పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించిన టీపీసీసీ
మల్‌రెడ్డి రంగారెడ్డికి మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కాంగ్రెస్ రెబెల్స్‌పై వేటు పడింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసిన 12 మంది తిరుగుబాటు అభ్యర్థులను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయం తీసుకుంది. మహేశ్వరం నియోజకవర్గంలో బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చింది. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డిసహా సభ్యులంతా సమావేశమై తిరుగుబాటు అభ్యర్థుల అంశంపై చర్చిం చారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో 18 మం ది నాయకులు పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేసినట్లు రూపొందించిన జాబితాను పొ న్నాల ముందుంచారు. అందులో కూకట్‌పల్లి రెబెల్స్ కర్రె జంగయ్య, తూము ఎల్లారావు ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నామ ని, ఇకపై కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పేర్కొంటూ పొన్నాలను కలిసి లేఖ ఇచ్చారు.
అలాగే నారాయణపేట్‌లో రెబెల్స్‌గా ఉన్న పి.నర్సింహారెడ్డి, రెడ్డిగారి రవీందర్‌రెడ్డితోపాటు జనగాంలో పొన్నాలకు వ్యతిరేకంగా బరిలో నిలిచిన బక్కా జడ్సన్‌లు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తామని మౌఖికంగా హామీ ఇచ్చినందున వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని నిర్ణయించారు. క్రమశిక్షణా సంఘం సభ్యులు డీవీ సత్యనారాయణ, ఫారూఖ్ హుస్సేన్, బండ ప్రకాష్‌లతో కలిసి చైర్మన్ కోదండరెడ్డి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన 12 మందిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు. పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్‌రెడ్డి రంగారెడ్డిపై చర్యల అంశం తమ పరిధిలోకి రాదన్నారు. అధిష్టానం ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని వివరించారు.
12 మంది కాంగ్రెస్ రెబెల్స్‌పై వేటు
Published Fri, Apr 18 2014 4:47 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement