థులను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయం తీసుకుంది. మహేశ్వరం నియోజకవర్గంలో బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చింది. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డిసహా సభ్యులంతా సమావేశమై తిరుగుబాటు అభ్యర్థుల అంశంపై చర్చిం చారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో 18 మం ది నాయకులు పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేసినట్లు రూపొందించిన జాబితాను పొ న్నాల ముందుంచారు. అందులో కూకట్పల్లి రెబెల్స్ కర్రె జంగయ్య, తూము ఎల్లారావు ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నామ ని, ఇకపై కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పేర్కొంటూ పొన్నాలను కలిసి లేఖ ఇచ్చారు. అలాగే నారాయణపేట్‌లో రెబెల్స్‌గా ఉన్న పి.నర్సింహారెడ్డి, రెడ్డిగారి రవీందర్‌రెడ్డితోపాటు జనగాంలో పొన్నాలకు వ్యతిరేకంగా బరిలో నిలిచిన బక్కా జడ్సన్‌లు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తామని మౌఖికంగా హామీ ఇచ్చినందున వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని నిర్ణయించారు. క్రమశిక్షణా సంఘం సభ్యులు డీవీ సత్యనారాయణ, ఫారూఖ్ హుస్సేన్, బండ ప్రకాష్‌లతో కలిసి చైర్మన్ కోదండరెడ్డి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన 12 మందిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు. పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్రెడ్డి రంగారెడ్డిపై చర్యల అంశం తమ పరిధిలోకి రాదన్నారు. అధిష్టానం ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని వివరించారు. -
బెర్తులు బేఫికర్
సాక్షి, సంగారెడ్డి: సిట్టింగ్ లోక్‌సభ సభ్యులనే పార్టీ తరఫున బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది. పాత రేసు గుర్రాలతోనే పందెం నెగ్గాలని యోచిస్తోంది. మెదక్ నుంచి విజయశాంతి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ల అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకత్వం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ‘వార్ రూం’లో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు నిర్వహిస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీలతో పాటు వారికి ప్రత్యామ్నాయంగా ఇతర అభ్యర్థుల పేర్లను సూచిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీ సీసీ), గాంధీభవన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లు స్క్రీనింగ్ కమిటీకి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించి ఉన్నాయి. ‘వార్ రూం’ భేటీలో మెదక్, జహీరాబాద్ లోక్‌సభల నుంచి మళ్లీ సిట్టింగ్ అభ్యర్థులనే బరిలో దింపాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయ అభ్యర్థులతో పోలిస్తే సిట్టింగ్ లోక్‌సభ సభ్యులే ధీటైన పోటీ ఇస్తారనే భావనను పార్టీ నాయకత్వం వెల్లడించినట్లు సమాచారం. తెలంగాణ ప్రాంత లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే ప్రకటించనుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాములమ్మ ధీటైన అభ్యర్థి ఆరునూరైన మెదక్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తానని ఎంపీ విజయశాంతి మంకుపట్టు పడుతున్నారు. ఆమెకే టికెట్ కేటాయించాలని టీపీసీసీ ప్రతిపాదిస్తే.. ఆర్ మోహన్ నాయక్, సోమేశ్వర్ రెడ్డి, రాపోలు విజయభాస్కర్, ఉమాదేవిల పేర్లను గాంధీభవన్ సిఫారసు చేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నవారిలో విజయశాంతి ధీటైన అభ్యర్థిగా అధిష్టానం భావిస్తోంది. రేసులో ముందుంజలో ఉండటంతో ఆమెకు టికెట్ ఖాయమని చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చాగండ్ల నారేంద్రనాథ్పై 6077 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ప్రారంభంలో టీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరిగా చక్రం తిప్పిన రాములమ్మ.. పార్టీ అధినేత కేసీఆర్‌తో చెల్లమ్మ అని అనిపించున్నారు. ఈసారి ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయశాంతికి బదులు స్వయంగా కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం సాగింది. దీని పర్యావసానాల నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం.. ఆ కొంత కాలానికి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ తరఫున మళ్లీ టికెట్ ఆశించిన చాగండ్ల నరేంద్రనాథ్ పార్టీని వీడి బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో మెదక్ లోక్‌సభ స్థానం ఈ ఆసక్తికర పరిణామాలను చవిచూసింది. ఒక వేళ టీఆర్ఎస్ తరఫున మెదక్ లోక్‌సభ నుంచి కేసీఆర్ బరిలోకి దిగితే ఆయనకు, విజయశాంతికి మధ్య ఆసక్తికరమైన పోరు జరిగే సూచనలున్నాయి. సురేష్‌కు లైన్ క్లియర్ జహీరాబాద్ లోక్‌సభ స్థానం టికెట్టు కోసం సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ ఎం. జైపాల్‌రెడ్డిల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. సుదర్శన్‌రెడ్డి, ఎం. జైపాల్‌రెడ్డిల పేర్లను టీపీసీసీ ప్రతిపాదిస్తే డీసీసీ మాత్రం సురేష్ షెట్కార్ పేరునే ప్రతిపాదించింది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సైతం సురేష్ షెట్కార్ పేరునే బలపర్చినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులు, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే శివరావు షెట్కార్ కుమారుడు సురేష్ షెట్కార్ 1994లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆసమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడంతో టీడీపీ అభ్యర్థి ఎం.విజయ్పాల్రెడ్డికి విజయం వరించింది. సురేష్ షెట్కార్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో పదవులు చేపట్టారు. 2004లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సీట్ల సర్థుబాటులో భాగంగా 2009లో సురేష్ షెట్కార్ జహీరాబాద్ లోక్‌సభకు మారాల్సి వచ్చింది. నారాయణఖేడ్ అసెంబ్లీ నుంచి పి.కిష్టారెడ్డి, జహీరాబాద్ లోక్‌సభ నుంచి సురేష్ షెట్కార్‌లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆనాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఈ సర్దుబాటును మళ్లీ కొనసాగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. -
గెలుపోటములకు నాదే బాధ్యత: పొన్నాల
సామాజిక న్యాయానికి పెద్దపీట: పొన్నాల కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్తో పొత్తు వద్దనే చెప్పారు ‘బంగారు తెలంగాణ’ కోసమే ఇంకా తలుపులు తెరిచి ఉంచాం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో గెలుపోటములకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని, ఆ కోణంలో అంశంపైనే తొలి సంతకం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సోనియాగాంధీ పట్టుదలవల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందే తప్ప టీఆర్ఎస్తో కాదని అన్నారు. క్షేత్రస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ నాయకులంతా టీఆర్ఎస్తో పొత్తు వద్దని ముక్తకంఠంతో చెప్పినా ‘బంగారు తెలంగాణ’ కోసమే కలిసొచ్చే పార్టీలతో పొత్తు కోసం తలుపులు తెరిచి ఉంచామని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పొన్నాల మాట్లాడారు. * తెలంగాణ ఏర్పాటుకు రెండు అంశాలే కారణం. అసువులు బాసిన అమరుల త్యాగాలవల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడితే, ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతోపాటు సోనియాగాంధీ చేసిన కృషివల్లే తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశంలో 27 కొత్త రాష్ట్రాలు కావాలనే డిమాండ్లతో ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాత్రం ఇచ్చింది. పార్లమెంట్లో టీఆర్ఎస్కు ఇద్దరు సభ్యులే ఉన్నారు. వారిద్దరిమధ్యా సమన్వయం లేదు, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్వల్లే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని చెబితే ఎవరు నమ్ముతారు? * తెలంగాణ రాష్ట్ర లక్ష్యంతో పార్టీ పెట్టిన వాళ్లు ఇప్పుడు పునర్నిర్మాణం అంటున్నారు. పునర్నిర్మాణం అనే పదానికి అసలైన అర్థమేమిటో మీకు (మీడియా) తెలుసు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో గత పదేళ్లలో మన రాష్ట్రం ఎంతో ముందుంది. జాతీయ సగటు ఆదాయంకంటే 20 శాతం పెరిగింది. ‘బంగారు తెలంగాణ’ సాధించే దిశగా కాంగ్రెస్ ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతోంది. 25 ఏళ్ల కోసం ప్రణాళికను రూపొందిస్తున్నాం. 50 వేల ఎకరాల్లో ఐటీఐఆర్ కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా 15.5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 50 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా రాబోతున్నాయి. * రాజకీయ లబ్ధి కోసం ఒక పార్టీ పదేపదే రెచ్చగొడుతోంది. తద్వారా రాజకీయ అనిశ్చితి ఏర్పడితే పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. * కాంగ్రెస్ నుంచి ఎవరూ టీఆర్ఎస్లోకి వెళ్లడం లేదు. కొండా సురేఖ దంపతులు పార్టీలు తిరిగి వచ్చారు. జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటామని రాసిచ్చారు. వారు కోరిన వెంటనే మున్సిపల్ అభ్యర్థులకు సంబంధించి బి.ఫారాలు వారి చేతికిచ్చాం. ఆ తరువాత గంటకే టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. * ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జనాభా ఎక్కడా లేనివిధంగా 87.2 శాతం తెలంగాణలో ఉంది. కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు సామాజిక కోణంతో ముడిపడి ఉంది. అధికారంలోకి వస్తే తప్పకుండా సామాజిక న్యాయం దిశగానే చర్యలు తీసుకుంటాం. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కృషిచేస్తాం. * ఉద్యోగుల ఆప్షన్ల విషయంలో తెలంగాణ బిల్లులో పొందుపర్చిన అంశాల మేరకు వ్యవహరిస్తాం. పోలవరం డిజైన్ మార్పు విషయంలోనూ అంతే. బిల్లులో ఆ రెండు అంశాలకు సంబంధించి పరిష్కార మార్గాలున్నాయి. పోలవరం మాదిరిగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం. * వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు వస్తాయనే నమ్మకం ఉంది. -
గ్రేటర్లో వీరికి టిక్కెట్లివ్వండి!
పీసీసీకి దానం సిఫారసు 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులతో జాబితా సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న కాంగ్రెస్ నేతల జాబితా సిద్ధమైంది. మొత్తం 24 స్థానాలకు గాను పాతబస్తీలోని 3 మినహా మిగతా 21 స్థానాల్లో పోటీకి నేతల పేర్లను ప్రతిపాదిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఓ జాబితాను రూపొందించారు. వీరికి టిక్కెట్లు కేటారుుంచాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సిఫారసు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ విజయావకాశాలు, ప్రతికూలతలను కూడా వివరించారు. చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు ఎస్.జైపాల్‌రెడ్డి ఆసక్తిగా లేరని, మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ అసెంబ్లీకి పోటీచేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఏ నియోజకవర్గానికి ఎవరు.. 1.నాంపల్లి- వినోద్‌కుమార్; 2.కార్వాన్- రూప్సింగ్; 3.చాంద్రాయణగుట్ట-అశ్విన్‌రెడ్డి; 4.యాకుత్‌పుర- సదానంద్ ముదిరాజ్; 5. పటాన్చెరు -నందీశ్వర్‌గౌడ్; 6.మల్కాజ్గిరి-ఆకుల రాజేందర్/శ్రీధర్; 7.కుత్బుల్లాపూ ర్- కూన శ్రీశైలంగౌడ్/కేఎం ప్రతాప్/ కొలను హనుమంత్‌రెడ్డి; 8.కూకట్పల్లి- వెంగళరావు/ప్రకాశ్‌గౌడ్/సిరాజుద్దీన్/బీరం ఇందారెడ్డి/రోహిణ్‌రెడ్డి; 9.ఉప్పల్-బండారు రాజిరెడ్డి/లక్ష్మారెడ్డి/శివారెడ్డి/రాగిడి లక్ష్మారెడ్డి; 10.ఎల్బీనగర్-డి.సుధీర్‌రెడ్డి/రాముగౌడ్; 11.మహేశ్వరం-సబితా ఇంద్రారెడ్డి(ఈమె రాజేంద్రనగర్‌లో పోటీ చేయాలని భావిస్తున్నారు); 12.రాజేంద్రనగర్-సబితా ఇంద్రారెడ్డి/ కార్తీక్‌రెడ్డి(సబిత కుమారుడు), 13.శేరిలింగంపల్లి -భిక్షపతి యాదవ్/జగదీశ్వర్‌గౌడ్; 14.ముషీరాబాద్-శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎం.కోదండరెడ్డి, విక్రమ్‌గౌడ్, డాక్టర్ వినయ్‌కుమార్, సీహెచ్.బాలరాజు, సురేష్‌కుమార్, 15.అంబర్‌పేట- వి.హనుమంతరావు/ఎ.ఉదయ్‌కుమార్/గరిగంటి రమేశ్; 16.ఖైరతాబాద్-దానం నాగేందర్; 17.జూబ్లీహిల్స్-పి.విష్ణువర్ధన్‌రెడ్డి; 18.సనత్‌నగర్- ఎం.శశిధర్ర్రెడ్డి/ఎం.పురూరవారెడ్డి; 19.గోషామహల్-ముఖేశ్‌గౌడ్/విక్రమ్‌గౌడ్; 20.కంటోన్మెంట్- పి.శంకర్రావు/పి.సుస్మిత/సర్వే సత్యనారాయణ/బి.కైలాశ్‌కుమార్/దేవుడు/ఎన్.శ్రీగణేశ్; 21.సికింద్రాబాద్-జయసుధ/ఆదం ఉమాదేవి/ఆదం సంతోష్/పి.లక్ష్మణ్‌రావు/పిట్లకృష్ణ (బహదూర్‌పురా, చార్మినార్, మలక్‌పేట నియోజకవర్గాలకు ఎవరిపేర్లను ప్రతిపాదించలేదు) -
భువనగిరి పార్లమెంట్‌కు పొన్నాల?
* జనగాం నుంచి పొన్నాల కోడలు పోటీ * నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి * మిర్యాలగూడ నుంచి జానా తనయుడు కె. రఘువీర్‌రెడ్డి * హుజూర్నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి * కోదాడ నుంచి ఆయన సతీమణి పద్మావతి * నల్గొండ కాంగ్రెస్ కమిటీ నుంచి పీసీసీకి అందిన జాబితా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈసారి లోక్‌సభ సీటుపై కన్నేశారు. నల్లగొండ జిల్లా భువనగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ జిల్లా జనగాం శాసనసభ నియోజకవర్గం నుంచి కోడలు వైశాలిని బరిలో దింపాలని భావిస్తున్నారు.టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసారి కూడా నల్లగొండ హుజూర్నగర్ నుంచే పోటీ చేయనున్నారు. ఆయన సతీమణి పద్మావతిని కోదాడ నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయనుండగా.. ఆయన తనయుడు కె.రఘువీర్‌రెడ్డిని మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు. నల్లగొండ జిల్లా పరిధిలోని శాసనసనభ, లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావాదుల జాబితాను స్థానిక డీసీసీ రూపొందించి మూడు రోజుల కిందట పీసీసీకి పంపింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అధ్యక్షతన ఈనెల 13న జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) ముందుకు ఈ జాబితా చేరింది. మరో రెండ్రోజుల్లో ఈ జాబితా ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ముందుకు వెళ్లనుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్ప పొన్నాల పేరు దాదాపుగా ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. పొన్నాల ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జనగాం అసెంబ్లీ స్థానం నియోజకవర్గ పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పొన్నాల ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ పొన్నాలకు ఎంపీ టిక్కెట్ ఖరారైతే.. జనగాం నుంచి ఆయన కోడలు వైశాలిని బరిలో దింపుతున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి ఆమె పేరును కూడా సిఫారసు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ డీసీసీ జాబితాలోని వివరాలిలా ఉన్నాయి. నల్లగొండలో ‘గుత్తా’ధిపత్యమే! నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును మాత్రమే సూచించారు. భువనగిరికి మాత్రం మొదట పొన్నాల లక్ష్మయ్య పేరును చేర్చారు. ఆ తర్వాత వరుసగా సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆర్.సర్వోత్తమ్‌రెడ్డి, టి.దేవేందర్‌రెడ్డి(డీసీసీ అధ్యక్షుడు) పేర్లను సిఫారసు చేశారు. కెప్టెన్ దంపతుల హవా హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరును మాత్రమే సిఫారసు చేశారు. పక్కనే ఉన్న కోదాడ నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి పద్మావతి పేరును పంపారు. ఇక్కడ ఇంకెవరూ పోటీ లేకపోవడంతో వీరు పేర్లు దాదాపుగా ఖరారైనట్లే. తండ్రికి సాగర్.. తనయుడికి మిర్యాలగూడ! నాగార్జునసాగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జానారెడ్డి, ఆయన తనయుడు కె.రఘువీర్ పేర్లు జాబితాలో ఉన్నాయి. జానారెడ్డి వద్దనుకుంటే తప్ప ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్లే. ఆయన కుమారుడు రఘువీర్ పేరును మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కూడా డీసీసీ సిఫారసు చేయడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేపాల శ్రీనివాస్, తిప్పన విజయసింహారెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, పీసీసీ కార్యదర్శి కంచర్ల చంద్రశేఖరరెడ్డి, స్థానిక నేత పగిడి రామలింగారెడ్డి పేర్లు కూడా సిఫారసు చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రెస్ అకాడమి ఛైర్మన్‌గా పనిచేసిన తిరుమలగిరి సురేందర్ సైతం జర్నలిస్టు కోటాలో తనకు అవకాశమివ్వాలని తాజాగా కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట దామోదర్‌రెడ్డికే సూర్యాపేట నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరును మాత్రమే సిఫారసు చేశారు. దీంతో దామోదర్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లే. ఎస్సీ నియోజకవర్గమైన నకిరేకల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, స్థానిక నాయకుడు కొండేటి మల్లయ్య, తుంగతుర్తి నుంచి గుడిపాటి నర్సయ్య, సురేందర్, ప్రీతమ్ (ఎన్ఎస్యూఐ నాయకుడు), కె.పరమేశ్, అరుణ్ పేర్లను సిఫారసు చేశారు. మరో ఎస్సీ నియోజకవర్గం తుంగతుర్తి సీటు ఇస్తామని హామీ లభించిన తర్వాతే తెలంగాణ మాల మహానాడు నాయకుడు, తెలంగాణ రాజకీయ జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దేవరకొండ (ఎస్టీ) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలూనాయక్, పీసీసీ ఎస్టీ విభాగం ఛైర్మన్ జగన్‌లాల్ నాయక్, స్థానిక నాయకులు స్కైలాప్ నాయక్, రమేశ్ నాయక్ పేర్లను పంపారు. ఆలేరు భిక్షమయ్యగౌడ్‌కే ఆలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ పేరును మాత్రమే సిఫారసు చేశారు. భువనగిరి నుంచి మాత్రం చింతల వెంకటేశ్వరరెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, లింగం యాదవ్, కె.అనిల్ పేర్లు పీసీసీకి చేరాయి. కోమటిరెడ్డికి చెక్? నల్లగొండ జిల్లాలో నాలుగు గ్రూపులుండగా జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్‌రెడ్డి వాటికి నాయకత్వం వహిస్తున్నారు. కోమటిరెడ్డి మినహా మిగిలిన ముగ్గురి నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరి పేరును మాత్రమే సిఫారసు చేసిన డీసీసీ.. నల్లగొండ నుంచి మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు స్థానిక మైనారిటీ నేత హఫీజ్‌ఖాన్ పేరును కూడా పంపడం గమనార్హం. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్‌సభ సీటుపై పొన్నాల కన్నేశారు. కోమటిరెడ్డి వర్గంలోని ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాలూనాయక్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి వారితోపాటు ప్రత్యామ్నాయ పేర్లను కూడా పీసీసీకి సూచించారు. కోమటిరెడ్డి వర్గానికి చెక్ పెట్టేందుకే జానారెడ్డి వర్గం ఈ మేరకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. -
పొత్తు కోసం వెంపర్లాడం: పొన్నాల లక్ష్మయ్య
టీఆర్ఎస్తో సరిపోతుందో లేదో చూస్తాం: పొన్నాల సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ సహా ఎవరితోనూ పొత్తుల కోసం వెంపర్లాడబోమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ సరిపోతుందో లేదో చూశాకనే ఆ పార్టీతో పొత్తు విషయమై ఆలోచిస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత బుధవారం ఢిల్లీనుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీభవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్పై ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. బడుగు, బలహీనవర్గాలు, దళితులకు కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేస్తుందని, పీసీసీ తాజా కమిటీల ఎంపికే దీనికి తార్కాణమని పొన్నాల చెప్పారు. సోనియాగాంధీ చిత్తశుద్ధి, పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది తప్ప వేరొకరెవరూ కారణం కాదని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఆవిర్భావం ఎలా జరిగిందో ప్రపంచమంతటికీ తెలుసు. ఒప్పందం చేసుకున్న వారు ఎలా వ్యవహరిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఇద్దరు ఎంపీలున్న పార్టీ (టీఆర్ఎస్)తో తెలంగాణ సాధ్యమయ్యేదేనా? పేరుకు ఇద్దరున్నా అందులో ఒకరు సరిగాలేనే లేరు. ఇలాంటి పార్టీతో 545 మంది సభ్యులున్న లోక్‌సభలో తెలంగాణ ఆమోదం పొందేదా?’’ అని ప్రశ్నించారు. పొత్తులపై టీఆర్ఎస్ ఏర్పాటుచేసిన కమిటీతో తమకు సంబంధం లేదన్నారు. పొత్తు కోసం ఆ పార్టీయే తగిన ప్రతిపాదనలతో ముందుకు వస్తే.. ఆ ప్రతిపాదనలు తమకు సరిపోతాయో లేదో, పొత్తు అవసరమా, కాదా? అన్న అంశాలు లోతుగా విశ్లేషించాక చర్చలు జరుపుతామని పొన్నాల తేల్చి చెప్పారు. ‘‘విలీనమని చెప్పిన ఆయన (కేసీఆర్) మాట తప్పాడు. ప్రజలు కూడా దీన్ని గమనించారు..’ అని పేర్కొన్నారు. తమతో పొత్తు కోసం టీఆర్ఎస్ ఒక్కటే కాదని, అనేక పార్టీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి తనంతటి నాయకుడు లేనేలేడని కేసీఆర్ అనుకుంటే తామేం చేస్తామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీపీసీసీ ఏర్పాటుపై సీనియర్లలో అసంతృప్తి లేదని చెప్పారు. దిగ్విజయ్ ఈనెల 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో ఉంటారని, తొలిరోజున టీపీసీసీ ఎన్నికల కమిటీతో సమావేశమవుతారని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించి ఘన విజయం చేకూర్చడమే తమ లక్ష్యమని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంటు పదవి అనేక రాష్ట్రాల్లో ఉందని, తెలంగాణకు కొత్తగా పెట్టలేదని సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి కుంతియా తెలిపారు. కేంద్ర మంత్రి బలరాంనాయక్, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, రాజయ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫున స్వాగతం: బుధవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయూనికి చేరుకున్న పొన్నాల, ఉత్తమ్కుమార్ల బృందానికి పార్టీ నేతలు పలువురు స్వాగతం పలికారు. హజ్ టెర్మినల్ వద్ద కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడటంతో తోపులాట నెలకొంది. ఒక దశలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పొన్నాల బృందం అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గాంధీభవన్‌కు చేరుకున్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత గాంధీభవన్‌లో ప్రత్యేక పూజలు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల ఆటపాటలతో గాంధీభవన్ కోలాహలంగా మారింది. సీనియర్ నేతలు మాత్రం ఎక్కడా కన్పించలేదు. టీపీసీసీ ఎంపిక తీరుపై తీవ్ర నిరసనతో ఉన్నందునే సీనియర్ లెవ్వరూ రాలే దని సమాచారం. కార్యకర్తల కొట్లాట పొన్నాల విలేకరుల సమావేశానికి ముందు కార్యకర్తలు కొట్లాటకు దిగారు. సమావేశ మందిరంలోనికి పార్టీ ప్రస్తుత అధికార ప్రతినిధి గడ్డం శ్రీనివాస్‌యాదవ్, ఆయన అనుచరులు రాబోగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓడి పోయిన పల్లె లక్ష్మణ్‌గౌడ్ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన శ్రీనివాస్‌యాదవ్ అనుచరులు లక్ష్మణ్‌గౌడ్ అనుచరులపై చేయిచేసుకున్నారు. లక్ష్మణ్‌గౌడ్ అనుచరులు శ్రీని వాస్యాదవ్పై పిడిగుద్దులు కురిపించారు. ఇరువర్గాలు కుర్చీలు విసురుకున్నాయి. దానం నాగేందర్ జోక్యం చేసుకుని శ్రీనివాస్‌యాదవ్‌ను సముదాయించారు. ఇలావుండగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి పొన్నాలకు స్వాగతం పలుకుతూ శంషాబాద్ విమానాశ్రయంలో ర్యాలీ నిర్వహించినందుకు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదైంది.