సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చిన సోనియాగాందీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ప్రధాన ప్రచారఅస్త్రంతో ముందుకు సాగారు భువ నగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. భువనగిరి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోజు నుంచే తన ఎన్నికల ప్రచారంలో ‘తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి’అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ పోయారు. సిట్టింగ్ ఎంపీ కూడా అయిన రాజగోపాల్‌రెడ్డి గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాల గురించి వివరిస్తూ, రానున్న ఐదేళ్లలో చేపట్టనున్న పథకాల గురించి హామీలు ఇస్తూ ప్రచారం చే శారు. భువనగిరిలో ప్రధాని మన్మోహన్‌సింగ్ పాల్గొన్న ప్రచార బహిరంగ సభలో సైతం తెలంగాణ ఇచ్చిన యూపీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను ఆ సభలో కోరారు. , భువనగిరి, జనగామ, తుంగతుర్తి, మోత్కూరు, చౌటుప్పల్, నాంపల్లి, ఇబ్రహీంపట్నం ఇలామండల, డివిజన్ కేంద్రాల్లో జరిగిన రోడ్‌షోలు, బహిరంగ సభల్లో ఆయన అభివృద్ధి నినాదాన్నే వినిపిం చారు. తెలంగాణ కోసం గడచిన కాలంలో చేసిన పోరాటం, సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని వివరిస్తూ బంగారు తెలంగాణ కోసం మరోసారి కాంగ్రెస్‌పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను గెలిపించాలని ఆయన తన ప్రచారంలో ప్రాధాన్యం ఇచ్చారు.
తెలంగాణ ప్రజలకు చేసిన సహాయం మరిచిపోరని, అందుకోసం కాంగ్రెస్‌కు ఓటు వేసి సోనియా రుణం తీర్చుకోవాలని పదే పదే కోరారు. జిల్లాలో పేరుకుపోయిన పలు సమస్యలను ఆయన తన ఎన్నికల ఎజెండాగా చేసుకున్నారు. సాగు, తాగునీటి సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని సాధించడానికి కృష్ణా, గోదావరి జలాలను రప్పించి జిల్లాను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెబుతూ పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులిచ్చి మొదలు పెట్టిన బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిని నిధుల కొరత వేధిస్తోంది.
ఈ నిమ్స్ ఆస్పత్రితో పాటు ప్రతిమండల కేంద్రంలో వైద్య సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తానని ఓటర్లకు మాటిచ్చారు. సాగునీటి సమస్య తీవ్రం గా ఉన్న భువనగిరి లోక్‌సభపరిధిలో ఇప్పటికే చేపట్టిన బునాదిగాని కాల్వ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ తదితర పథకాలను పూర్తి చేయడానికి చేసిన కృషిని వివరించారు. మర్రిగూడ, నాంపల్లి, సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్ ఇలా.. పలు మండలాల్లో ఫ్లోరైడ్ పీడితులు వందల సంఖ్యలో ఉన్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ చాలా మంది అభ్యర్థులకు ఇది ఎన్నికల హామీగానే మారిందని, కానీ, తాను మాత్రం ఈ పీడనుంచి విముక్తి కలిగిస్తానని ఆయన మండలాల్లో జరిగిన ప్రచారంలో హామీ ఇచ్చారు.
బంగారు తెలంగాణ ఎజెండాగా.. ప్రచారంలో ముందుకు
Published Wed, Apr 30 2014 3:47 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement