పీసీసీకి దానం సిఫారసు
21 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులతో జాబితా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న కాంగ్రెస్ నేతల జాబితా సిద్ధమైంది. మొత్తం 24 స్థానాలకు గాను పాతబస్తీలోని 3 మినహా మిగతా 21 స్థానాల్లో పోటీకి నేతల పేర్లను ప్రతిపాదిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఓ జాబితాను రూపొందించారు. వీరికి టిక్కెట్లు కేటారుుంచాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సిఫారసు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ విజయావకాశాలు, ప్రతికూలతలను కూడా వివరించారు. చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు ఎస్.జైపాల్‌రెడ్డి ఆసక్తిగా లేరని, మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ అసెంబ్లీకి పోటీచేయాలని భావిస్తున్నట్లు వివరించారు.
ఏ నియోజకవర్గానికి ఎవరు..
1.నాంపల్లి- వినోద్‌కుమార్; 2.కార్వాన్- రూప్‌సింగ్; 3.చాంద్రాయణగుట్ట-అశ్విన్‌రెడ్డి; 4.యాకుత్‌పుర- సదానంద్ ముదిరాజ్; 5. పటాన్‌చెరు -నందీశ్వర్‌గౌడ్; 6.మల్కాజ్‌గిరి-ఆకుల రాజేందర్/శ్రీధర్; 7.కుత్బుల్లాపూ ర్- కూన శ్రీశైలంగౌడ్/కేఎం ప్రతాప్/ కొలను హనుమంత్‌రెడ్డి; 8.కూకట్‌పల్లి- వెంగళరావు/ప్రకాశ్‌గౌడ్/సిరాజుద్దీన్/బీరం ఇందారెడ్డి/రోహిణ్‌రెడ్డి; 9.ఉప్పల్-బండారు రాజిరెడ్డి/లక్ష్మారెడ్డి/శివారెడ్డి/రాగిడి లక్ష్మారెడ్డి; 10.ఎల్బీనగర్-డి.సుధీర్‌రెడ్డి/రాముగౌడ్; 11.మహేశ్వరం-సబితా ఇంద్రారెడ్డి(ఈమె రాజేంద్రనగర్‌లో పోటీ చేయాలని భావిస్తున్నారు); 12.రాజేంద్రనగర్-సబితా ఇంద్రారెడ్డి/ కార్తీక్‌రెడ్డి(సబిత కుమారుడు), 13.శేరిలింగంపల్లి -భిక్షపతి యాదవ్/జగదీశ్వర్‌గౌడ్; 14.ముషీరాబాద్-శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎం.కోదండరెడ్డి, విక్రమ్‌గౌడ్, డాక్టర్ వినయ్‌కుమార్, సీహెచ్.బాలరాజు, సురేష్‌కుమార్, 15.అంబర్‌పేట- వి.హనుమంతరావు/ఎ.ఉదయ్‌కుమార్/గరిగంటి రమేశ్; 16.ఖైరతాబాద్-దానం నాగేందర్; 17.జూబ్లీహిల్స్-పి.విష్ణువర్ధన్‌రెడ్డి; 18.సనత్‌నగర్- ఎం.శశిధర్‌ర్‌రెడ్డి/ఎం.పురూరవారెడ్డి; 19.గోషామహల్-ముఖేశ్‌గౌడ్/విక్రమ్‌గౌడ్; 20.కంటోన్మెంట్- పి.శంకర్రావు/పి.సుస్మిత/సర్వే సత్యనారాయణ/బి.కైలాశ్‌కుమార్/దేవుడు/ఎన్.శ్రీగణేశ్; 21.సికింద్రాబాద్-జయసుధ/ఆదం ఉమాదేవి/ఆదం సంతోష్/పి.లక్ష్మణ్‌రావు/పిట్లకృష్ణ (బహదూర్‌పురా, చార్మినార్, మలక్‌పేట నియోజకవర్గాలకు ఎవరిపేర్లను ప్రతిపాదించలేదు)